Advertisement

Advertisement


Home > Articles - Chanakya

అడిగితే జవాబు ఇవ్వరేమి?

అడిగితే జవాబు ఇవ్వరేమి?

అడిగేవాడికి చెప్పేవాడు  లోకువ అన్నది నానుడి.కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో అడిగేవాడే లోకువైపోయాడు. తెలుగుదేశం జవాబుదారీ తనాన్ని తుంగలో తొక్కేస్తోంది. ప్రశ్న అడగడం భయం, జనాలు విరుచుకు పడిపోతున్నారు. దాంతో ఎవరు నోరు విప్పడానికే జంకే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో నెలకొంది. నిజంగా ఇదో రకమైన అరాచక పరిస్థితి. ప్రజాస్యామ్యానికి కీలకమైన ప్రతిపక్షాన్ని తెలుగుదేశం పార్టీ అస్సలు కేర్ చేయడం లేదు. 

పోనీ అలా అని వారేమన్నా పారదర్శకంగా చేసుకు వెళ్తున్నారా అంటే అదీ లేదు. వారి చిత్తానికి చేసుకుపోతున్నారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి అంటారు. మళ్లీ అంతలోనే తాత్కాలిక రాజధాని అంటారు. ఎందుకీ అనవసర వ్యయం అన్నది అర్థం కాదు.సరే మన పాలన మన గడ్డమీద నుంచి చేసుకుంటాం అని అనుకుందాం, మరి అలాంపుడు హైదరాబాద్ లో మూడు కోట్లకు పైగా విలువైన కాన్వాయ్ ఎందుకు? 

హైదరాబాద్ లో చంద్రబాబు ఏం చేస్తారు..తన ఇంటి నుంచి పార్టీ ఆఫీసుకు, అవసరమైతే పార్టీ ఆఫీసు నుంచి బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రత్యేక విమానం లేదా, హెలికాప్టర్ ఎక్కేందుకు. అంతకు మించి హైదరాబాద్ లో ఆయనకు ఏ పనీ లేదు. మరి దానికోసం సరికొత్త కాన్వాయ్ ఎందుకు? ఇది చాలక తిరుపతిలో, విజయవాడలో మరో రెండు కాన్వాయ్ ల బారు. కానీ చిత్రంగా మంత్రులకు మాత్రం ఖర్చు తగ్గించేందుకు, అందిరికీ కలిపి ఓ లగ్జరీ బస్ అద్దెకు తీసుకుంటారట. అంటే వారికి మాత్రం పొదుపు. తమకు మాత్రం అదుపులేని పొదుపు.

ఇదే ప్రశ్న జగన్ అడిగాడు అనుకొండి. అప్పుడు తెలుగుదేశం నిలయ విద్వాంసులైన వర్లరామయ్య, గాలి, పయ్యావుల, సోమిరెడ్డి తదితరులు అంతా ఒంటికాలిపై లేస్తారు. సమాధానం చెప్పడానికి కాదు. తిరిగి తిట్టడానికి.

జగన్ కు ఒక్క గది చాలదా..అన్ని గదుల లోటస్ పాండ్ ఎందుకు? బెంగుళూరులో ఇల్లు ఎందుకు? తల్లి కాంగ్రెస్ తో కుమ్మక్కు, పిల్ల కాంగ్రెస్ ఎన్నాళ్లో వుండదు..ప్రజలు ఛీ కొట్టినా జగన్ కు సిగ్గులేదు..చంద్రబాబు ఆంధ్ర దేశం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు.జగన్ రాజధానిని అడ్టుకుంటున్నారు కడప ఫ్యాక్షన్ ను ఆంధ్రకు తెస్తున్నారు..త్వరలో జైలుకు వెళ్తారు.

ఇలా సాగిపోతుంది. అడ్డు అదుపు లేని, ఒకదానికి మరొకటి లింక్ లేని మాటల ప్రవాహం. చిత్రంగా ఆ మాటలన్నీ వడపోసి,జల్లించినా ఎక్కడా సమాధానం అన్నది ఒక్క పదం కూడా దొరకదు. ఈ తీరు దేనికైనా ఒకటే బడ్జెట్ పై మాట్లాడినా, రాజధానిపై మాట్లాడినా, విమాన విహారాల మీద మాట్లాడినా ఇదే వరుస. అంతకు మించి అసలు విషయం టచ్ చేస్తే ఒట్టు. 

కానీ చిత్రంగా అదే తెలుగుదేశం జనాలు తెలంగాణలో మాత్రం కేసిఆర్ పై మాటల తూటాలతో విరుచుకుపడతారు. రైతుల సమస్యలంటారు..హెలికాప్టర్ లో తిరుగుతున్నావంటారు..ఎమైనా అంటారు. అదే అనే సమయంలో మాత్రం తమ నాయకుడు అలాంటి సమ్యసల్లోనే వున్నాడని, దానికి తాము సమాధానం చెప్పాల్సి వుందన్న సంగతిని ఉద్దేశ పూర్వకంగా మరిచిపోతారు.

మరి రాష్ట్రంలో ప్రశ్నలు ఎవరు అడగాలి? ఎవరు సమాధానం ఇస్తారు.

ఏ సమస్య కు అయినా టిడిపి చివరికి జగన్ జైలు కధనే ముందుకు తీసుకువస్తుంది. ఆయనకు అనుభవం లేదని, పరిణితి లేదని,ఇలా ఏవేవో విమర్శలు చేయడం ద్వారా జగన్ ను నైతికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. జగన్ ను మీరు ఎన్ని అన్నా విమర్శించండి. అభ్యంతరం లేదు. కాని అసలు విషయాలు వదలిపెడుతున్నారు. వాటికి జవాబుల కోసం ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని గమనించండి

ఈ ప్రశ్నలు అన్నీ జగన్ లేదా ఆయన పార్టీ మనుషులు మాత్రమే అడగడం లేదు. కాంగ్రెస్, సిపిఎమ్, రైతు నాయకులు, పర్యావరణ  ప్రియులు అందరూ అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం నేతలపై వుందా లేదా?

వీటన్నటికి టిడిసి నేతలు సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారో వారికే తెలియాలి. అదేమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలంటే తాను నారావారి పల్లెకు రాజధానిని తీసుకు వెళ్లగలనని ,కాని తాను అలా చేయడం లేదని వాదిస్తుంటారు. అందులో ఏమాత్రం హేతుబద్దత కనిపించదు. అసలు  అలా మాట్లాడడమే సరైన పద్దతి కాదు ,ఆయన కానీ ఆయన పార్టీ సహచరులులు కానీ ఎప్పుడు గ్రహిస్తారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?