Advertisement

Advertisement


Home > Articles - Chanakya

ఎందుకు క్లారిటీగా చెప్పరు బాబూ?

ఎందుకు క్లారిటీగా చెప్పరు బాబూ?

దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ చేస్తున్నాం. రైతుల ఆత్మహత్యలు చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నా..వ్యవసాయాన్ని లాభసాటి చేస్తా, వెఎస్, కాంగ్రెస్ రుణమాఫీకి వ్యతిరేకం తొలిజాబితా, మలిజాబితా, పరిశీలన, నెట్ లో పెడతాం..రచ్చబండకు పంపుతా..

ఇవీ తెలుగుదేశం, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాటలు.

వీటిల్లో ఎక్కడయినా, ఎంత మంది రైతులకు, ఎంత మొత్తం, ఎప్పుడు రుణమాఫీ చేస్తున్నారన్నది వుందా అంటే. వెదకాల్సిందే. చిక్కులెక్కలు చెప్పి, మాయ చేయడం తప్ప మరోటి లేదు.ఈ కింది పాయింట్లయితే వాస్తవం

నేరుగా బ్యాంకులకు రుణాలు కట్టి మాఫీ చేయడం లేదు

రైతులందరికీ రుణమాఫీ వర్తించదు.

ఇప్పటికిప్పుడు రుణమాఫీ జరగడం లేదు. ఇంకా ఇవన్నీజరిగే సరికి నెల నుంచి రెండు నెలలు పడుతుంది.

అయిదేళ్ల పాటు రుణమాఫీ విడతలు విడతలుగా చేస్తామని అంటున్నారు. అంతవరకు వడ్డీ ఎవరు చెల్లిస్తారో చెప్పారా?

వైఎస్ జగన్ రుణమాఫీ వద్దని చెప్పలేదు. అంత భారం భరించడం అసాధ్యం అని చెప్పారు. అది వాస్తవమైందా కాదా ఇప్పుడు?

రుణమాఫీ వైఎస్ వద్దన్నది ప్రజలకు అదే అలవాటైపోతుందని. కాగ్ చెప్పింది డబ్బున్నవాళ్లకు కూడా రుణమాఫీ అమలైపోయిందని. ఇప్పుడు తెలుగుదేశం ఫిల్టర్ చేసింది కూడా అందుకోసమే కదా?

రుణమాఫీ కారణంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడం ఆపేసాయా లేదా?

కొద్ది రోజుల క్రితం రుణమాఫీ జరిగిపోయింది..జరిగిపోయింది అని తెలుగుదేశం నేతలు ప్రకటనలు చేయడం వాస్తవమా కాదా?

అప్పట్లో ఎన్టీఆర్ భవన్ కు రైతులు వెళ్లి చంద్రబాబును సన్మానించారా లేదా?

మరి అప్పుడే జరిగిపోతే ఇప్పుడేమిటి? మళ్లీ ఇప్పుడు కొత్తగా సన్మానాలేమిటి?

ఇప్పుడు తెలుగుదేశం తెలంగాణలో చేస్తున్న విమర్శలకు, జగన్ ఆంధ్రలో చేస్తున్న విమర్శలకు పొంతన వుందా లేదా? ఆంధ్రలో జగన్ ది తప్పు అంటే, మరి మీరు తెరాస ను ఎలా నిలదీయగలరు?

ఇన్ని విషయాలు పెట్టుకుని, జగన్ నిరసన వ్యక్తం చేయడం, ప్రజల్ని సమీకరించడం తప్పు అంటే ఎలా? ఇప్పటికీ మీరు జగన్ అవినీతి తప్ప మరో పాయింట్ మాట్లాడడం లేదు. లేదూ, ఇదే వ్వవహారం కాంగ్రెస్ చేపడితే ఏమంటారు..అన్యాయంగా విభజించింది. అందుకే ప్రజలు తుంగలో తొక్కారు. అందువల్ల మాట్లాడే అర్హత లేదు అనేగా..ఇప్పుడు తెరాస కూడా మిమ్మల్ని విభజనను అడ్డుకున్న పార్టీ, మాట్లాడే అర్హత లేదు అంటే మీరేమంటారు?

అంటే మీరు మీ సమస్యను ఎవరైనా ప్రస్తావిస్తే, దానికి సమాధానం చెప్పరు. ఎదుటివాడి తప్పులను మాత్రం ఎత్తి చూపించి తప్పుకుంటారు. కానీ ఒకటి మాత్రం అన్నింటికన్నా వాస్తవం అని మీకూ తెలుసు. ఎంత తికమక ప్రచారం చేసినా, ఎంత ఎదురుదాడికి దిగినా, రుణమాఫే జరిగిందా లేదా అన్నది అంతిమంగా రైతుకు ఎవరూ చెప్పనక్కరలేదు. బ్యాంకువారే చెబుతారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?