Advertisement

Advertisement


Home > Articles - Chanakya

పెదనాన్న కమర్షియల్ సినిమాలు చేయచ్చుగా అన్నారు

పెదనాన్న కమర్షియల్ సినిమాలు చేయచ్చుగా అన్నారు

నారా రోహిత్..ఈ తరం హీరోల్లో ఒకరు. కానీ ఆయన సినిమాలు మాత్రం అన్ని సినిమాల్లో ఒకటిగా వుండవు. నారా రోహిత్ సినిమా అంటేనే సమ్ థింగ్ వైవిధ్యం వుంటుదని ప్రేక్షకులు నిశ్చయానికి వచ్చి చాలా కాలమైపోయింది. బాణం లాంటి డిఫరెంట్ సినిమాతో తెరపైకి వచ్చి, ఆచి తూచి సినిమాలు చేస్తూ వస్తున్నారు రోహిత్. నిజానికి తనకున్న ఇమేజ్ కు, ఫిజిక్ కు మాంచి పక్కా కమర్షియల్ సినిమా చేయచ్చు. కానీ ఇప్పటికీ డిఫరెంట్ జోనర్ కు చెందిన సినిమాలనే ఎంచుకుంటూ చేస్తూ వస్తున్నారు. అలా వస్తున్నా లేటెస్ట్ మూవీ అసుర...ఈ నేపథ్యంలో నారా రోహిత్ తో 'గ్రేట్ ఆంధ్ర' ఇంటర్వూ..

నేను చెన్నయ్ లో పెరిగాను. అక్కడ వాళ్లు మన సినిమాల గురించి కాస్త తక్కువగా మాట్లాడేవారు. పువ్వుల చొక్కాలు..డ్యాన్స్ లు ఇలా అనేవారు. ఛ..మనం మాత్రం మంచి సినిమాలు చేయలేమా..తీయలేమా అనుకునేవాడిని..అలాగే పెరిగాను. 

అసలు నేను సినిమాల్లోకి నా అంతట నేను రాలేదు. డాడీ అడిగారు. చేస్తావా అని? బాగానే వుంటుందనిపించిది. వచ్చేసా. అప్పుడే డిసైడ్ అయ్యాను. చేస్తే కాస్తయినా మంచి సినిమాలు చేయాలని?

యా...ఇలా రావడానికి అయిదేళ్లు పట్టింది. ఇప్పుడు వారికి తెలుసు, నారా రోహిత్ సినిమా అంటే సమ్ థింగ్ వుంటుందని. నేను కూడా అయిదేళ్లు ఇక్కడ వుండి, ఆపైన వుండాలా వద్దా అన్నది ఆలోచించుకోవాలి అనుకునే వచ్చాను. కొన్నాళ్ల తరువాత మన తరువాతి జనరేషన్ వచ్చాక, నేను చేసిన సినిమాలు చూసుకుంటే ఫరవాలేదనిపించాలి కానీ, ఇలాంటిసినిమా చేసానా అనిపించకూడదు అని ప్రారంభలోనే డిసైడ్ అయ్యాను.

అదేం లేదు. నేను పాటలు చేస్తున్నాను. చేస్తాను. ఫైట్లు అంతే, ఇప్పుడు అసుర సినిమాలో చాలా ఫైట్లు వున్నాయి. 

పని రాక్షసుడు..హీరో..అందుకే ఆ టైటిల్. దుష్ట సంహారం చేసేవాడు అప్పట్లో దేవుడు..ఇప్పుడు రాక్షసుడు వాడు అంటున్నారు. అదే కాన్సెప్ట్. 

ఇది సీరియస్ సినిమా అండీ..ఇక్కడ ఫన్ కు చోటు తక్కువ. కావాలని మరం ఇరికించినా దాన్ని జనాలు ఏక్సెప్ట్ చేయరు. 

ఇప్పుడు చేయబోతున్న పండగలా దిగివచ్చాడు..అలాంటిదే.

లేదు..త్వరలో చూస్తారు..అసుర సినిమాకు ఈ ఫిజిక్, ఈ బేస్ వాయిస్ అవసరం. అందుకే అలా వుంచేసాను. త్వరలో ఛేంజ్

నాకు కూడా అలా వుండడం, అలాంటి సినిమాలు చేయడం రెండూ ఇష్టమే.

దానికీ కారణం వుంది. అసలు నిర్మాణ వ్యవహారాలు ఎలా వుంటాయి అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఓకె చేసిన స్క్రిప్ట్ లు పది వరకు వున్నాయి. ఇప్పటికి నా కెరీర్ లో అయిదువందలకు పైగా కథలు విని వుంటాను. నచ్చినవి పాతికకు పైగా వుంటాయి. మాంచి పాయింట్ వినగానే ఎగ్జయిట్ అవుతాను. చేయాలనిపిస్తుంది..పక్కన వుంచుతాను. ఇలా చాలా వున్నాయి. 

అయితే ఇక్కడ ఎకనామిక్స్, మార్కెటింగ్ కూడా చూడాలి. కొన్ని సినిమాలకు ఖర్చు పెట్టాలన్నా పెట్టలేం. ప్రతినిధి సినిమాకు అంతకన్నా ఖర్చు చేయాలన్నా కుదరదు. కానీ కొన్ని సబ్జెక్టులు అలా కాదు. డిమాండ్ చేస్తాయి. కానీ నిర్మాతలు నా మీద అంత పెట్టడానికి ఆలోచించవచ్చు. కానీ ధైర్యం చేస్తే? తెలుగు సినిమా మాగ్జిమమ్ ఎర్నింగ్ 70 నుంచి 80 అని ఇప్పటికి వున్న రికార్డు చెబుతుంది. మరి రాజమౌళి వందకోట్లకు పైగా ఎలా ఖర్చు చేస్తున్నారు బాహుబలిపై. కథ డిమాండ్ చేసింది. అది పే చేస్తుంది అని నమ్ముతున్నారు కాబట్టి. సో, నేను కూడా మంచి సబ్జెక్ట్, అది పే చేస్తుంది అని నమ్మిన వాటిని నా స్వంతంగా చేయాలనుకుంటున్నాను.

లేకపోవచ్చు. కానీ దానికి చాలా కారణాలు వున్నాయి. రిలీజ్ చేసిన సమయం, ప్రఛారం ఇలా చాలా. అసుర సినిమానే తీసుకోండి. మే నెలాఖరు అనుకున్నాం. మరోరెండు పెద్ద సినిమాలు కూడా వున్నాయి. నా సినిమాకు వుండే థియేటర్లు వుంటాయి. కానీ అనవసరమైన పోటీ అవసరమా? అందుకే అందర్నీ కూర్చోబెట్టి, మాట్లాడి తేదీ మార్చాం. ఇలా స్ట్రాటజీలపై కూడా కలెక్షన్లు ఆధారపడి వుంటాయ.

తప్పకుండా, అయిదుకోట్లతో ఒక సినిమా చేసే బదులు, అయిదు సినిమాలు చేసే ఆలోచన కూడా వుంది. ఒకటి పే చేయకున్నా నాలుగు పే చేస్తాయి. కొత్తవారిని ప్రోత్సహించవచ్చు. 

నా తల్లి తండ్రుల వల్లనే. వాళ్లు నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రపంచాన్ని చూడనిచ్చారు. విషయాలు తెలుసుకోనిచ్చారు. 

లేదు. ఒడ్డున వుండి ఎన్ని సలహాలు అయినా ఇవ్వచ్చు. కానీ దిగాక మనకు ఎవరూ సలహా ఇచ్చేందుకు ముందుకురారు. మనం కూడా సరిగ్గా చేయలేకపోవచ్చు. 

అదేం లేదండీ..మంచి సినిమాలు చేస్తున్నాను. కుర్రాళ్లకు నచ్చుతున్నాయి అని పిలుస్తున్నారు. కాదనలేముగా..

పార్టీ పిలిచి పని అప్పగిస్తే, చేయడమే. ప్రచారం గతంలో చేసాను. ఇప్పటికీ పార్టీ ఎప్పుడు ఏ పని చెప్పినా ఒకె. అలా అని పార్టీ సభలన్నింటికీ వెళ్లడాలు అలాంటివి లేవు. 

(నవ్వేస్తూ) అవును.

బాగానేవున్నాయి. తరచు కలుస్తుంటాను..పోగ్రెస్ చెబుతుంటాను.

చూస్తారు..(నవ్వేస్తూ) కాస్త కమర్షియల్ సినిమాలు చేయచ్చుగా అంటుంటారు.

నా ముందు ఒకరుండడం తో నేను లక్కీ. కానీ ఇంకో ఏడాదిలో వాడి పెళ్లయిపోతే, నాకూ తప్పదు.

చాలా వున్నాయి. చాలా స్పీడప్ చేస్తున్నారు. వచ్చే ఏడాది నాలుగు సినిమాలు విడుదయ్యేలా ప్లాన్ చేస్తున్నాను.

మంచి రచయిత..దర్శకుడు. ఇప్పుడు ఆయన చేతిలో ఓ ప్రాజెక్టు వుంది. అది కాగానే డిసెంబర్ నుంచి నా సినిమా వుంటుంది. స్క్రిప్ట్ ఓకె అయింది. 

థాంక్యూ

చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?