Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

చంద్రబాబు : కాపురం చేసే కళ...

చంద్రబాబు : కాపురం చేసే కళ...

కాపురం చేసే కళ కాలు తొక్కిననాడే తెలుస్తుందని తెలుగునాట సామెత. ప్రతిపక్షం లేకుండానే.. మేమే ప్రతిపక్షం పాత్ర పోషిస్తాం.. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తాం అంటూ పడికట్టు మాటలు పేర్చి చెబుతూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం.. ఈ పదిరోజుల పాటు అసెంబ్లీని ఏ రకంగా నిర్వహించబోతున్నదో.. ముందే అర్థమైపోయింది. పదిరోజుల పాటూ పది ప్రాధాన్యతాంశాలను తీసుకోవాలని.. వాటి మీద కూలంకషంగా చర్చించాలని చంద్రబాబునాయుడు ముందే పార్టీ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. తొలిరోజు సభలో తీసుకుంటున్న సబ్జెక్టు ఏంటో తెలుసా? పట్టిసీమ.

ఈ ఒక్కమాట చాలు. తెలుగుదేశం పార్టీ.. ఈ పదిరోజుల పాటూ ఎలాంటి ప్రజా ప్రాధాన్యతాంశాలను సభలో ప్రస్తావించబోతున్నదో అర్థం చేసుకోవడానికి. పట్టిసీమ నుంచి నీళ్లు కృష్ణానదికి వచ్చి కలిసిన తర్వాత.. కృష్ణడెల్టా భూములు సస్యశ్యామలం అయిన తరువాత కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో ప్రభుత్వం తమ ఘనతను రికార్డుల్లోకి ఎక్కేలా చెప్పుకోవడమూ జరిగింది. ఈసారి అసలు ప్రసంగాల మద్యలో అడ్డుపడే వారు కూడా లేరుగనుక.. ఎడాపెడా సొంతడబ్బా కొట్టుకోవడానికి మళ్లీ పట్టిసీమతోనే ప్రారంభించబోతున్నారన్నమాట.

అంటే రాబోయే పదిరోజుల పాటూ ఇలా ప్రభుత్వం ఏదో ఒక సొంతడబ్బా కొట్టుకునే అంశాన్నే టేకప్ చేయడం.. దానిమీద అందరూ చంద్రబాబునాయుడు కృషిని కష్టాన్ని కీర్తించడం.. ఆ రకంగా అందరూ  కలిసి ముందుకుపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రతిపక్షం పాత్రను మనమే పోషించాలని చంద్రబాబునాయుడు అంటే.. అవును నిజమే కాబోలు అని ప్రజలు నమ్మితే.. పప్పులో కాలేసినట్టే. ఆ వ్యవహారాలు అంతా ఇలాగే ఉండబోతున్నాయని అందరూ సందేహిస్తున్నారు. 

మంత్రులకు తమ పార్టీ ఎమ్మెల్యేలే ప్రశ్నలు సందించాలని చంద్రబాబునాయుడు ఆదేశించారట. మొత్తానికి ఆయన ఆదేశిస్తే వారు ప్రశ్నలు అడుగుతారు. లేదంటే.. సైలెంట్ గా ఉంటారు. అడగమన్న ప్రశ్నలే ఎమ్మెల్యేలు అడుగుతారు, చెప్పమన్న జవాబులనే మంత్రివర్యులు అప్పజెబుతారు.. మొత్తానికి ఏపీ అసెంబ్లీలో ప్రజాసమస్యల డ్రామా చాలా బాగా రక్తికట్టే విధంగానే ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?