Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

‘నెహ్రూ స్త్రీ లోలత్వం’ కొత్త విమర్శ కాదే?

‘నెహ్రూ స్త్రీ లోలత్వం’ కొత్త విమర్శ కాదే?

వ్యక్తిగత ఆరోపణల గురించి.. వ్యక్తిగతంగా నాయకుల ‘కేరక్టర్ బలహీనతల’ గురించి ఎంతో మంది తమ ప్రెవేటు సంభాషణల్లో నిత్యం మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నాయకుడి హోదాలో బహిరంగంగా మాట్లాడితే మాత్రం తప్పుకింద మన సమాజం పరిగణిస్తుంది. నిత్యం ప్రెవేటుగా మాట్లాడుకునే వారు. పబ్లిక్ గా మాట్లాడడానికి వారు భయపడాలి. వారు భయపడకుండా మాట్లాడితే.. ఇక ఎవరికి కావలసినట్టు వారు స్పందించవచ్చు. అది వారి అభిప్రాయంగా గుర్తించవచ్చు. అంతే తప్ప వారు అలా మాట్లాడనే కూడదంటూ.. ఖండించడం మాత్రం తప్పు.

నెహ్రూ స్త్రీలోలత్వం గురించి భారతీయ జనతా పార్టీ నేత చేసిన వ్యాఖ్యల గురించి ఇప్పుడు రగడ నడుస్తోంది. సెక్స్ సీడీలు బయటపడిన గుజరాత్ కుర్రాడు హార్దిక్ పటేల్ తో పోలుస్తూ.. భాజపా నేత అమిత్ మాలవీయ మాట్లాడడం.. ఇప్పుడు రచ్చరచ్చ అవుతోంది. నిజానికి గుజరాత్ ఎన్నికల సమయంలో హార్దిక్ గురించి ఆరోపణలు చేయడమే చీప్ టెక్నిక్. అంతే తప్ప.. నెహ్రూ స్త్రీలోలత్వం గురించి ఆయన ప్రస్తావించిన దానిలో కొత్త విషయం ఏముందో అర్థం కావడం లేదు.

నెహ్రూకు ఉన్న స్త్రీ లోలత్వం కాంగ్రెస్ నాయకులకు తెలియని సంగతి ఎంతమాత్రమూ కాదు. పైగా ‘‘నెహ్రూకు ఉన్న ఒక అక్రమ సంబంధం వల్ల మాత్రమే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని’’ కొందరు ఆయన కుటుంబానికి ఉండే ధూర్త భక్తులు తమ ప్రెవేటు సంభాషణల్లో చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు.

ఈ దేశానికి దాస్యంనుంచి విముక్తి కోసం జరిగిన ఒక అపూర్వమైన పోరాటాన్ని, జాతి యావత్తూ కదలిన మహాసుదీర్ఘ సంగ్రామాన్ని, త్యాగాలను, బలిదానాలను అవమానించే నీచపు మాటలు అవి. ఈ దేశానికి స్వాతంత్ర్యం సంపాదించింది.. నెహ్రూ అక్రమ సంబంధం అని చెప్పుకోవాల్సి వస్తే.. వారికి గర్వంగా ఉంటుందా? ఆయన స్త్రీలోలుడని అర్థం వచ్చేలా మాట్లాడితే అవమానంగా ఉంటుందా? ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు కాంగ్రెస్ లో మాత్రమే చెల్లుతాయేమో అని అనిపిస్తోంది.

‘‘వ్యక్తుల జీవితాలు వారి వారి సొంతం

పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం.. ఏదైనా అంటాం’’

అంటాడు మహాకవి శ్రీశ్రీ. కాంగ్రెస్ నాయకులు కూడా ఇలాంటి అన్ని విమర్శలకు సిద్ధపడే ఉండాలి. విమర్శ రూపం సంతరించుకునే వరకు ఇదే విషయాన్ని వారే మురిసిపోతూ చెప్పుకునే వారనే సంగతి కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి.. హార్దిక్ వ్యవహారానికి – నెహ్రూ వ్యవహారానికి పోలిక లేకపోయినప్పటికీ.. నెహ్రూ గురించి అసందర్భంగా వచ్చిన స్త్రీలోలత్వ ప్రస్తావన గురించి.. అట్టే గొడవ చేసుకోకుండా ఉంటే వారికే మంచిది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?