Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

'ఉషాపతి' నుంచి ఉపరాష్ట్రపతి దాకా..,

'ఉషాపతి' నుంచి ఉపరాష్ట్రపతి దాకా..,

ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇప్పుడు వెంకయ్యనాయుడు పేరు వినిపిస్తోంది. తమ కూటమి అభ్యర్థిగా ఆయన పేరును ఇవాళ సాయంత్రంలోగా ధృవీకరించవచ్చు. దరిమిలా ఆయన జాతిపిత మహాత్మా గాంధీ మరియు భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ రాజగోపాలచారిల ఉమ్మడి మనుమడు గోపాలకృష్ణ గాంధీని ఢీ కొంటారు. ఎన్నికలు సత్ఫలితాలనిస్తే దక్షిణాది నుంచి ఉపరాష్ట్రపతి అవుతారు.

వెంకయ్యనాయుడుకు ఇదేమీ ఆషామాషీగా అనాయాసంగా దక్కుతున్న గౌరవం కాదు. నాలుగు దశాబ్దాలకు పైబడిన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఒకే రాజకీయ భావజాలానికి కట్టుబడి ఉన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్న రోజుల్లో కూడా ఆయన అంతే విధేయతతో ఉన్నారు. భాజపాలో తక్కువగా ఉండే దక్షిణాది ప్రముఖుల్లో ఒకరైన ఆయనకు... పార్టీకి వైభవ స్థితి వచ్చాక సహజంగానే మంచిరోజులు వచ్చాయి.

దక్షిణాది నుంచి ఆయన జాతీయ అధ్యక్షుడు అయ్యారు. అదికూడా... కేంద్రంలో పార్టీ వాజ్పేయి నేతృత్వంలో అధికారం చెలాయిస్తున్న రోజుల్లో కావడం విశేషం. అప్పట్లోనే ఆయన పార్టీలో అధికార కేంద్రంగా, నిర్ణయాత్మక శక్తిగా చక్రం తిప్పారు.

ఈ విషయమై మీడియా ప్రశ్నించినప్పుడు... ఎప్పుడో,,, 'ఉషాపతి' అయ్యాను... ఈ జీవితానికి ఇంకొక, 'పతి' కావాలనే కోరిక లేదు అని ఆయన ఛలోక్తులు విసిరారు. కాకపోతే ఇప్పుడు ఉపరాష్ట్రపతి అవుతున్నారు. ఈ ఎన్నికలో వెంకయ్య నెగ్గుకురావడం అంత ఏకపక్షంగా జరగకపోవచ్చు. ఎన్డీయే పార్టీల్లో మోడీ నిర్ణయానికి ఎదురుండకపోవచ్చు గానీ... ఎన్డీయేతర పక్షాల్లో ఎంతమేరకు మద్దతు లభిస్తుందనేది కీలకం. రాష్ట్రపతి ఎన్నికల్లో రాంనాథ్ కోవింద్ కు మద్దతిస్తున్న కొన్ని పార్టీలు వెంకయ్యకు కూడా జై కొడితే పరవాలేదు.

అయితే అందరూ ఏకరీతిగా వ్యవహరిస్తారనే నమ్మకం లేదు. ‘మహాత్మగాంధీ మనుమడు’ అనే కార్డు ప్రయోగించడం కొన్ని తటస్థ పార్టీలను యూపీఏ తమ వైపు ఇప్పటికే తిప్పుకున్నది. అదే సమయంలో.. సుదీర్ఘకాలం జాతీయ స్థాయి నాయకుడిగా.. వివిధ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతీయ పార్టీలతో కూడా సత్సంబంధాలు ఉన్న నాయకుడిగా వెంకయ్యకు గుర్తింపు ఉంది. అదే ఆయనకు ఎడ్వాంటేజీ అవుతుందని కూడా భాజపా భావిస్తోంది. తనకు ‘ఉషాపతి’ పదవి చాలుననుకున్న ఈ 68ఏళ్ల నెల్లూరు పిలగాడు దేశం గర్వించే ఉన్నతపదవిలోకి వెళ్తారో లేదో చూడాలి.

- కపిలముని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?