Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

తెలుగుజాతిదేనా నేరం?

తెలుగుజాతిదేనా నేరం?

‘దింపుడు కళ్లెం ఆశలు’ అంటూ సమైక్యవాదులను, విభజన వాదులు ఎద్దేవా చేస్తున్నారు. అయినా అలా విమర్శించడం ద్వారా వారు సమైక్యవాదులకు ఇమేజి పరంగా ఎంతో మేలు చేస్తున్నారు. అలాంటి మాటల ద్వారా వీరు సమైక్యంగా రాష్ట్రాన్ని ఉంచడానికి ‘ని జ ం గా నే’ ప్రయత్నిస్తున్నట్లుగా తెవాదులు, సీమాంధ్ర ప్రజల్ని నమ్మిస్తున్నారు. కానీ ప్రజలకు మాత్రం స్పష్టత వచ్చింది.

తెలుగు జాతి చరిత్రలో ఓ చారిత్రాత్మకమైన చీలిక పర్వానికి.. జగమెరిగిన ధూర్తులంతా సాక్షీభూతులుగా నిలుస్తున్నారు. ‘నిండుగ వెలుగుజాతి మనది’ అంటూ ప్రకటించే తెలుగుజాతి గర్వానికి మాయని మచ్చ తెచ్చిన ఆషాఢభూతులుగా ఆవిషృ్కతులు అవుతున్నారు. ‘ముందు దగా/ వెనుక దగా/ కుడిఎడమల దగాదగా’ అంటూ తెలగు ప్రజలు సమైక్యాంధ్ర పోరాటం పేరిట, అదనంగా ‘త్యాగాలకు సిద్ధం’ అనే ముసుగు కూడా తగిలించుకుని రోజులు నెడుతున్న వంచక శిఖామణులను ఈసడిస్తున్నారు. ఐక్యంగా పోరాడే స్ఫూర్తిని తెవాదులనుంచి నేర్చుకోరాదా అని.. ఛీత్కరిస్తున్నారు.

అయినా సిగ్గుచేటు ఏంటంటే... నాయకులకు చీమకుట్టినట్లు కూడా లేదు. పదును వాన కురిసినా జడవని.. జడత్వం అణువణువునా నిండిపోయిన మన నాయకజాతి.. ఏం స్పందిస్తుందని అనుకోవడం చిత్తభ్రమ. పనులు మానుకుని వారి స్వార్థ ప్రయోజనాలు ఈడేర్చడానికి వారి వాగాడంబరంపై ఆశలు పెంచుకోవడం అనవసరపు శ్రమ. 

xxxxxxxxxxxx

‘‘నేరం నాది కాదు ప్రజలది’’ అని అనడానికి ఇవాళ సీమాంధ్రకు చెందిన ప్రతి నాయకుడికి హక్కుంది. అవును మరి.. ఇవాళ రాష్ట్రం రెండు ముక్కలు అయిపోతున్నదంటే.. ‘ఇలా విడిపోవడం వలన మా ఆత్మలు క్షోభిస్తున్నాయి సార్లూ.. ఇదేదో మా నాయకులు పెద్దాళ్లు బాధపడినట్లుగా ఆస్తుల పరిరక్షణకు సంబంధించి కలుగుతున్న క్షోభ కాదు సార్లూ.. మా బతుకు తెరువుకు సంబంధించిన క్షోభ.. బతుకు భయం గురించిన క్షోభ..’’ అంటూ నివేదించుకోవడానికి కూడా ఇవాళ సీమాంధ్ర ప్రజానీకానికి హక్కులేదు. ఎందుకంటే వారు నేరం చేశారు. తెలిసి చేసినా, తెలియక చేసినా.. నేరం నేరమే.. నేరానికి శిక్ష అనుభవించి తీరాల్సిందే. అందుకే ఇప్పుడు ఈ సీమాంధ్ర తెలుగు ప్రజలు తెలియక చేసిన నేరానికి ఇక జీవిత పర్యంతమూ.. సరిదిద్దలేని.. క్షమాభిక్షతో తగ్గించలేని విభజన శిక్ష వారికి పడిపోయింది. ఇంతకూ వారు చేసిన అతిపెద్ద నేరం ఏమిటో తెలుసా? ‘నాయకులను నమ్మడం’! వీరేదో ఉద్ధరించేస్తారు. సమైక్యాంధ్ర మా లక్ష్యం అని, అందుకోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం అని అంటున్న వారు.. ఏదో ఒకటి చేసేస్తారేమో అని విశ్వసించడం. అదే వారు చేసిన అతి పెద్ద తప్పు. అందుకు జాతి ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది. 

ఇప్పుడు తెలుగు ప్రజలకు పట్టిన ఖర్మానికి కర్తలెవరో కాసింత చెక్ చేసుకుందాం...

ఆ ఇద్దరూ ఇద్దరే...

ప్రతిసారీ.. జాతికి జరుగుతున్న ప్రతి ద్రోహపర్వంలోనూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడుకు పాత్ర ఉన్నదని విశ్లేషించాలంటే నాకే సిగ్గుగా అనిపిస్తూ ఉంటుంది. చంద్రబాబునాయుడు మీద నిందలు మోపిన ప్రతిసారీ.. మనల్ని తూలనాడవలసి వచ్చేలా ఆయన అభిమానగణాలకు పని పెడుతున్నందుకు బాధగా కూడా ఉంటుంది. కానీ, ఇప్పుడు జాతికి జరుగుతున్న ద్రోహంలో చంద్రబాబునాయుడు పాత్ర చాలా ఎక్కువ. 

‘నేను లేఖ రాయకపోతే తెలంగాణ వచ్చేదేనా’ అని చంద్రబాబు స్వయంగా ప్రకటించుకున్నారు. అంతవరకు ఆయనను అభినందించవచ్చు. కనీసం ఒక విధానాన్ని స్పష్టంగా ప్రకటించుకున్నారు. కానీ సీమాంధ్రుల పట్ల అయన అత్యంత ద్రోహబుద్ధితో ప్రవర్తించారు. సమన్యాయం అనే ఒక పడికట్టు పదాన్ని పట్టుకుని వేళ్లాడుతూ.. ఆయన సుదీర్ఘకాలం ప్రజల్ని, ప్రభుత్వాల్ని వంచించారు. ‘ఇలాగేనా విభజించేది.. ఇలాగేనా.. చేతకాకపోతే..దిగిపోండి’ అంటూ తెబిల్లును కేబినెట్ ఆమోదించడానికి ముందు... చంద్రబాబు ఎన్నిసార్లు విలేకర్ల సమావేశాల్లో గొంతు చించుకుని అరిచారో లెక్కే లేదు. అయితే ‘ఏది సమన్యాయమో మీరు చెప్పండి’ అంటే ఆయన మౌనం పాటించారు. పోనీ దాన్ని కూడా సమర్థించుదాం.. అనుకుంటే.. కేబినెట్ బిల్లును ఆమోదించేసిన తరువాత.. హైదరాబాదును కేవలం తెలంగాణేక ఎలా ఇస్తారు, ఉద్యోగుల్ని ఇలా పంచుతారా? అంశాలు ఉండేది ఇలాగేనా? అంటూ.. గత జల సేతుబంధన: అన్నట్లుగా ఇప్పుడు వృథా ప్రసంగాలు ప్రారంభించారు. ఇంత మహా వంచన మరో నాయకుడినుంచి మనం ఆశించలేము. 

నిజానికి చంద్రబాబు వంచన కంటె ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వంచన చాలా ఉత్తమం అయినది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. ‘విభజన జరగదు గాక జరగదు’ అని ప్రగల్భాలు పలుకుతూ.. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపేస్తా తీరులోనే మాట్లాడుతూ వచ్చారు. ఆ ప్రగల్భాలను నమ్మినట్లే.. జనం కూడా .. ఈ మాటల్ని కూడా ‘చూద్దాంలే’ అన్నట్లు పరిగణిస్తూ వచ్చారు. అయితే కిరణ్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం తరఫున విభజన ఎలా జరగాలో.. వాటాలు వేసి.. నిర్దేశక మార్గాలు సూచించినప్పుడు వైకాపా విమర్శలు లంకించుకుంటే.. కిరణ్ మీద వారు ఎప్పుడూ విమర్శించేదే అనుకున్న వాళ్లు లేకపోలేదు. కాకపోతే.. కిరణ్ ఏదో రోజులు నెట్టుకురావడానికి సమైక్య వాదన నెతిె్తకత్తుకున్నారు తప్ప.. మరేమీ లేదని అర్థం అవుతోంది. కాపోతే.. గుడ్డికన్ను కన్న మెల్లకన్ను మేలన్నట్లు.. సదరు మహా వంచక మాజీ ముఖ్యమంత్రి కంటే... ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి వంచన కాస్త తీయనిది. 

అచేతనశూరులు.. అనాయకులు...

ఎవ్వరెన్ని తూలనాడినా చంద్రబాబును చూస్తే జాలేస్తుంది. ఆయనకోసం కొత్త పదాలు కావాలనిపిస్తుంది. ‘అనాయకుడు’ అంటే ఎలా ఉంటుంది. మనకు నాయకుడు తెలుసు వినాయకుడు తెలుసు ఇకపోతే.. అనాయకుడు అంటే.. ‘నాయకత్వ లక్షణాలు ఇసుమంతైనా లేకుండా.. నాయకత్వ ెదాను వెలగబెడుతున్నవాడు’ అనే నిర్వచనాన్ని రాసుకుంటే గనుక.. చంద్రబాబు దానికి అచ్చంగా సరిపోతారు. ఆయన ప్రతిసారీ.. మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసన చూడండి అన్నట్లుగా.. ‘నేను కూడా ఈ రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేశా’ అంటూ గతించిన వైభవకాలాన్ని నెమరువేసుకుంటూ ఉంటారు. 

ఈ ‘అనాయకుడు’ అయిన చంద్రబాబు అంతటి అచేతనమైన వారు సమకాలీన రాజకీయాల్లో మనకు కనిపించరు. ఆయన ఒక పార్టీకి  అధినేత. బహిరంగంగా అడిగితే.. రాష్ట్రం విడిపోతే.. రెండు చోట్ల తమ పార్టీనే పదవిలోకి వస్తుందని బీరాలు పలకడానికి జంకు లేని నేత. తన పార్టీలో తన మాట వేదమని ఆయన ప్రపంచాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నంలో ఆయన భ్రమలో మునిగిన ఈగలాగా కొట్టుకుంటూన్నారు. 

ఎలాగంటే.. ఆయన సమన్యాయం పాట పాడుతున్నారు. సీమాంధ్రకు న్యాయం చేసి.. రాష్ట్రాన్ని విభజించమని అంటున్నారు. కానీ సదరు నాయకాగ్రగణ్యుడి మాటలను కనీసం పార్టీ కార్యాలయం ఎదురుగా ఉండే కుక్కలు కూడా వింటున్న దాఖలా కనిపించడం లేదు. పార్టీ ఇతర నాయకులు, అనుచరులు, సహచరులు ఆయన మాటల్ని ఖాతరు చేయడం ఎన్నడో మానేశారు. చంద్రబాబు అచ్చంగా చెబుతున్న పార్టీ విధానాన్ని స్మరిస్తున్న వారు, ఆయనకు దన్నుగా వల్లిస్తున్న వారు ఇవాళ ఒక్కరు కూడా లేరు. తెదేపా చాలా స్పష్టంగా తెలంగాణ విభజన అనుకూల, సమైక్య వాద ముక్కలుగా ఎన్నడో చీలిపోయింది.. మధ్యలో అటూ ఇటూ గెంతడానికి భయమేసి.. గోడమీద నుంచి దిగకుండా.. ఆకలితో అలమటించిపోతూ ఉండే పిల్లిలాగా చంద్రబాబు మిగిలారు. 

ఈ విషయంలో కూడా సదరు చంద్రబాబు అచేతనత్వం కంటె.. కిరణ్‌కుమార్ రెడ్డి చాలా రెట్టు మేలు. కనీసం ముఖ్యమంత్రి పదవి ప్రభావమే కావొచ్చు కూడా కానీ.. ఆయన మాటను పాటించేవారు.. అదే మాటను అనుసరించే వారు ఆ పార్టీలో కొందరున్నారు. వారందరూ కలిసి ప్రజల్ని వంచిస్తున్నారు. 

జగన్ క్లీన్‌చిట్ ఇవ్వలేం...

చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్ రెడ్డి ఇద్దరూ మహావంచకులుగా తేలినంత మాత్రాన సీమాంధ్ర ప్రాంతానికి ఉన్న మూడో ప్రబల శక్తి జగన్ మోహన్‌రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు అనుకోవడానికి వీల్లేదు. కాకపోతే.. ఆయన తొలిరోజుల్లో తన మార్గంలో కొన్ని మలుపులు తీసుకున్నప్పటికీ.. తర్వాత చాలా స్థిరంగా.. సమైక్యాంధ్రకు కట్టుబడ్డారు. చాలా స్థిరంగా సమైక్యాంధ్ర కోసం పోరాడడం ప్రారంభించారు. కిట్టని వారు.. తెలంగాణలో అస్తిత్వం లేదు గనుక.. అని ప్రచారం చేస్తే చేయవచ్చు గాక..! కానీ తెరాస అల్లరి మూకలు.. రభస చేయకుంటే.. తెలంగాణలోనూ తన అస్తిత్వం ఏపాటిఉన్నదో ఆయన నిరూపించుకోగలరు. ఆ చర్చను పక్కన పెడితే.. మొత్తానికి సమైక్యాంధ్రకు స్థిరంగా కట్టుబడిన పార్టీగా వైఎస్ జగన్‌కు వంచన పర్వంలో తక్కువ స్కోరు వస్తుంది. 

కాకపోతే.. విభజన విషయంలో... ‘విభజన అనివార్యం అయితే’ అనే క్లాజు కింద.. సీమాంధ్రకు జరగవలసిన న్యాయం గురించి కూడా కాస్త స్పష్టంగా పోరాడితే బాగుందేని ఆక్షేపిస్తున్న సామాన్యులు అనేకులు ఉన్నారు. సమైక్యాంధ్ర కు కట్టుబడిన కీర్తికోసం.. ఆయన మడమ తిప్పలేదు బాగానే ఉంది. కనీసం మాట మాత్రంగానైనా ‘విభజన తప్పనట్లయితే’ అని ఉచ్ఛరించలేదు. ఇంకా బాగుంది. అయితే.. దానివలన ప్రయోజనం ఏమిటి? ఏం సాధించినట్లు..? అని ప్రశ్నించుకుంటే.. ఆయనకు పార్టీ పరంగా వచ్చిన మైలేజీ తప్ప.. ప్రజలకు ఒరిగిందేమీలేదు. 

నేతల జాతిపై విశ్వాసం పోయింది...

అందరూ పొలిటికల్ మైలేజీ కోసమే సమైక్యాంధ్ర అనే పదాన్ని వల్లిస్తున్నారు తప్ప వాస్తవంగా వారికి ఆ శ్రద్ద ఉడిగిపోయిందని ప్రజలకు అర్థమైంది. కేవలం తమను వంచించడానికి పాపం తమ నేతలు భాగ్యనగరిలో, హస్తినాపురంలో పాట్లు పడుతున్నారని వారు జాలిపడుతున్నారు. ఇంకా సమైక్యాంధ్ర పాట పాడుతూ ఉంటే.. ప్రజలు నమ్ముతుంటారేమో.. అని నేతలు నాటకాలు ఆడుతున్నారు గానీ.. వాస్తవానికి ప్రజలు ఎన్నడో ఇక గత్యంతరం లేదు. చీలిన రాష్ట్రంలో కూలిన కలలతో బతుకులీడ్చాల్సిందే అని ఫిక్సయిపోయారు. కాకపోతే.. ప్రజల్ని వంచించే ప్రయత్నంలో నేతలను తమను తాము వంచించుకుంటే.. ఉష్ర్టపక్షిలాగా.. ఇసుకలో తలను దూర్చుకుని.. తమ నాటకాలను ప్రపంచం గమనించడం లేదని అనుకుంటూ ఆత్మవంచన చేసుకోవడమే తమాషా.

ఒక్కొక్క నేతా ఎంతలేసి ప్రగల్భాలు పలికారో.. వాస్తవంలోకి అసలైన కార్యాచరణ సమయం వచ్చేసిరికి ఒక్కొక్కరు ఎంతగా మొహం చాటేస్తున్నారో ప్రజలకు స్వానుభవంలోకి వస్తోంది. ‘నమ్మడం’ అనే ఒకే తప్పు చేసినందుకు ఉధృతంగా తాము నడుపుకుంటున్న ఉద్యమాన్ని ప్రజలు తమ చేతులారా కాలబెట్టుకున్నారు. ‘మీకెందుకు మేం సాధించుకు వస్తాం’ అని నేతలు పలికితే నిజమే కాబోలు అనుకున్నారు. అలా.. ఊసరవెల్లి రంగులను నిజమని నమ్మినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నారు. 

ప్రజల ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. రుద్రవీణలోని పాటకు పేరడీ గుర్తుకు వస్తుంది.. 

(నోట్ : ఈ పాట పాడి, జాతికి స్ఫూర్తి అందించిన చిరంజీవి అన్నయ్య కూడా పై వంచకుల జాబితాలో ప్రముఖుల్లో ఒకరు. గుర్తించగలరు)

కపిలముని

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?