Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : 2019లో టిడిపి గెలుస్తుందనకూడదా?-1/2

ఎమ్బీయస్‌ : 2019లో టిడిపి గెలుస్తుందనకూడదా?-1/2

ఈ చర్చ యిప్పుడే చేయడం తొందరపాటు. ఇంకా రెండేళ్లు టైముంది. ఈ మధ్యలో ఏదైనా జరగవచ్చు. అయితే ''మంత్రిగా లోకేశ్‌'' అనే వ్యాసంలో నేను '2019 నాటికి టిడిపి మళ్లీ గెలిచి, లోకేశ్‌ ఏ ఉపముఖ్యమంత్రో కావచ్చు కాబట్టి అతను తన పాలనాపాటవాలను పెంచుకోవాలని ఆశిద్దాం' అని అనడంతో అలా ఎలా అంటారు అని నాపై చాలామంది విరుచుకు పడ్డారు. అంతే కాదు, లోకేశ్‌కి అంత సామర్థ్యం లేదు అని కూడా ఘాటుగా విమర్శించారు. ఆ విమర్శలకు జవాబుగానే యీ వ్యాసం రాస్తున్నాను. ఆ వ్యాసాన్ని మెచ్చినవారి కంటె మెచ్చనివారు ఎక్కువని అక్కడ అంకె చూపుతోంది. కానీ దానివలన నేను ప్రభావితం కావటం లేదు. నేననుకున్నది నేను రాశాను, దానిపై వాళ్లనుకున్నది వాళ్లు తెలియపరిచారు. నిజానికి చాలా విమర్శలకు మూడు, నాలుగు రోజుల పాటు నేను జవాబులిచ్చాను. అవి ఇంగ్లీషులో వున్నాయి. ఒకసారి వ్యాసం చదివాక కామెంట్ల కోసం, వాటిపై నా రెస్పాన్సు కోసం మళ్లీమళ్లీ ఎవరూ వెళ్లి చదవకపోవచ్చు. వ్యక్తిగతంగా కూడా చాలామంది మెయిల్స్‌ రాశారు. జవాబిచ్చాను. ఇంకా రాస్తున్నారు. నా ఉద్దేశాన్ని స్పష్టంగా రాయడానికి యిది సుదీర్ఘంగా రాస్తున్నాను. ఈ అంశంపై యిదే ముక్తాయింపు.

నిజానికి వక్తృత్వానికి చాలా ప్రాధాన్యత వుంది. సీజర్‌ దగ్గర్నుంచి విదేశాలు వెళ్లి 'రెటరిక్‌'లో తర్ఫీదు పొంది వచ్చేవారు. గతంలో ఎందరో నాయకులు అద్భుతంగా మాట్లాడేవారు. పోనుపోను క్వాలిటీ తగ్గిపోయింది. ప్రజల్ని మాటలతో కాక నోట్లతో ఆకట్టుకోవచ్చనే ధీమా పెరిగిపోయి, ఆ వైపు దృష్టి పెట్టడం మానేశారు. ఇప్పటికీ బాగా మాట్లాడేవారిలో ఆరెస్సెస్‌  నుంచి వచ్చిన వారు, కమ్యూనిస్టులు, ద్రవిడ పార్టీవారు కనబడతారు. వీళ్లందరికీ పుడుతూనే ఆ కళ అబ్బదు. తర్ఫీదు యిస్తారు. ఒక పాఠకుడు రాశారు - గొంతులో జీర వుంటే తప్ప లాభం లేదని. సాధన చేస్తే ఆ జీర అదే వస్తుంది. దాని ప్రాముఖ్యత గుర్తించాలి ముందుగా. ఎన్టీయార్‌ పార్టీ పెట్టిన కొత్తల్లో గండిపేట శిబిరంలో ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు రాజకీయ పరిజ్ఞానంపై, అసెంబ్లీ కార్యకలాపాలపై, మాట్లాడే తీరుపై అవగాహన కల్పించడానికి రాజకీయ తరగతులు నిర్వహింపచేశారు. చంద్రబాబే వాటిని పర్యవేక్షించేవారు. బాబు పార్టీ అధ్యక్షుడయ్యాక అవన్నీ అనవసరం అనుకున్నారు లాగుంది. ఇటీవల జరుగుతున్నట్లు లేవు. వాటి స్థానంలో యోగా క్లాసులు పెట్టిస్తున్నారు. మర్నాడు ఆ యోగా టీచరుకు ఎకరాలకు ఎకరాలు భూమి కేటాయిస్తున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?