Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: వినోద్‌ మెహతా - 25

ఎమ్బీయస్‌: వినోద్‌ మెహతా - 25

వినోద్‌ మెహతాకు స్థిరత్వం లేదన్న ప్రచారాన్ని ''ఔట్‌లుక్‌'' అబద్ధం చేసింది. అతని సారథ్యంలో ఆ పత్రిక ముందుకు సాగింది. అతను కూడా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటిదాకా ప్రస్తావించిన సంఘటనల ద్వారా అధికారులు, వ్యాపారవేత్తలు, వివిధ వర్ణాల రాజకీయ నాయకులు పత్రికలను ఎలా నియంత్రించాలని చూస్తారో పాఠకులకు అర్థమై వుంటుంది. ప్రతివాళ్లూ పత్రికలు తమ పాజిటివ్‌ సైడ్‌నే చూపాలి తప్ప, నెగటివ్‌ సైడ్‌ను చూపకూడదనే కోరుకుంటారు. చూపిస్తే మండిపడతారు, శిక్షించాలని చూస్తారు. ఇలా ఎన్ని సంఘటనలు చెప్పుకుపోయినా యిదే విషయం మాటిమాటికీ రుజువౌతుంది, పేర్లు మారతాయంతే. అందువలన వినోద్‌ కథకు మనం ముక్తాయింపు పలకవచ్చు. అయితే దానికి ముందు అతనికి విపరీతంగా పేరు దానితో పాటు కష్టాలు తెచ్చిపెట్టిన నీరా రాడియా టేపుల వ్యవహారం మాత్రం విపులంగా తెలుసుకోవాలి. వాటిని బయట పెట్టిన పత్రిక ''ఔట్‌లుక్‌'' కాబట్టి, (వాళ్ల కంటె ఒక్క రోజు ముందు ''ఓపెన్‌'' అనే పత్రిక కూడా ప్రచురించింది) అవి వాళ్లకు ఎలా చేరాయో వినోద్‌ వంటి యిన్‌సైడర్‌ మాత్రమే చెప్పగలడు. అందువలన ఆ ఉదంతం ఆసక్తికరంగా వుంటుంది.

వినోద్‌ యింతే రాశాడు. తమ చేతికి వచ్చిన మందుగుండు సామగ్రి వంటి సమాచారాన్ని వీళ్లు ప్రచురించడానికి ఎందుకు జంకారో తెలుసుకోవాలని యింకా వివరాల కోసం అజిత్‌ పిళ్లయ్‌ రాసిన ''ఆఫ్‌ ద రికార్డ్‌'' పుస్తకాన్ని చదివాను. అజిత్‌ రాసినది - 'నా చేతికి వచ్చిన 14 పేజీల నోట్‌లో మొదటి 5 పేజీలు ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖకు, సిబిఐకు మధ్య జరిగిన కరస్పాండెన్సు. అది వాళ్ల లెటర్‌హెడ్స్‌ మీద వుంది. అయితే 'ఇంటర్నల్‌ ఇవాల్యుయేషన్‌ రిపోర్ట్‌' పేర దానికి ఎటాచ్‌ చేసిన తక్కిన పేజీలన్నీ మామూలు కాగితం మీద వున్నాయి. సంతకాలు లేవు. పైగా ప్రింటవుట్ల జిరాక్సు కాపీలు. అది నాకు ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్టుమెంటు సిబ్బంది నుంచే వచ్చినా ఎవరో కార్పోరేట్ల తరఫున వాళ్లు నాకు యిచ్చి వుంటారని తోచింది. ఎందుకంటే దానిలో వాడిన భాష ఆఫీసు కరస్పాండెన్సులో వాడే భాషలా లేదు. కార్పోరేట్లు వాడే స్టయిలైజ్‌డ్‌ ఇంగ్లీషులో వుంది. ఒక కార్పోరేటు పోటీ కార్పోరేట్‌పై బురద చల్లడానికి యిలాటి కాగితాలు పుట్టించడం మామూలే. వాటిని నమ్మి ప్రచురిస్తే పత్రికలకు దెబ్బ. అందుకే ఆగాం. 2010 నవంబరులో రాడియా కాల్స్‌ వున్న సిడి మా చేతికి వచ్చాక అవి విని, యీ నోట్సును వెరిఫై చేయబోతే మాకు అర్థమైనదేమిటంటే - ఆ నోట్సు ఎవరో కార్పోరేటు ఉద్యోగి తయారు చేసినా అతను రాడియా టేపులన్నీ విన్నాకనే అది తయారుచేశాడు. దానిలో వున్నవన్నీ వాస్తవాలే. అయితే భాష కారణంగా మాకు అనుమానం వచ్చింది.' (సశేషం) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?