Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: యోగి ప్రదేశ్‌లో పోలీసు బదిలీలు

ఎమ్బీయస్‌: యోగి ప్రదేశ్‌లో పోలీసు బదిలీలు

ఉత్తర ప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన యోగి ఆదిత్యనాథ్‌ విలక్షణ వ్యక్తిగా తోచారు. తనకంటూ ఎవరూ లేరు కాబట్టి, రాజకీయాలను ధర్మసంస్థాపనలో భాగంగా చూస్తున్నానని అన్నారు కాబట్టి ఆయన పాలన భిన్నంగా వుంటుందని ఆశించడం జరిగింది. చూడబోతే ఆయనా మామూలు నాయకుడి బాటలోనే వెళుతున్నారు - ముఖ్యంగా పోలీసు అధికారుల బదిలీ విషయంలో. ఉత్తర ప్రదేశ్‌ చాలా క్లిష్టమైన రాష్ట్రం.

ఎవరు అధికారంలోకి వచ్చినా సమర్థవంతంగా పాలించడం బహుకష్టం. ఫలితాలు చూపడం ఓ పట్టాన కుదిరే వ్యవహారం కాదు. అయినా ఆదిత్యనాథ్‌ అప్పుడే 'యుపి ప్రభుత్వం సాధించిన విజయాలు' అంటూ దక్షిణాది పత్రికలతో సహా ఫుల్‌ పేజీ యాడ్స్‌ గుప్పించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌, అఖిలేశ్‌ యిలా యాడ్స్‌ యిచ్చే విమర్శల పాలయ్యారు. తక్కిన విషయాలలో ఏపాటి విజయం సాధించారో తెలియదు కానీ శాంతిభద్రతల విషయంలో పరిస్థితి మెరుగు పడలేదు సరికదా, అధ్వాన్నమైంది.

యుపి, బిహార్‌ వంటి రాష్ట్రాలలో శాంతిభద్రతలు ప్రధాన అంశం. బిహార్‌లో నీతిశ్‌ పేరు తెచ్చుకోవడానికి కారణం అతని పాలనలో అవి బాగుపడడమే! యోగి అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటింది. నేరాల సంఖ్యలో 2016 మార్చి-మే అంకెలతో పోలిస్తే 2017 అంకెల్లో 26% వృద్ధి కనబడింది. ఈ విషయమై అసెంబ్లీలో ప్రతిపక్షాలు గొడవ చేశాయి. దానిపై కినిసి, యోగి 67 మంది ఐపిఎస్‌ అధికారులను బదిలీ చేసేశారు.

ఈ బదిలీలు యోగి పదవి చేపట్టిన మూడు వారాల్లోనే మొదలయ్యాయి. 84 మంది ఐఏఎస్‌, 54 మంది ఐపిఎస్‌  అధికారులను బదిలీ చేయడంతో బాటు యుపి పోలీసు డైరక్టర్‌ జనరల్‌ జావీద్‌ అహ్మద్‌ను ఏప్రిల్‌ మూడోవారంలో ఆర్మ్‌డ్‌ కానిస్టబులరీకి బదిలీ చేసి, అతని స్థానంలో సుల్ఖన్‌ సింగ్‌ను నియమించాడు. ఈ బదిలీని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది మార్చిలో అఖిలేశ్‌ ప్రభుత్వం 12 మంది సీనియర్లను పక్కకు పెట్టి జావీద్‌ను ఆ పదవిలో నియమించింది.

అప్పుడే బిజెపి అభ్యంతరం తెలిపింది. ఇప్పుడు అధికారంలోకి రాగానే అందరిలో సీనియరైన సుల్ఖన్‌ సింగ్‌కు ఆ పదవి యిచ్చింది. అతనికి ఐదు నెలల సర్వీసు మాత్రమే వుంది. సుల్ఖన్‌ సింగ్‌కు గతంలో జరిగిన అన్యాయాన్ని యోగి సరిదిద్దారనుకున్నా సహరాన్‌పూర్‌ ఎస్‌ఎస్‌పి లవ కుమార్‌ను బదిలీ చేయడం మాత్రం జీర్ణించుకోలేని విషయం. ఆ నియోజకవర్గంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఒక ఊరేగింపు నిర్వహించారు.

కొద్ది సేపట్లోనే అది అల్లర్లకు దారి తీయడంతో లవ కుమార్‌ ఊరేగింపును నిరోధించారు. అంతే, సహరాన్‌పూర్‌ బిజెపి ఎంపి రాఘవ్‌ లఖన్‌పాల్‌, అతని సోదరుడు రాహుల్‌, దేవ్‌బంద్‌ బిజెపి ఎమ్మెల్యే కలిసి లవ కుమార్‌ యింట్లో లేనివేళ అతని యింటిని ముట్టడించారు. గంటల తరబడి అతని భార్య, పిల్లలను బందీలుగా వుంచడంతో బాటు, అక్కడి సామాను కూడా ధ్వంసం చేశారు. లవ కుమార్‌ యీ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అంతే, ప్రభుత్వం అతన్ని అక్కణ్నుంచి బదిలీ చేసి, నోయిడాకు ఎస్‌ఎస్‌పిగా వేసింది. బిజెపి నాయకులతో పెట్టుకుంటే అంతే అనే సందేశం పోలీసు అధికారులకు ఘాటుగా చేరింది. అయినా కొంతమంది పోలీసు అధికారులు పాఠాలు నేర్చుకోలేదు. మే నాటికి బదిలీ ఐన సీనియర్‌ పోలీసు అధికారుల సంఖ్య 200కు చేరింది.  

వారందరి బదిలీలు వార్తల్లోకి ఎక్కలేదు కానీ శ్రేష్ఠా ఠాకూర్‌ బదిలీ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ప్రొవిన్షియల్‌ పోలీసు సర్వీసుకు చెందిన 2012 బ్యాచ్‌ అధికారిణి. చాలా స్ట్రిక్టుగా పనిచేస్తూ 'లేడీ సింగం'గా పేరు తెచ్చుకుంది. సమాజ్‌వాదీ ప్రభుత్వం ఆమెను బులంద్‌ శహర్‌ జిల్లాలోని సియానా తాలూకాలో సర్కిల్‌ ఆఫీసరుగా నియమించింది. అక్కడ ప్రభుత్వభూమిని కొందరు కబ్జా చేసి ఆక్రమించుకుంటే యీమె వారికి వ్యతిరేకంగా ఒక ఉద్యమమే ప్రారంభించింది.

ప్రజలను చైతన్యపరచి, రాజకీయ నాయకుల జోక్యాన్ని తట్టుకుని ఆక్రమణదారులను ఖాళీ చేయించింది. దానికి గాను ప్రజల నుంచి, ప్రభుత్వం నుంచి మెప్పు పొందింది. బిజెపి అధికారంలోకి వచ్చాక ఆమె కష్టాలు ప్రారంభమయ్యాయి. జూన్‌ 22న సియానా మెయిన్‌ మార్కెట్‌లో రొటీన్‌గా వాహనాలు చెక్‌ చేస్తూ వుంటే హెల్మెట్‌ పెట్టుకోని ఒక మోటార్‌ సైకిలతని వద్ద సరైన డాక్యుమెంట్లు కూడా లేవు. రూ.200 ఫైన్‌ కట్టాలి అంటే 'నేను బిజెపి నాయకుణ్ని, నా పేరు ప్రమోద్‌ కుమార్‌' అన్నాడు.

అయితే ఏమిటి? జరిమానా కట్టాల్సిందే అంది యీమె. అతను కట్టలేదు సరికదా, ఫోన్‌ చేసి తన అనుచరులను పిలిపించాడు. వాళ్లంతా వచ్చి యీమెతో వాదించసాగారు. ఒక ప్రభుత్వోద్యోగిని తన డ్యూటీ చేసుకోనీయకుండా అడ్డుకున్నందుకు, గలభా చేసినందుకు యీమె వారిలో అయిదుగుర్ని జైల్లో పెట్టింది. బిజెపి నాయకులు తమ పరువు పోయినట్లు ఫీలయ్యారు. 11 మంది బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి యోగిని కలిసి ఆమెను బదిలీ చేయకపోతే బిజెపి నాయకుల నైతికస్థయిర్యం దెబ్బ తింటుందని వాదించారు.

ఆ సమావేశం జరిగిన ఒక వారానికి జులై 1న ఆమెను నేపాల్‌ సరిహద్దుల్లోని భరాయిచ్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. దీని గురించి అడిగితే యిది రొటీన్‌గా జరిగే వ్యవహారమే తప్ప బిజెపి నాయకులతో పేచీకి, దీనికి సంబంధం లేదని మామూలుగా చెప్పే జవాబే వచ్చింది. ఇదే సందర్భంలో యోగి పోలీసు అధికారిని రక్షించిన సంగతి కూడా చెప్పాలి. యోగి సొంత జిల్లా గోరఖ్‌పూర్‌లో మే 7న మద్యం షాపులు తెరవడాన్ని నిరసిస్తూ కొందరు మహిళలు ప్రదర్శనలు నిర్వహించారు. అది అదుపు తప్పడంతో చారు నిగమ్‌ అనే మహిళా ఐపిఎస్‌ అధికారిణి వారిపై లాఠీచార్జికి ఆదేశించారు.

అలా ఆదేశించినందుకు బిజెపి ఎమ్మెల్యే రాధా మోహన్‌ దాస్‌ ఆమెపై విరుచుకుపడి బహిరంగంగా దూషించాడు. ఆవిడ మాటలు పడలేక కన్నీరు కార్చిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో విహారం చేశాయి. ఇది యోగి దృష్టికి వచ్చింది. ఎమ్మెల్యే వచ్చి ఆవిడను బదిలీ చేయమని అడిగితే ఒప్పుకోలేదు. అదే సమయంలో ఆమెకు క్షమాపణ చెప్పమనీ అడగలేదు. 

ఏది ఏమైనా శాంతిభద్రతల సమస్య యోగి ప్రభుత్వానికి సవాలుగా నిలిచేట్లే వుంది. కానీ యోగి వాదన మరోలా వుంది. తన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి లేని సంఘటనలు కల్పిస్తున్నారని ఆరోపిస్తున్నారు. లఖ్‌నవ్‌కు 100 కిమీ.ల దూరంలో వున్న ఉంచహర్‌ గ్రామంలో వున్న స్థిరాస్తి గురించి రెండు కుటుంబాల మధ్య వివాదం వుంది. 2009లో ఒక కుటుంబానికి చెందిన 37 ఏళ్ల మహిళపై మరో కుటుంబానికి చెందిన యిద్దరు యువకులు దాడి చేసి మానభంగం చేసి, ఒంటి మీద యాసిడ్‌ పోశారు.

ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నడుస్తున్నా ఆమెపై దాడులు ఆగలేదు. 2012లో కత్తితో పొడిచాక ఆమెకు పోలీసు రక్షణ కల్పించారు. అయినా 2013లో యాసిడ్‌ పోశారు. ఈ ఏడాది మార్చి 23న రైల్లో ప్రయాణం చేస్తూండగా యిద్దరు వ్యక్తులు ఆమెను పట్టుకుని గొంతులో ఆసిడ్‌ పోశారు. ఇప్పుడు జులైలో లఖనవ్‌లోని ఆలీగంజ్‌ ప్రాంతంలో హాస్టల్‌లో వుండగా తనపై మళ్లీ ఆసిడ్‌ దాడి జరిగిందని ఆమె అంటోంది.

రక్షణగా వున్న పోలీసును నువ్వేం చేస్తున్నావని అడిగితే 'నేను చూస్తూండగా ఆమెపై ఎవరూ దాడి చేసి పారిపోలేదు' అంటోంది. 'ఈ సంఘటన కళ్లారా చూసినవారు ఎవరూ లేరు' అంటున్నారు పోలీసులు. యోగి ఆదిత్యనాథ్‌ ఆమెను ఆసుపత్రిలో పరామర్శించి, లక్ష రూ.లు పరిహారం ప్రకటిస్తూనే ఒక టీవీ ఛానెల్‌లో మాట్లాడుతూ 'హాస్టల్‌లోకి ఎవరైనా రావడం అసాధ్యం. ఈ సంఘటన జరిగిందో లేదో నా కనుమానం.

(ఫోటో - శ్రేష్ఠా ఠాకూర్‌కు బిజెపి నాయకులతో వాగ్వివాదం, ఇన్‌సెట్‌లో లవ కుమార్‌) 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?