Advertisement


Home > Articles - Special Articles
ఇది ఐఫోన్ 8ను మించిపోయింది

ఇప్పటివరకు మొబైల్స్ లో కెమెరా అంటే ఐఫోన్ మాత్రమే. అంత క్వాలిటీ మరే కంపెనీలో కనిపించలేదు. తాజాగా శాంసంగ్ సంస్థ ఈ విషయంలో ఐఫోన్ కు పోటీగా నిలిచింది. కెమెరా క్వాలిటీ విషయంలో ప్రస్తుతానికి ఐఫోన్ 8 ప్లస్, గెలాక్సీ నోట్-8 మాత్రమే ది బెస్ట్. ఇప్పుడీ రెండింటినీ మించిన ఫోన్ రెడీ అయింది.

గూగుల్ సంస్థ తమ అత్యాధునిక పిక్సెల్-2 సిరీస్ ను ఎనౌన్స్ చేసింది. కెమెరా క్వాలిటీ, ఫొటోల నాణ్యత విషయంలో ప్రస్తుతానికి ప్రపంచంలో ఇదే నంబర్ వన్ అంటూ విశ్లేషకులు ముక్తకంఠంతో ఒప్పుకున్నారు. పిక్సెల్-2 మొబైల్స్ లో ఉన్న పవర్ ఫుల్ లెన్స్ ఐఫోన్ 8లో కూడా లేవని అంటున్నారు. మరీ ముఖ్యంగా జూమ్, ఎఫెక్ట్స్, లైటింగ్ ఎడ్జెస్ట్ మెంట్స్ లో పిక్సెల్-2కు తిరుగులేదట.

ఈ మోడల్ ఇండియాకు ఇంకా అందుబాటులోకి రాలేదు. వచ్చేనెలలో వచ్చే అవకాశముంది. పిక్సెల్-2 హైఎండ్ మోడల్ ధర భారత్ లో 82వేల రూపాయలు ఉండే ఛాన్స్ ఉంది.