Advertisement

Advertisement


Home > Articles - Special Articles

36-24-36 తప్పే సుమీ.!

36-24-36 తప్పే సుమీ.!

కొన్ని వివాదాలు చిత్రంగా వుంటాయి. అందులో ఇదొకటి. మహిళల శారీరక కొలతలు (కాస్త రఫ్‌గా మాట్లాడుకుంటే ఫిగర్‌ సైజ్‌ అన్నమాట) 36-24-36 గురించిన చర్చ ఏకంగా 12వ తరగతి పాఠ్యాంశంలో భాగమైపోయింది. ఇంకేముంది, వివాదం షురూ అయ్యింది. ఆ వయసు పిల్లల్లో మహిళల ఫిజిక్‌కి సంబంధించిన చర్చ ఏంటి.? అన్నది చాలామంది ప్రశ్న. అసలే, దేశంలో 'రంగు' గురించి వివాదం నడుస్తోంది. నలుపు, తెలుపు గోలేంటి.? అన్న వాదన ఓ వైపు వుంటే, ఇంకోపక్క.. బాగా సన్నగా వుండేవారిని, బాగా లావుగా వుండేవారినీ గేలి చేయడం వల్ల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయనే వాదనలు విన్పిస్తున్నాయి. 

ఈ కొలతలు ఇప్పుడంటే పాఠ్యపుస్తకంలో కొత్తగా చేర్చారేమోగానీ, నిత్యం సినిమాల్లో ఈ కొలతల గురించి అత్యంత అసభ్యకరమైన రీతిలో డైలాగ్స్‌ పేలుతుండడాన్ని చూస్తూనే వున్నాం. న్యూస్‌ ఛానళ్ళలోనూ 'ఫిగర్‌' చుట్టూ పుట్టుకొస్తున్న కథనాలు అన్నీ ఇన్నీ కావు. ఇవన్నీ తప్పు కానప్పుడు, పాఠ్యపుస్తకంలో 'ఆరోగ్యవంతమైన శరీరం' పేరుతో కొలతల్ని పేర్కొంటే తప్పేంటట.? అన్నది ఇంకో వాదన. 

ఎవరి గోల వారిదే. పిల్లలు చెడిపోతున్నారంటాం.. వారికి హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ని అందుబాటులో వుంచుతున్నాం. అదీ, పోర్న్‌ సైట్స్‌ని బ్లాక్‌ చేసే యంత్రాంగం ఏదీ లేకుండానే. మొబైల్‌ ఫోన్లు అందిస్తున్నాం, అందులో పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోం. పుస్తకాల్లో 'నాలెడ్జ్‌' ఎంత, ఆవగింజంత కూడా కాదు. అదే ఇంటర్నెట్‌కెక్కితే, ప్రపంచమే మన గుప్పిట్లో వుంటుంది. అదే సమయంలో, ప్రపంచంలోని సర్వదరిద్రాలూ అందులోనే కన్పిస్తాయి. కానీ, వాటిపై 'కత్తెర' వెయ్యం, వాటికి వ్యతిరేకంగా ఆందోళన చెయ్యం. 

ఇప్పుడు చెప్పండి, 36-24-36 కొలతలపై పాఠ్యాంశాలు తప్పా ఒప్పా.? చిన్న చిన్న తప్పుల్ని వెతకడం, పెద్ద పెద్ద ఘోరాల్ని పట్టించుకోకపోవడం.. ఇది కదా, నయా ట్రెండ్.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?