Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఆ దేశంలో ఇక జంతువులతో సెక్స్ నిషేధం..!

ఈ విషయాన్ని ప్రకటిస్తున్నప్పుడు కూడా డెన్మార్క్ వ్యవసాయ శాఖ మంత్రి సిగ్గుతో చితికిపోయాడు. దేశంలో ఇకపై జంతువులతో సెక్స్ అనేది నిషేధం అని ఆయన ప్రకటించాడు. "ఇకపై'' అని అన్నాడంటే.. ఇన్ని రోజులుగా అది జరిగిందని ఒప్పుకోవాల్సి వస్తోంది. నిషేధం విధించాలని డిమాండ్ లు వినిపించేంత స్థాయికి వెళ్లిన ఆ సమస్య.. నిషేధం విధించక తప్పని పరిస్థితులను కల్పించింది.

మనిషిలోని ఒక వికారపు పైత్యమే ఈ యానిమల్ సెక్స్. ప్రత్యేకించి ఎంతో కల్చర్ నేర్చిన యూరప్ లో ఇలాంటి పైత్యకారులు ఉన్నారు. పెంపుడు జంతువులతోనూ లైంగిక కార్యకపాలు చేయడంతో పాటు వీళ్లు... కొన్ని సార్లు జంతువులపై అత్యాచారాలకు కూడా తెగబడుతున్నారట. యూరప్ లో శతాబ్దాలుగా ఇలాంటి సమస్య ఉంది. అక్కడ ప్రజా ప్రభుత్వాలు ఏర్పడ్డాకా.. మాత్రం ఇలాంటి చర్యలపై నిషేధాలు విదిస్తూ వస్తున్నారు. 

గత పదేళ్ల కాలంలోనే ఇంగ్లాండ్, హాలాండ్, ఫ్రాన్స్ , జర్మనీ, బెల్జియం వంటి దేశాల్లో మనిషి జంతువులో సంభోగించడంపై నిషేధాన్ని విధించారు. అయితే ఈ దేశాల మధ్యలో ఉండే డెన్మార్క్ లో మాత్రం ఈ విషయంపై నిషేదం లేదు! దీంతో పైత్యకారులందరికీ డెన్మార్క్ ఒక స్వర్గధామం అయ్యింది. 

జంతువులతో సెక్స్ చేయాలని తపించే వాళ్లందరికీ డెన్మార్క్ ఒక అట్రాక్షన్ అయ్యింది. ప్రతియేటా కొన్ని వేల మంది కేవలం ఈ పనికోసం డెన్మార్క్ కు వస్తున్నారు! ఆయా దేశాల్లో నిషేధం ఉండటం... శిక్షలు పడే అవకాశం ఉండటంతో... డెన్మార్క్ కు వచ్చి ఆ పైత్యకారపు పని చేసుకు వెళుతున్నారు. క్రమంగా ఇది డెన్మార్క్ లో సమస్యగా మారుతోంది. 

మరీ దారుణం ఏమిటంటే ఇక్కడ ఎనిమల్ ప్రాస్టిట్యూషన్ మొదలైంది. టూరిస్టుల కోసం జంతువులను సిద్ధంగా ఉంచడం కొంతమందికి వ్యాపారం అయ్యింది. ఈ దారులన్నీ చూసి డానిష్ ప్రభుత్వం సహించలేకపోయింది. పక్కదేశాల మధ్య పరువు పోతున్న విషయాన్ని గ్రహించి.. తాము కూడా జంతువలతో సెక్స్  ను నిషేధిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే కఠినమైన చట్టాలు తెస్తామని.. యానిమల్ సెక్స్ ఊసెత్తడానికే భయపడేలా ఆ చట్టాలు ఉంటాయని  డానిష్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించాడు. మూగ జంతువులపై ఇలాంటి ఆకృత్యాలను సమర్థించేది లేదని ఆయన స్పష్టం చేశాడు! మొత్తానికి ఈ వ్యవహారం మనుషుల లైంగిక కోరికల పైత్యానికి పరాకాష్టకు చేరిందనే విషయానికి రుజువు ఏమో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?