Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఆమెకు క్రికెట్‌ తెలీదేమో: సచిన్‌ టెండూల్కర్‌

ఆమెకు క్రికెట్‌ తెలీదేమో: సచిన్‌ టెండూల్కర్‌

ప్రపంచ మేటి టెన్నిస్‌ క్రీడాకారిణి షరపోవా ఓ సందర్భంలో తనకు సచిన్‌ టెండూల్కర్‌ ఎవరో తెలీదని చెప్పింది. మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా షరపోవా పై విధంగా వ్యాఖ్యానించింది. దాంతో, సచిన్‌ అభిమానులకి ఒళ్ళు మండిరది. ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌ ద్వారా షరపోవాపై యుద్ధమే ప్రకటించారు సచిన్‌ అభిమానులు.

ఔను మరి.. సచిన్‌ టెండూల్కర్‌ అంటే క్రికెట్‌ దేవుడు. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకెళ్ళినా క్రికెట్‌ గురించి చెప్పేస్తారు. అంతలా క్రికెట్‌ గత రెండు దశాబ్దాల్లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. అలాంటి పాపులర్‌ గేమ్‌ క్రికెట్‌కి సచిన్‌ టెండూల్కర్‌ దేవుడు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.

క్రికెట్‌ అయినా, టెన్నిస్‌ అయినా.. ఆయా రంగాల్లోని ప్రముఖుల గురించి క్రీడా ప్రపంచంలో వున్నవారందరికీ తెలియడం అనేది సహజాతి సహజం. కానీ షరపోవా తనకు సచిన్‌ తెలియదు.. అని చెప్పేసింది ఓ ప్రశ్నకు సమాధానంగా. ఈ వ్యవహారంపై ఎట్టకేలకు సచిన్‌ స్పందించాడు. ‘బహుశా ఆమెకు నేను నిజంగానే తెలియదేమో.. క్రికెట్‌ గురించి ఆమె పెద్దగా తెలుసుకుని వుండదు.. ఆ ఆటపై ఆమెకు ఆసక్తి లేకపోవడమూ అందుకు కారణం కావొచ్చు..’ అని సచిన్‌ చెప్పుకొచ్చాడు.

ఇక్కడ సచిన్‌ హుందాతనం సుస్పష్టమవుతోంది. ఈ విషయంలో షరపోవాపై తన అభిమానులెవరూ అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని సచిన్‌, అభిమానులకు పిలుపునిచ్చి తన హుందాతనాన్ని పదింతలు చేసుకున్నాడు. దటీజ్‌ సచిన్‌.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?