Advertisement

Advertisement


Home > Articles - Special Articles

అమ్మ నాన్న: ఆరుషీ నిన్ను మేం చంపలేదు.!

అమ్మ నాన్న: ఆరుషీ నిన్ను మేం చంపలేదు.!

తొమ్మిదేళ్ళ క్రితం నాటి కేసు ఇది. 14 ఏళ్ళ అమ్మాయి ఆరుషిని, ఆమె తల్లిదండ్రులే అతి కిరాతకంగా చంపేశారన్న వార్త అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 'ఆ హత్య చేసింది మేం కాదు..' అని ఆరుషి తల్లిదండ్రులు నుపుర్‌, రాకేష్‌ ఎంత మొత్తుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. పనిమనిషి హేమ్‌రాజ్‌ సాయంతో ఆరుషిని, ఆమె తల్లిదండ్రులు చంపేశారన్నది అప్పట్లో ప్రముఖంగా విన్పించిన వాదన. ఆ తర్వాత వివాదాస్పద స్థితిలో హేమరాజ్‌ కూడా హత్యకు గురయ్యాడు. 

మొత్తమ్మీద, ఆరుషి హత్య కేసులో అనేక మలుపులు.. పని మనిషి హేమరాజ్ - ఆరుషి మధ్య అక్రమ సంబంధం బయటపడ్డంతో అది తట్టుకోలేక ఆరుషిని ఆమె తల్లిదండ్రులే చంపారని, కాదు కాదు.. తల్లిదండ్రులకీ ఆరుషి హత్యకీ సంబంధం లేదని ఇంకోసారి, హేమరాజ్ - ఆరుషి మీద కన్నేసి ఆమెని చంపేశాడని మరోసారి.. ఇలా రకరకాల వాదనలు తెరపైకొచ్చాయి. సీబీఐ విచారణ సైతం, నిజాల్ని నిగ్గు తేల్చలేకపోయిందంటే ఈ కేసు ఎంత ప్రత్యేకమైనదో అర్థం చేసుకోవచ్చు. 

2013లో ఆరుషి తల్లిదండ్రులు నుపుర్‌, రాకేష్‌ తల్వార్‌లను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చి, వారికి జీవిత ఖైదు విధించింది. ఆ తీర్పుని సవాల్‌ చేసిన నుపుర్‌, రాకేష్‌ ఈ కేసు నుంచి ఎట్టకేలకు విముక్తి పొందారు. నాలుగేళ్ళ వారి పోరాటం ఫలించింది. అలహాబాద్‌ హైకోర్టు, ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులు నుపుర్‌, రాకేష్‌ దోషులన్న సీబీఐ వాదనను కొట్టి పారేసింది. నుపుర్‌, రాకేష్‌ దోషులనడానికి సరైన సాక్ష్యాధారాలు లేవని తేల్చింది న్యాయస్థానం. నిర్దోషులుగా ఆ ఇద్దర్నీ ప్రకటించి, విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. 

ఇంతకీ, ఈ కేసుకి ఇక్కడితో ముగింపు పడినట్లేనా.? మళ్ళీ సీబీఐ, అలహాబాద్‌ హైకోర్టు తీర్పుని సవాల్‌ చేస్తుందా.? ఇంతకీ, ఆరుషి ఎలా చనిపోయింది.? ఆమెను చంపిందెవరు.! ఇప్పటికీ, ఎప్పటికీ ఇదొక మిస్టరీనే. కానీ, ఈ కేసులో ఆరుషి తల్లిదండ్రులు శిక్ష అనుభవించేశారు. అసలంటూ వారు ఆ నేరమే చేయకపోతే, చేయని నేరానికి వారికి అంతటి శిక్ష విధించిన పాపమెవరిది.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?