Advertisement

Advertisement


Home > Articles - Special Articles

అమ్మాయిల పిచ్చోడు.. అదే పెద్ద ప్లస్సు.!

అమ్మాయిల పిచ్చోడు.. అదే పెద్ద ప్లస్సు.!

డోనాల్డ్‌ ట్రంప్‌.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి. ప్రముఖ వ్యాపారవేత్త. ఇంతకన్నా ప్రత్యేకంగా ఆయనకు ఇంకో గుర్తింపు వుంది. అదే 'అమ్మాయిల పిచ్చోడు'. మహిళల పట్ల డోనాల్డ్‌ ట్రంప్‌ అసభ్యకరంగా వ్యవహరించాడనడానికి అనేక సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. 'నన్ను అవమానించాడు.. నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు..' అంటూ చాలామంది మహిళలు ట్రంప్‌కి వ్యతిరేకంగా మీడియాకెక్కారు. చాలా వీడియోలు, ఫొటోలు మీడియాలో దర్శనమిచ్చియి, ట్రంప్‌ పైత్యం గురించి. 

కానీ, డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో అతను హాట్‌ ఫేవరెట్‌. డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ వైపే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నా హిల్లరీకీ - ట్రంప్‌కీ మధ్య 'పాపులారిటీ వ్యత్యాసం' చాలా తక్కువగానే కన్పిస్తోంది. మామూలుగా అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఏకపక్షంగా జరగాలి. దానికి కారణం ట్రంప్‌ బ్యాక్‌గ్రౌండే. కానీ, ట్రంప్‌ మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీకి గట్టిపోటీనిస్తున్నాడు. 

మొత్తం మూడు డిబేట్స్‌లో ఎక్కడా హిల్లరీపై ట్రంప్‌ ఆధిక్యం ప్రదర్శించలేకపోయిన విషయం విదితమే. అయినప్పటికీ కూడా, హిల్లరీకి ఇంకా ట్రంప్‌ గట్టిపోటీనిస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ప్రధానంగా మహిళా లోకం ట్రంప్‌ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని హిల్లరీ భావిస్తే, ఆ మహిళా లోకం కూడా చాలావరకు ట్రంప్‌కి మద్దతిస్తుండడం ఆశ్చర్యకరమే. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 'సంచలన ఫలితాలు రాబోతున్నాయి..' అంటూ పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి. 

చిత్రమైన విషయమేంటంటే, అన్ని సర్వేల్లోనూ హిల్లరీకే మద్దతుగా ఫలితాలు కనిపిస్తుంటే, సర్వేల ఫలితాలు ఎలా వున్నా, వాస్తవ ఫలితం 'సంచలనమే' అన్నది ఆయా సర్వేలు నిర్వహించిన సంస్థలు చెబుతున్నమాట. కొన్ని సర్వేల్లో హిల్లరీ చెప్పుకోదగ్గ ఆధిక్యం ప్రదర్శిస్తుండగా, ఒకటీ అరా సర్వేల్లో మాత్రం హిల్లరీ - ట్రంప్‌ మధ్య మార్జిన్‌ చాలా తక్కువ వుంది. ఓవరాల్‌గా హిల్లరీదే ఆధిక్యం. అయినా సంచలన ఫలితం అంటే, దానర్థం ఏంటట.? ట్రంప్‌ విక్టరీ ఖాయమనేనా.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?