Advertisement

Advertisement


Home > Articles - Special Articles

‘ఆటకు ఆమె జీవితం అంకితం..’

‘ఆటకు ఆమె జీవితం అంకితం..’

టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా జాతీయతను, స్థానికతను ప్రశ్నించడం సబబు కాదంటోంది సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి ప్రసన్న. తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సానియా నియామకాన్ని పలువురు రాజకీయ నాయకులు తప్పు పట్టిన విషయం విదితమే. ‘పాకిస్తానీని పెళ్ళాడిన సానియా స్థానికత ఏంటి.?’ అంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడ్డం, బీజేపీ అధిష్టానం వారి వ్యాఖ్యల్ని ఖండిరచడం తెల్సిన విషయాలే.

ఓ జాతీయ మీడియాకి చెందిన ఛానల్‌తో ఈ విషయమై మాట్లాడుతూ సానియా కన్నీళ్ళ పర్యంతమవడంతో ఆమెకు పలువురు సంఫీుభావం ప్రకటిస్తున్నారరు. ‘జరిగిందేదో జరిగిపోయింది.. సానియా తన జీవితాన్ని ఆటకు అంకితం చేశారు.. భారతదేశానికి బోల్డన్ని పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు..’ అంటూ మంచు లక్ష్మి, సానియాని కీర్తిస్తూ పోస్ట్‌ చేసింది సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ద్వారా.

పలువురు బాలీవుడ్‌ ప్రముఖులే కాక, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలూ సానియాకి బాసటగా నిలుస్తున్నారు. పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ని పెళ్ళాడిన హైద్రాబాదీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కెరీర్‌లో చాలానే వివాదాల్ని ఎదుర్కొన్నా, స్థానికతపై తాజా వివాదం సానియా మీర్జాకి బీభత్సమైన పాపులారిటీనే తెచ్చిపెట్టింది.
తాజాగా పలువురు ప్రముఖులు ఆమెకు బాసటగా నిలుస్తుండడంతో సానియాకీ, తద్వారా తెలంగాణ రాష్ట్రానికీ ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?