Advertisement

Advertisement


Home > Articles - Special Articles

అయినా 'పాక్‌' తోక వంకరే.!

అయినా 'పాక్‌' తోక వంకరే.!

అంతర్జాతీయ సమాజం ఎంతలా చీవాట్లు పెట్టినా, సిగ్గూయెగ్గూ వుండదాయె. ఎందుకంటే, అది పాపాల పాకిస్తాన్‌. భారత ఆర్థిక రాజధాని ముంబైపై పాకిస్తాన్‌ ముష్కరులు దాడి చేసినప్పుడు అమెరికా సహా అంతర్జాతీయ సమాజమంతా పాకిస్తాన్‌ని, తీవ్రవాద దేశంగా ప్రకటించాయి.. చీవాట్లు పెట్టాయి. ఇకపై ఇలాంటి దుశ్చర్యలు మానాలంటూ అల్టిమేటం జారీ చేశాయి. కానీ, పాకిస్తాన్‌ మారిందా.? మారదు. ఎందుకంటే, పాకిస్తాన్‌ 'తోక' వంకర.!

ఇప్పుడు మళ్ళీ అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ మొట్టికాయలు వేయించుకుంది. భారత మాజీ నేవీ అధికారి కుల్‌ భూషణ్‌ జాదవ్‌ కేసులో పాకిస్తాన్‌ తీరుని అంతర్జాతీయ న్యాయస్థానం తప్పు పట్టింది. ఉరిశిక్ష విధించదగ్గ నేరం ఆయన చేశాడనడానికి ఎలాంటి ఆధారాలూ పాకిస్తాన్‌ వద్ద లేవని అంతర్జాతీయ న్యాయస్థానం తెగేసి చెప్పింది. 'ఉరిశిక్ష అమలుచేయబోము..' అనే హామీ తమకు ఇవ్వాల్సిందిగా పాకిస్తాన్‌కి అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) ఆదేశాలు జారీ చేసింది. 

మరి, పాకిస్తాన్‌ ఇప్పుడేం చేస్తుంది.? భారత వాదనలు నిజమైన వేళ, పాకిస్తాన్‌ కుట్రలు బయటపడ్డ వేళ.. అంతర్జాతీయ సమాజమంతా మరోమారు, 'థూ..' అని ఉమ్మేశాక అయినా పాకిస్తాన్‌కి బుద్ధి వస్తుందా.? ఛాన్సే లేదు. ఎందుకంటే, అది పాపాల పాకిస్తాన్‌. దాని తోక వంకర గనుక. 

కుల్‌ భూషణ్‌ జాదవ్‌ని పాకిస్తాన్‌ ఎప్పుడో హత్య చేసి వుండొచ్చు. భారత సరిహద్దుల్లోకి చొరబడి, భారత సైన్యాన్నీ, భారత పౌరుల్నీ హతమార్చుతున్న పాకిస్తాన్‌కి ఇది పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. తీవ్రవాదుల్ని తయారుచేసి, భారత్‌లోకి వారిని పంపించి, తద్వారా పాకిస్తాన్‌ దొంగదెబ్బ తీయడమూ ప్రపంచమంతా చూస్తోంది. అలా పాకిస్తాన్‌ దాష్టీకానికి భారతదేశంలో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరెందుకు, కుల్‌భూషణ్‌ జాదవ్‌కి ఉరిశిక్ష విధించి, పాకిస్తాన్‌ రచ్చ చేసింది.? 

ఇదేమంత మిలియన్‌ డాలర్ల ప్రశ్న కాదు. కుల్‌ భూషణ్‌కి ఉరిశిక్ష విధిస్తే, భారత్‌ మండిపడ్తుందని తెలుసు. తద్వారా కుల్‌భూషణ్‌, భారతీయుడేనని నిరూపించాలి. భారత గూఢచారిగా ప్రపంచానికి పరిచయం చెయ్యాలి. అప్పుడు అంతర్జాతీయ సమాజం దృష్టిలో భారత్‌ని దోషిగా చూపించాలి. అదీ పాకిస్తాన్‌ కుట్ర. కానీ, కుల్‌ భూషణ్‌ భారత గూఢచారి అనడానికి ఆధారాలు లేవని అంతర్జాతీయ న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇంకేముంది, మేటర్‌ క్లియర్‌.! పాకిస్తాన్‌ పాపం పండిపోయింది.

ఇప్పుడు పాకిస్తాన్‌ షరామామూలుగానే, సరిహద్దుల్లో ఉద్రిక్తతల్ని పెంచుతుంది.. యుద్ధానికి మరోమారు అత్యుత్సాహం చూపుతుంది. అందుకే, ఇప్పుడే భారత్‌ మరింత అప్రమత్తంగా వుండాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?