Advertisement

Advertisement


Home > Articles - Special Articles

అయ్యోద్యపై ఎలా కుదిరేను సయోద్య.!

అయ్యోద్యపై ఎలా కుదిరేను సయోద్య.!

అయోద్యలో రామ మందిర నిర్మాణంపై వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. రామ జన్మభూమిలో ఒకప్పుడు రామ మందిరం వుండేదనీ, దాన్ని కూల్చేసి బాబ్రీ మసీదు నిర్మాణం చేపట్టారనేది ఓ వాదన. అయితే, అసలక్కడ రామ జన్మభూమి అనడానికి తగ్గ చారిత్రక ఆధారాల్లేవనీ, అది ఎప్పటినుంచో బాబ్రీ మసీదు వుందనీ ఇంకో వాదన విన్పించడం మామూలే. చరిత్రను చూస్తే, అయోద్య రామజన్మభూమే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. 

ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. అప్పటినుంచి ఇప్పటిదాకా అక్కడ వివాదం అలాగే వుంది. దేశంలో 2014 ఎన్నికలు - ఎన్డీయే అధికారంలోకి వచ్చాక అయోద్యలో రామ మందిర నిర్మాణం అనే వ్యవహారం మళ్ళీ తెరపైకొచ్చింది. తాజాగా, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగి తీరుతుందన్న వాదనలు గట్టిగా విన్పిస్తున్నాయి. 

బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, 'కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకోండి..' అంటూ ఇరువర్గాలకూ సలహా ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. పరిష్కారం కుదరని పక్షంలో, తాము మధ్యవర్తిత్వం వహిస్తామన్నది సర్వోన్నత న్యాయస్థానం వాదన. ఇది చాలా సున్నితమైన విషయమని సర్వోన్నత న్యాయస్థానమే వ్యాఖ్యానించింది. అవును మరి, అంత సున్నితమైన అంశం కాబట్టే, దీని చుట్టూ పెద్ద రాజకీయ రచ్చ జరుగుతోంది. 

రామ మందిరం పేరుతో బీజేపీ, బాబ్రీ మసీదు పేరుతో బీజేపీయేతర రాజకీయ శక్తులు.. దేశంలో ఓట్లు దండుకుంటూనే వున్నాయి రెండు దశాబ్దాలుగా. ఇక ముందూ అయోద్య - రామమందిరం - బాబ్రీ మసీదు అంశాలపై 'ఏకాభిప్రాయం' కుదురుతుందనీ, ఈ వివాదంపై పరిష్కారం దొరుకుతుందనీ ఆశిస్తే, అంతకన్నా అత్యాశ ఇంకొకటుండదు. ఇదేమీ అసాధ్యమైన విషయం కాదు. కానీ, 'రాజకీయ అవసరాలు' ఇందులో ముడిపడి వున్నాయి. 

ఒకవేళ బీజేపీ హయాంలో రామ మందిర నిర్మాణం షురూ అయితే, దేశాన్ని భగ్గున మండించేందుకు బీజేపీయేతర రాజకీయ శక్తులు ఏమాత్రం వెనుకాడబోవన్నది నిర్వివాదాంశం. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనతో ఎంతోమంది ప్రాణాలు పోయాయి. ఆనాటి పరిస్థితుల్ని తలచుకుంటే, ఇప్పుడు రామమందిర నిర్మాణం ఇంకెలాంటి ఆందోళన పరిస్థితుల్ని తీసుకొస్తుందోనన్న భయాందోళనలు కలగడం సహజమే. 

ఇరువర్గాలూ ఓ అవగాహనకు వచ్చినాసరే, 'సున్నితమైన' అంశం కదా, అందునా రాజకీయ ప్రయోజనాలు ముడిపడి వున్న వివాదం కదా.. అందుకే, ఇది ఎప్పటికీ పరిష్కారం లేని సమస్యగానే మిగిలిపోతుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాలూ అవసరం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?