Advertisement

Advertisement


Home > Articles - Special Articles

బాక్సింగ్‌లో రివర్స్‌ పంచ్‌

బాక్సింగ్‌లో రివర్స్‌ పంచ్‌

ఆసియా క్రీడల్లో భాగంగా సెమీ ఫైనల్స్‌లో భారత బాక్సర్‌ సరితాదేవి ‘ఔట్‌’ అయ్యింది. అయితే, కావాలనే తనను ఔట్‌ చేశారని ఆరోపిస్తోందామె. ఈ మేరకు అంతర్జాతీయ బాక్సింగ్‌ సమాఖ్యకు సరితాదేవి, ఆమె భర్త ఫిర్యాదు చేశారు. ‘రింగ్‌’లో ప్రత్యర్థితో సరితాదేవి పోరాటం చేసినా, ఆమెను ఏకపక్షంగా ఓడిపోయినట్లు ప్రకటించడమేంటని మరో భారత బాక్సర్‌ మేరీకోమ్‌ కూడా ప్రశ్నిస్తున్నారు. దక్షిణ కొరియా చేతిలో బాక్సింగ్‌ సమాఖ్య కీలుబొమ్మగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా సరితాదేవి ఓడిపోగా, ఆ మ్యాచ్‌లో నెగ్గిన వ్యక్తి కూడా దక్షిణ కొరియాకి చెందినదే కావడంతోనే భారత్‌కి పతకం రాకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌ మాత్రమే కాదు, అంతకన్నా ముందు ఇదే విషయమై మంగోలియా టీమ్‌ కూడా ఫిర్యాదు చేసింది. అంపైర్‌ వాస్తవాల్ని పరిగణనలోకి తీసుకోకుండా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగినట్లుగా విజేతల్ని ప్రకటిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ.

భారత బాక్సింగ్‌ విభాగం, భారత బాక్సర్లకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న అవమానాలపై పెదవి విప్పడంలేదనీ, ఆటగాళ్ళకు మద్దతుగా నిలవడంలేదని సరితాదేవి ఆరోపించారు. భారతదేశానికి తాము పతకాలు తీసుకువస్తోంటే, తమకు జరిగిన అన్యాయాలను ప్రశ్నించే అవకాశం కూడా భారత బాక్సింగ్‌ విభాగం కల్పించకపోవడం దారుణమని సరితాదేవి ఆరోపించారు. సెమీ ఫైనల్స్‌లో సరితాదేవి ఓడిపోవడంతో ఆమె కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ తరహా ఆరోపణలు వస్తున్నప్పుడైనా భారత బాక్సింగ్‌ విభాగం తగు చర్యలు తీసుకుంటే, భారత్‌కి రావాల్సిన పతకాల సంఖ్య మరింత పెరుగుతుందన్నది క్రీడా విశ్లేషకుల వాదన. అయితే అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారుల పట్ల, మన క్రీడా సంస్థల పట్ల వున్న చిన్నచూపు కారణంగానే భారత్‌ తరఫున టాలెంటెడ్‌ ప్లేయర్స్‌ అంతర్జాతీయ గేమ్స్‌లో ఆడుతున్నా, గట్టిగా తమ వాదనను విన్పించలేకపోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?