Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఛీ.. పాడు.. బ్యాన్‌ చేసేదెలా.?

ఛీ.. పాడు.. బ్యాన్‌ చేసేదెలా.?

నీలి చిత్రాలంటూ ఇదివరకు ప్రత్యేకంగా వుండేవి. వీసీఆర్‌ ` వీసీపీల కాలంలో ఇది అత్యంత గోప్యమైన వ్యవహారం. సీడీల ట్రెండ్‌లోకి వచ్చాక కొంచెం ఎక్కువగానే జన బాహుల్యంలోకి వెళ్ళిపోయాయి నీలి చిత్రాలు. పెన్‌ డ్రైవ్‌లు, యూఎస్‌బీ డివైజ్‌లు దాన్ని మరింత సరళతరం చేసి పారేశాయి. ఇంటర్నెట్‌ బాగా విస్తరించాక.. నీలి చిత్రం చాలా సర్వసాధారణమైన విషయంగా మారింది. పీసీ (పర్సనల్‌ కంప్యూటర్‌) ముందు కూర్చుని, ఇంటర్నెట్‌ ఓపెన్‌ చేస్తే విచ్చలవిడిగా నీలి చిత్రాలు దర్శనమిస్తాయి.

స్మార్ట్‌ ఫోన్ల పుణ్యమా అని నీలి చిత్రాలు మంచి నీళ్ళకన్నా తేలిగ్గా దొరికే పరిస్థితులు వచ్చేశాయి. ఇది సాంకేతిక విప్లవం. కత్తితో కూరగాయలు కొయ్యవచ్చు.. మనుషుల పీకలూ తెగ నరకొచ్చు. అలాగే సాంకేతిక విప్లవం కూడా. సమస్త సమాచారం ఇంటర్నెట్‌లో దొరుకుతుంది. దాంతోపాటే అశ్లీల సాహిత్యం, అశ్లీల చిత్రాలు కూడా. విజ్ఞాన సమాచారం కన్నా, రతి విజ్ఞాన సమాచారంపైనే యువత ఎక్కువ ఫోకస్‌ పెడ్తోందిప్పుడు.

యువత సంగతెలా వున్నా, బాల్యం కూడా ఇప్పుడీ ‘రతి విజ్ఞాన సమాచారం’ పొందడంలో ‘బానిసలు’గా మారిపోయారు. ఒకప్పుడు మొబైల్‌ ఫోన్‌ గొప్ప. ఇప్పుడు పాతిక వేల రూపాయల ఖరీదు చేసే స్మార్ట్‌ ఫోన్‌ చాలా చిన్న విషయం. పల్లెటూళ్ళలో కూడా స్మార్ట్‌ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. దాంతో, ప్రతి ఒక్కరి జేబులోనే అశ్లీల సమాచారం విచ్చలవిడిగా దొరికేస్తోంది.

ఇంట్లో కంప్యూటర్‌ ముందు తమ పిల్లవాడు ఏం చేస్తున్నాడో.. అని ఆవేదన చెందే తల్లిదండ్రుల సంఖ్యకన్నా, స్మార్ట్‌ ఫోన్‌తో ఏమేం తెలుసుకోకూడనివి తెలుసుకుంటున్నాడోనని ఆందోళన చెందే తల్లిదండ్రులు ఎక్కువైపోయారు. అలాగని చేతిలోంచి ఫోన్‌ లాక్కోగలరా.? ఛాన్సే లేదు. వాడిది కాకపోతే, ఇంకో ఫ్రెండ్‌ ఫోన్‌లో అయినా వాడిక్కావాల్సింది వెతుక్కుంటాడు. వ్యవస్థలోకి వెళ్ళిపోయిందీ పైత్యం.

మీడియాలో గత కొద్ది రోజులుగా పిల్లలు - స్మార్ట్‌ ఫోన్లు - ఇంటర్నెట్‌ - అశ్లీలం అనే విషయమై చర్చ జరుగుతోంది. వ్యక్తిత్వ వికాస నిపుణులు, పిల్లల సైకాలజీ నిపుణులూ తమకు తోచిన విషయాల్ని చెబుతున్నారు. అసలు దీనికి ఫుల్‌స్టాప్‌ పడుతుందా.? ఈ అశ్లీల వైరస్‌కి అడ్డుకట్ట పడేదెలా.? అంటే, సింపుల్‌.. దేశంలోకి అశ్లీలం అనేది ఇంపోర్ట్‌ కాకుండా ఇంటర్నెట్‌కి సెన్సార్‌ పెట్టడం. కానీ, పాలకులు అందుకు సాహసించరు.

ఎందుకంటే, ఇంటర్నెట్‌ బిజినెస్‌ ఈ స్థాయికి చేరుకుందంటే, అది విజ్ఞన సమాచారం ఎఫెక్ట్‌ కాదు, అశ్లీల సాహిత్యం ఎఫెక్ట్‌ కారణంగానే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?