Advertisement

Advertisement


Home > Articles - Special Articles

సినిమా చూపిత్త మావా

వురే...అప్పోజీ...నీ జతగా నేనుండాలి..రా.. అన్నాడు గోపాలం

ఓర్నీ గోపాలం..ఎన్ని మాటలు దూర్చేసావురా..నా జత నీకుండాలనా..లేక, ఆ సినిమాకు నన్ను రమ్మనమనా? ఇయి గాక ఇంకా ఏటైనా వున్నాయా?

అపార్థం చేసుకోకు బుజ్జీ..అయినా ఆ సినిమాకేటొచ్చంది..అంత కస్సుమన్నావు..

ఏటొచ్చిందా..

లక్ష్మీ గణపతి ఫిలింస్..దెయ్యాల కోట..ఇలాంటి సినిమాలు చూసావా..

ఛ..అయ్యెందుకు చూస్తాను..వాటి వొరిజినళ్లు ఇంగ్లీషులో సూత్తాను కానీ.

అంటే అర్థం కాకపోయినా..

అర్థం కావడం కాదెహె ముఖ్యం..ఆ ముఖాలు..ఆ భాష..ఆ సినిమా అంతే, కానీ బుష్షో. ఒబామానో ఫారిన్ బ్యాక్ గ్రౌండ్ లో తెలుగులో మాట్లాడుతుంటే ఎలా వుంటుంది చెప్పు?

ముందు ఇది నాకు అర్థం కాలేదు.

వెర్రి మెకమా...నీ జతగా నేనుండాలి బొమ్మ ఎక్కడిది?

అదీ తెలీదనుకున్నావేటి..హిందీ బొమ్మ..ఆషికీ 2 వంద రోజులు పైన ఆడేసింది కదేటి మన ట్రివోలిలో..

మరదే. ఆ హిందీ బొమ్మ తీసుకొచ్చి తెలుగులో చేసారు కదా..మరి తెలుగులో ఎందుకు చేయడం?

ఎందుకేటి మనోళ్లకు మన భాషలో, మనోళ్లతో సినిమా చూపించడానికి.

మరి మనోళ్లకు మనవాళ్లని చూపించకుండా మళ్లీ హిందీ వోళ్లనే చూపించడం ఏమిటంట? ఆ సచిన్ బాబును చూస్తే హిందీ హీరోలెక్కుంటాడు కదా..ఆ అమ్మాయి ఎవరు..నాజియానా..అంతకన్నా హిందీ మొకమే కదా..

అయితే మాత్రం మాటలు,పాటలు తెలుగులోనే కదా వుండేది

అయితే మాత్రం.. ఏమిట్రా బాబూ..సల్మానో, షారూకో పెదాలాడిస్తూ వుంటే తెలుగు మాటలు వింటున్నట్లు గా వుండదూ. పైగా పాటల ట్యూన్లు అవేనాయె..సూటు, బూటు,, కారులు, వీధులు, సెట్ లు అన్నీ అవేనాయె. ఇలా సినిమా అంతా హిందీ సినిమా మాదిరిగా కనిపిస్తూ వుంటే, 

పోనీ అయ్యన్నీ అలా వుంచి తెలుగు మొకాలనెడితే ఆడేదంటావా?

ఎలా అడుద్ది..ఆడదు కాక ఆడదు..

మళ్లీ అదేం ట్విస్ట్..ఇప్పుడే అంటివి కదా..అన్నీ హిందీ వాసనే అని..మరి తెలుగువాళ్లు వేస్తే ఎందుకాడదు?

పిచ్చోడా..కామెడీ లేకుండా సినిమా చూడ్డం తెలుగువాడి వల్ల అవుతుందా?

మరో చరిత్ర లాంటి సినిమాలో కూడా కామెడీ వుందా లేదా? ఈ సినిమాలో తోడుతూ, తాగుడు యవ్యారం..అమ్మాయి..అపార్ధాలు, త్యాగం తప్పమరో వైనం వుందా?

లేదనుకో..అయితే మనవాళ్లు ప్యూర్ లవ్ స్టోరీలు చూడరంటావా?

పూర్ లవ్ స్టోరీలు అలవాటు చేసారు కదా మన సినిమావోళ్లు..ఇక ప్యూర్ స్టోరీలేం చూడగలరు?

అయితే ఇది తెలియకే సినిమాను తెలుగులోకి దించేసారంటావా?

భలే పదం వాడావ్ రా..దించేసారని..అచ్చంగా అదే మరి..సినిమా..సీన్లు, పాటలు..దించీసారు. ఈరో ఈరోయిన్లు కూడా అక్కడ నుంచి దిగిపోయారు. 

ఏదైనా మన సచిన్ బాబు ఘటికుడు రా...బండ్ల గణేష్ సినిమాకు హీరో అయిపోయాడు. ఆయనేటి రా బాబూ..మెగా హీరోలు, నందమూరి హీరోలతో సినిమా చేస్తూ,. సచిన్ బాబుతో కూడా చేసేసాడు.

పిచ్చోడా తెలీకుండా మాట్లాడీకు..అన్ని ఆటలకూ మన స్వంత డబ్బులు ఖర్చు చేయక్కరలేదు. కొన్నింటికి స్పాన్సర్లుంటారు..అక్కడ ఆటాడినా లాభమే.

అంటే సచిన్ బాబు సినిమాను స్పాన్సరు చేసాడంటావా?

అని నేన్నన్నానా? ఏనో సచిన్ బాబు వచ్చి, బండ్ల గణేష్ ను 'నా జతగా నువ్వుండాలి' అని అంటే అని వుండొచ్చేమో అంటున్నాను. 

పోన్లే ఎవరికి ఎవరు జతయితేనేం..రీమేక్ కు తక్కవ...డబ్బింగ్ కు ఎక్కువ లాంటి సినిమాలు కూడా వుండాయని తెలిసొచ్చింది.

'చిత్ర'గుప్త

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?