Advertisement

Advertisement


Home > Articles - Special Articles

వైయస్ రాజశేఖర రెడ్డిగారికి అమెరికాలో ఘనమైన నివాళి

వైయస్ రాజశేఖర రెడ్డిగారికి అమెరికాలో ఘనమైన నివాళి

వాషింగ్టన్‌ డి.సి.: (మేరిల్యాండ్) :  ధరిత్రి మరువని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన చిరస్మరణీయులు శ్రీ Y S రాజశేఖర్ రెడ్డి గారు అన్నది అందరికీ చిరపరిచితమే. ప్రియతమ నేత  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరవ వర్థంతి కార్యక్రమాన్ని అభిమానులు కార్యకర్తలు ఇక్కడి ఎల్లికట్ట్ సిటీ, మేరిల్యాండ్, USA లో సమావేశమై ఆ మహనీయుడికి ఘన నివాళి ఘటించారు. 

ఈ సంద‌ర్భంగా వైఎస్సార్ అభిమానులు ప‌లు సేవ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. మేరిల్యాండ్ ఫుడ్ డొనేషన్ సెంటర్లో ప్రసన్న కాకుమాని, ప్రతాప్ కాకర్ల, విజయ మోహన్, సునీల్ దేవిరెడ్డి  త‌దిత‌రుల ఆధ్వ‌ర్యంలో ఆహార పంపిణీ చేప‌ట్టారు. 

వైఎస్సార్‌సీపీ అమెరికా ఎన్ ఆర్ ఐ క‌మిటీ అడ్విసేర్, మిడ్ అట్లాంటిక్  రీజియన్ కో ఆర్డినేటర్ శ్రీ వల్లూరు రమేష్ రెడ్డి గారు, కోర్ కమిటీ సభ్యులు శ్రీ కిరణ్ ముక్తాపురం, మరియు శ్రీ ప్రసన్న కాకుమాని  గారి ఆధ్వర్యంలో సమావేశం పూజతో నిరాడంబరంగా ప్రారంభమైనది.
మొదటగా శ్రీ వల్లూరు రమేష్ రెడ్డి గారు ప్రసంగిస్తూ యావత్ భారతదేశంలో పేదవాడి గుండె చప్పుడు విన్న తొలి నేత దివంగత నాయకులు శ్రీ రాజశేఖర్ రెడ్డిగారని, తన పాదయాత్రతో రైతుల కష్ట నష్టాలను ,పేదవాడి ఆకలి మంటలను స్వయంగా చూసి చలించి నాటి స్వర్ణ యుగాన్ని రప్పించే భగీరధ ప్రయత్నం జేసిన అపర భగీరధుడు రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. చరిత్రలో నిలిచే వివిధ పధకాలు 108,ఆరోగ్య శ్రీ వంటి మొదలైన వాటిని ప్రవేశపెట్టి "రాజన్న పరిపాలన"కు చిరునామా గా నిలిచి చరితలో చరితార్థులుగా నిలిచిపోయారని పేర్కొన్నారు. జగన్ ఒక్కరే రాజన్న రాజ్యాన్ని అందిస్తారని విశ్వాసం వెలిబుచ్చారు. 

ఆరోగ్యప్రదాత, అన్నదాతల కల్పతరువు, పేదల దివ్యదాత ఇలా ఎన్ని చెప్పినా తక్కువే. ఆయనే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత ...తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోని మహనీయుడు  శ్రీ దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. వీరిని రైతు బాంధవుడని పేదల పాలిటి పెన్నిధని అలాంటి మహోన్నతమైన వ్యక్తి మన మధ్య లేకునన్నూ ప్రతి ఒక తెలుగువాడి గుండెల్లో నిలిచిఉన్నారని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. ఆ మహనీయుడి ఆశయాలను,ఆదర్శాలను ఆలోచనలను ఆచరణలో పెట్టి ఆంధ్ర జగతి సిగలో YSRCP పతాకాన్ని చిరస్థాయిగా నిలపడమే YSR కు నిజమైన నివాళి అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటు ముఖ్య సభ్యులు శివారెడ్డి ప్రస్తుతించారు.     

చివరగా వందన సమర్పణలో భాగంగా కోర్ కమిటీ సభ్యులు శ్రీ ప్రసన్న కాకుమాని గారు ప్రసంగిస్తూ ఇలాగే మన YSR కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని అందుకు అందరి సహకారం అవసరమని తెలియజెప్పుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాంగోపాల్ దేవపట్ల , కిరణ్ ముక్తాపురం, రమేష్ రెడ్డి వల్లూరు, సుదర్శన్ దేవిరెడ్డి, నాగార్జున కొండూరు, యర్రం వెంకట్, రాజు, నరసా రెడ్డి ఆవుల, జనార్ధన్ నానికాల్వ, విజయ్ మోహన్ కోకటం, కోట్ల తిప్పారెడ్డి,  ప్రతాప్ కాకర్ల, రాణా దాసరి ,సునీల్ దేవిరెడ్డి, చంద్ర కాటుబోయిన మొదలైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపడంతో రాజశేఖర్ రెడ్డి గారి సంస్మరణ దినోత్సవం ముగిసింది. శ్రీమతి సమంతా,  శ్రీ కిరణ్ ముక్తాపురం గార్లకు ప్రత్యెక ధన్యవాదాలు తెలిపారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?