Advertisement

Advertisement


Home > Articles - Special Articles

'డ్రగ్స్‌' లేకపోతే 'పార్టీ' కష్టం బాసూ

'డ్రగ్స్‌' లేకపోతే 'పార్టీ' కష్టం బాసూ

సినీ పరిశ్రమలో పెరిగిపోయిన పార్టీ కల్చర్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ తరహా పార్టీలు బాలీవుడ్‌లో ఎక్కువగా కన్పించేవి ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం బాలీవుడ్‌ని మించిపోయింది టాలీవుడ్‌. పార్టీ అంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు.! అక్కడ డ్రెస్‌ కోడ్‌ దగ్గర్నుంచి చాలా విషయాలూ చాలా చాలా ప్రత్యేకంగా వుంటాయి. అదో లోకం.! 

ఆగండాగండీ.. ఇదంతా కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే కాదు. నిజానికి, సినీ పరిశ్రమకు సంబంధించి జరిగే పార్టీలకన్నా, ఇరతత్రా పార్టీలే ఎక్కువగా జరుగుతుంటాయి. అవన్నీ 'హైఫై' వ్యవహారాలు. పబ్బుల్లో పార్టీలు ఓ ఎత్తు.. తమ తమ నివాసాల్లో పార్టీలు ఇంకో ఎత్తు. ఇవి చాలవన్నట్లు ఫామ్‌హౌస్‌లలో పార్టీలు మరో ఎత్తు. చెప్పుకుంటూ పోతే, కథ చాలానే వుంది. ఏ పార్టీ అయినాసరే, అక్కడ చాలావరకు డ్రగ్స్‌ కంపల్సరీ అన్నది 'ఈవెంట్స్‌' సందర్భంగా వెలుగు చూసే మాట. 

అందుకే ఈ 'ఈవెంట్‌' కోసం మేనేజ్‌మెంట్‌ సంస్థలు కుప్పలు తెప్పల్లా పుట్టుకొచ్చేశాయి. ఓ వైపు పబ్బులు, ఇంకో వైపు ఈవెంట్లు.. వెరసి హైద్రాబాద్‌ని సరికొత్తగా మార్చేశాయి. ఎడా పెడా పబ్బులకు లైసెన్సులు మంజూరు చేసెయ్యడం తప్ప, వాటి మీద నిఘా లేకపోవడం.. ఒకవేళ నిఘా పెట్టినా, తెరవెనుకాల 'ఒప్పందాల' బలంగా వుండడం.. వెరసి, హైద్రాబాద్‌లో పార్టీ అంటే 'డ్రగ్స్‌' తప్పనిసరి అన్న భావన నెలకొంది. 

సినీ పరిశ్రమకు సంబంధించిన పార్టీలు చాలా తేలిగ్గా వెలుగులోకి వచ్చేస్తాయి. కానీ, మిగతా పార్టీలే అంత తేలిగ్గా బయటకు రావు. వాటి గురించి ఎవరూ పట్టించుకోరు. అందుకే, డ్రగ్స్‌ కూడా ఆ పార్టీల్లోనే ఎక్కువగా వాడకంలో వుంటాయన్నది ఓ వాదన. ఇప్పుడు 'డ్రగ్స్‌' వ్యవహారం వెలుగు చూశాక, ఒక్కసారిగా పార్టీలన్నీ 'డల్‌' అయిపోయాయి. ఈ మధ్యకాలంలో పార్టీ అంటే ఎవరూ పెద్దగా ఇంట్రస్ట్‌ కూడా చూపించడంలేదట. కారణం, అక్కడ 'మాల్‌' దొరక్కపోవడమేనన్నది ఓ వాదన.

ఇంతకీ ఈ హడావిడి ఎన్నాళ్ళు ఇలా వుంటుంది.? డ్రగ్స్‌ వ్యవహారం రానున్న రోజుల్లో చప్పబడిపోతుందా.? లేదంటే, నిజంగానే ముఖ్యమంత్రి చెబుతున్నట్లు హైద్రాబాద్‌ 'డ్రగ్స్‌ ఫ్రీ' సిటీగా మారుతుందా.? వేచి చూడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?