Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఐఫోన్ లో మరో విప్లవాత్మక మార్పు

ఐఫోన్ లో మరో విప్లవాత్మక మార్పు

యాపిల్ ఐఫోన్ వినియోగదారుల్లో దాదాపు 90శాతం మంది కామన్ గా ఫీల్ అయ్యే అంశం ఒకే ఒక్కటి. అదే డ్యూయల్ సిమ్ ఫెసిలిటీ. ఐఫోన్ లో కూడా 2సిమ్ కార్డులు వేసుకునే సౌలభ్యం ఉంటే ఎంతో బాగుంటుందని ఫీలవ్వని కస్టమర్ ఉండడు. త్వరలోనే ఆ లోటు కూడా తీరబోతోంది.

తమ లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్ ఎక్స్ లో హోమ్ బటన్ ను తొలిగించి విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టిన ఆపిల్ సంస్థ.. ఇప్పుడు డ్యూయల్ సిమ్ సౌకర్యంపై దృష్టిపెట్టింది. 2018లో ప్రవేశపెట్టనున్న మరో కొత్త మోడల్ లో ఇదే హైలెట్ అని తెలుస్తోంది. దీంతో పాటు ఎల్టీఈ టెక్నాలజీకి సంబంధించిన మరో విప్లవాత్మక మార్పుతో సరికొత్త ఐఫోన్ ను డిజైన్ చేస్తోంది ఆపిల్.

ఈ కొత్త మోడల్ కు ఇంకా పేరుపెట్టలేదు. ఎక్స్-సిరీస్ కు కొనసాగింపుగా ఈ మోడల్ ను ప్రవేశపెడతారా.. లేక మరో కొత్త పేరు పెడతారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం ఎక్స్-సిరీస్ కు అనుబంధంగా మరో మోడల్ ను తీసుకొచ్చి, డ్యూయల్ సిమ్ మోడల్ ను ప్రత్యేకంగా లాంఛ్ చేయాలని ఆపిల్ భావిస్తోంది. 

ఆసియా దేశాల్లో డ్యూయల్ సిమ్ హ్యాండ్ సెట్స్ కు ఎక్కువ డిమాండ్ ఉంది. కేవలం ఈ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఆపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?