Advertisement

Advertisement


Home > Articles - Special Articles

లంచాల భారతం: అవినీతిలో మనమే నంబర్ వన్

లంచాల భారతం: అవినీతిలో మనమే నంబర్ వన్

దూసుకుపోతున్నాం.. ఇకపై మనదే గెలుపు. ప్రపంచదేశాల్లో భారత్ సగర్వంగా తలెత్తుకుని నిల్చుంది. భూమి నుంచి అంతరిక్షం వరకు ఏ రంగంలో చూసుకున్నా మనకు తిరుగులేదు. మన నేతలు చెప్పే తియ్యటి మాటలివి. పైకి చెప్పుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. కానీ వాటిల్లోంచి లోలోతుల్లోకి తొంగిచూస్తే అవినీతి భారతం నిస్సిగ్గుగా నిల్చొని కనిపిస్తుంది. అవును... ఆసియా దేశాల్లో అవినీతిలో భారత్ మరోసారి నంబర్ వన్ గా నిలిచింది.  

జర్మనీకి చెందిన ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసియాలోనే అత్యంత అవినీతిమయమైన దేశంగా ఇండియా నిలిచింది. మరీ ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో లంచం ఇవ్వనిదే పని జరగదని 65శాతం మంది పౌరులు అభిప్రాయపడ్డారు. మిగతా రంగాల్లో హాస్పిటల్స్, ఐడీ డాక్యుమెంట్స్, పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి.

ఇక దేశాలవారీగా చూస్తే.. భారత్ తర్వాత రెండో స్థానంలో వియత్నాం ఉంది. భారత్ లో 69శాతం అవినీతి ఉంటే వియత్నాంలో 65శాతం ఉంది. ఇక 41శాతంతో థాయ్ లాండ్, 40శాతంతో పాకిస్థాన్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆసియాలోని ప్రముఖమైన 16దేశాల్లో సర్వే నిర్వహించి ఈ జాబితా తయారుచేశారు. లిస్ట్ లో ఆఖరి స్థానంలో జపాన్ నిలిచింది. అంటే ఆసియాలో అన్ని దేశాల్లో కంటే జపాన్ లోనే అవినీతి తక్కువగా ఉందన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?