Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఈ రోబోలు శృంగార దేవతలు

ఈ రోబోలు శృంగార దేవతలు

రోబోస్ కెనాట్ ఫీల్ లవ్, బట్ దె ఫీల్ సెక్స్... రియల్ డాల్ అనే సంస్థ సరికొత్త క్యాప్షన్ ఇది. మానవుడు సృష్టించిన రోబోలు ప్రేమను ఫీల్ అవ్వలేవు. 'ఫీల్ మై లవ్...' అంటూ పాటలు పాడినా వాటికి అర్థం కావు. కానీ ఇవి సెక్స్ ను బ్రహ్మాండంగా ఫీల్ అవ్వగలవు అంటోంది ఈ కంపెనీ. తాము తయారుచేసిన రోబోలు శృంగారానుభూతిని పూర్తిస్థాయిలో అందిస్తాయంటోంది.

రియల్ డాల్ సంస్థ సరికొత్త రోబోల్ని తయారుచేసింది. 15రకాల సెక్స్ భంగిమల్ని వీటితో ఎంజాయ్ చేయొచ్చు. కౌగిలించుకుంటే కావాల్సినంత వెచ్చదనాన్ని, శృంగారంలో రసానుభూతిని (శబ్దాలతో పాటు) ఇవి గ్యారెంటీగా అందిస్తాయి. అంతేకాదు స్పర్శ, లిప్ కిస్ లో ఏమాత్రం తేడా తెలీదు. కేవలం 6వేల డాలర్లకే ఈ రోబోల్ని దక్కించుకోవచ్చు.

" అంతా అనుకుంటున్నట్టు కేవలం సెక్స్ ను దృష్టిలో పెట్టుకొని వీటిని తయారుచేయలేదు. మీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. మీకు కావాల్సిన తోడును అందిస్తుంది. మీతో మాట్లాడుతుంది. మీ పక్కనే ఉంటుంది. వీటితో మీరు స్నేహం చేయొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీ పక్కన మనిషే ఉన్నట్టు అనిపిస్తుంది". రియల్ డాల్ కంపెనీ సీఈవో మ్యాట్ మెక్ మిలన్ చెబుతున్న మాటలివి.

మరోవైపు ఈ తరహా రోబోలపై అప్పుడే వ్యతిరేకత వ్యక్తమైంది. కొంతమంది వీటిని మెచ్చుకుంటుంటే మరికొంతమంది మాత్రం వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి రోబోల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయని, కొన్ని దేశాల్లో జనాభా మరింత తగ్గిపోయే ప్రమాదముందని వాదిస్తున్నారు. ఇది కూడా నిజమే మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?