Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఇవాంక ది గ్రేట్‌.. అంతే.!

ఇవాంక ది గ్రేట్‌.. అంతే.!

డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడవడం వెనుక ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్‌ కష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాపారవేత్తగా రాణించడానికీ, ఇవాంక సహాయ సహకారాలు చాలా ఎక్కువని ప్రపంచమే కీర్తిస్తోంది. ఈ లెక్కన, ఇవాంక ట్రంప్‌కి వివిధ అంశాలపై ఏ స్థాయిలో అవగాహన వుండి వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.! 

ఇప్పుడిదంతా ఎందుకంటే, ఇవాంక ట్రంప్‌ హైద్రాబాద్‌లో జరుగుతున్న గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆమె ఈ సదస్సుకి హాజరవుతుండడంతో, ప్రపంచాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగం ఎలా వుంటుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. ఇవాంక ప్రసంగం మొదలైంది.. పూర్తయ్యింది.. ఈ మధ్యలో ఆమె ప్రస్తావించిన అంశాలు, అందర్నీ విస్మయానికి గురిచేశాయి. 

హైద్రాబాద్‌, ఇండియా, ఇస్రో.. ఇలా చాలా అంశాల గురించి ఇవాంక ప్రస్తావిస్తోంటే, మురిసిపోకుండా వుండగలమా.? హైద్రాబాదీ బిర్యానీ గురించీ, హైద్రాబాదీ ముత్యాల గురించీ, హైద్రాబాద్‌ టీ-హబ్‌ గురించీ ప్రస్తావించారు ఇవాంక. 'ముత్యాలంటే యువతే..' అని ఆమె చెప్పిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. చంద్రుడ్ని దాటి మార్స్‌ వరకూ భారత అంతరిక్ష కార్యక్రమాలు దూసుకెళ్ళడాన్నీ ఇవాంక ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది.. సమాజం బాగుంటుంది.. దేశం.. ప్రపంచమూ బాగుంటుంది.. అనే మంచి సందేశాన్ని కూడా ఇవాంక ఇవ్వడం గమనార్హం. అన్నిటికీ మించి, అమెరికన్‌ యాక్సెంట్‌కి కొంచెం ఇండియన్‌ యాక్సెంట్‌ టచ్‌ ఇచ్చినట్లుగా.. ప్రతి పదం అత్యంత తేలికగా అందరికీ అర్థమయ్యేలా ఇవాంక చేసిన ప్రసంగం సింప్లీ సూపర్బ్‌ అంతే. 

ఇవాంక రాక కోసం తెలంగాణ రాష్ట్రం, హైద్రాబాద్‌.. ఎంతలా ఎదురుచూశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవాంక వచ్చారు.. ఉత్సాహం తీసుకొచ్చారు. పలువురు మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని పేరు పేరునా ప్రస్తావిస్తూ, ఇవాంక చేసిన ప్రసంగం చాలా చాలా ఇన్‌స్పైరింగ్‌గా వుందన్నది నిర్వివాదాంశం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?