Advertisement

Advertisement


Home > Articles - Special Articles

జియో రీచార్జ్: లడ్డూ కావాలా నాయనా

జియో రీచార్జ్: లడ్డూ కావాలా నాయనా

జియో కస్టమర్లు ఇప్పటికే పలుమార్లు పండగ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్లు మరోసారి పండగ చేసుకునే సమయం వచ్చేసింది. రిపబ్లిక్ డే కానుకగా మరోసారి క్రేజీ ఆఫర్ ప్రకటించింది జియో. రీచార్జ్ పై ఏకంగా వందశాతం మనీ బ్యాక్ ప్రకటించింది.

అయితే ఇది డైరెక్ట్ రీచార్జీలకు వర్తించదు. అమెజాన్ పే, పేటీఎమ్, మొబిక్విక్, ఫ్రీచార్జ్ లాంటి అప్లికేషన్లపై రీచార్జ్ చేసుకుంటే ఈ వందశాతం క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. నిజానికి ఆన్ లైన్ లో రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు ఈ వేదికలు కొత్తేంకాదు. మరీ ముఖ్యంగా పేటీఎమ్ లాంటి మాధ్యమాల వాడకం మరీ ఎక్కువైన నేపథ్యంలో జియో ఆఫర్ దాదాపు అందరికీ కలిసొచ్చేదే. 

రిపబ్లిక్ డే కానుకగా ఈ క్యాష్ బ్యాక్ ను ప్రకటించిన జియో.. ఈనెల 31వరకు ఈ ఆఫర్ ను పొడిగించింది. క్యాష్ బ్యాక్ రూపంలో పొందిన ఎమౌంట్ ను జియో యాప్ ద్వారా ఎప్పుడైనా తిరిగి రీచార్జ్ కోసం వాడుకోవచ్చు. అయితే 398 రూపాయల పైన రీచార్జ్ చేసుకునే వినియోగదారులకే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

పెరిగిన వినియోగదారులు, ఇస్తున్న ఆఫర్ల కారణంగా ఇప్పటికే మొదటి దశ లాభాలు కళ్లజూసింది జియో. ఈ 15నెలల కాలంలో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో తొలిసారిగా లాభాలు ప్రకటించింది. 504కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ ఎనౌన్స్ చేసింది. త్వరలోనే గల్లీల్లో ఉండే కిరాణా దుకాణాలతో సరికొత్త ఒప్పందు కుదుర్చుకునే దిశగా పావులు కదుపుతోంది జియో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?