Advertisement

Advertisement


Home > Articles - Special Articles

జియో 4జీ మొబైల్స్: రేపట్నుంచే డెలివరీ

జియో 4జీ మొబైల్స్: రేపట్నుంచే డెలివరీ

ఎంతోమంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జియో 4జీ ఫోన్లు రేపట్నుంచే ఇళ్లకు చేరబోతున్నాయి. ఆదివారం నుంచి సరిగ్గా 15రోజుల్లోగా దేశవ్యాప్తంగా 60లక్షల జియో ఫోన్లను వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది జియో. 

మొదట బుక్ చేసుకున్న వాళ్లకే మొదట మెసేజ్ వస్తుంది. ఆగస్ట్ 24న ఈ బుకింగ్స్ ప్రారంభంకాగా.. అప్పుడు రూ.500 చెల్లించిన వినియోగదారుడు.. ఇప్పుడు మిగతా బ్యాలెన్స్ (రూ.1000) చెల్లించి దగ్గర్లోని జియో స్టోర్ నుంచి ఫోన్ సొంతం చేసుకోవచ్చు. జియో స్టోర్ వివరాలు మెసేజ్ రూపంలో వస్తాయి. ఇక చెల్లించిన రూ.1500 మూడేళ్ల తర్వాత కస్టమర్ కు తిరిగి ఇచ్చేస్తారు.

జియో 4జీ ఫోన్లు ముందుగా గ్రామీణులకే అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఇచ్చిన పిన్ కోడ్ ఆధారంగా గ్రామీణ ప్రాంత వినియోగదారులకే ముందుగా ఫోన్లు సరఫరా చేయాలని నిర్ణయించింది జియో. తర్వాత పట్టణాలు, ఆ తర్వాత నగరాలకు డెలివరీ ఇవ్వనుంది. 

రేపట్నుంచి 15రోజుల్లోగా 60లక్షల ఫోన్లను అందించిన తర్వాత నెక్ట్స్ బుకింగ్ వివరాల్ని వెల్లడించనుంది జియో. నెక్ట్స్ టైం నుంచి బుక్ చేసుకునేవాళ్లకు.. వారం రోజుల్లోపే మొబైల్స్ అందించేలా చర్యలు చేపట్టారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?