Advertisement

Advertisement


Home > Articles - Special Articles

జియో మెలిక... నో మీడియా కేబుల్

జియో మెలిక... నో మీడియా కేబుల్

ఊహించని విధంగా వచ్చిన రెస్పాన్స్ తో ఉబ్బితబ్బిబ్బవుతోంది జియో. శనివారంతో జియో 4జీ హ్యాండ్ సెట్స్ బుకింగ్ ను నిలిపివేసింది. కచ్చితంగా ఓ సంఖ్యను బయటకు చెప్పనప్పటికీ మిలియన్లలో ఆర్డర్లు వచ్చినట్టు మాత్రం ప్రకటించింది. అంచనా కంటే ఎక్కువ బుకింగ్స్ రావడంతో డెలివరీ టైమ్ ను ఇంకాస్త పొడిగించింది జియో.

లెక్కప్రకారం.. ఈనెల రెండో వారం నుంచి జియో 4జీ హ్యాండ్ సెట్స్ డెలివరీ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దసరా రోజు నుంచి ఈ డెలివరీ ప్రారంభం అవుతుంది. ఫోన్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ దగ్గర్లోని జియో ఔట్ లెట్ వివరాలతో ఎస్ఎంఎస్ వస్తుంది. అక్కడికి వెళ్లి బ్యాలెన్స్ మొత్తం చెల్లించి జియో ఫోన్ పొందవచ్చు. వారంలో 50లక్షల 4జీ హ్యాండ్ సెట్స్ డెలివరీ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

తాజాగా నెలకొన్న డిమాండ్ తో ఇప్పట్లో మరోసారి జియో 4జీ హ్యాండ్ సెట్స్ బుకింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే జరిగిన బుకింగ్స్ కు డెలివరీ ఇచ్చిన తర్వాత అప్పుడు మరోసారి ఆన్ లైన్/ఆఫ్ లైన్ బుకింగ్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. 

అయితే 4జీ హ్యాండ్స్ సెట్స్ విషయంలో చిన్న మెలిక పెట్టింది జియో. డెలివరీ చేయబోతున్న హ్యాండ్ సెట్స్ తో "జియో మీడియా కేబుల్" ఇవ్వడం లేదు. ఈ కేబుల్ ఉంటేనే మొబైల్ తో టీవీ అనుసంధానం జరుగుతుంది. ఈ కేబుల్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో చెప్పడం లేదు సదరు సంస్థ.

మరోవైపు 309 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటేనే ఈ కేబుల్ తో టీవీ అనుసంధానం జరిగేలా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేశారు. ఇది తప్ప మిగతా అన్ని ఫీచర్లు, అన్ని రకాల రీచార్జిలపై అందుబాటులో ఉంటాయి. రిలయన్స్ జియో వాణిజ్య విభాగంలోకి ప్రవేశించి తాజాగా ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా మరికొన్ని స్పెషల్ ఆఫర్లు ప్రవేశపెడతారని అంతా ఊహించారు. కానీ అలాంటిదేం జరగలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?