Advertisement

Advertisement


Home > Articles - Special Articles

కొరియా కొరివితో 'ట్రంప్‌' గోకేస్తున్నాడు.!

కొరియా కొరివితో 'ట్రంప్‌' గోకేస్తున్నాడు.!

మొండివాడు రాజుకంటే బలవంతుడని పెద్దలు చెబుతుంటారు. అణ్వాయుధాలు చేతిలో పెట్టుకుని, మొండితనం ప్రదర్శిస్తోన్న ఉత్తర కొరియా విషయంలో అగ్రరాజ్యం అమెరికా చేస్తోన్న ఓవరాక్షన్‌ చూస్తేంటే, ఇది రెండు దేశాల మధ్య ఆధిపత్య పోరులా కన్పించడంలేదు. చూస్తోంటే, ప్రపంచ వినాశనానికి ఆ ఇద్దరూ కలిసి స్కెచ్‌ వేస్తున్నారేమోనన్న అనుమానాలు కలగకమానవు. 

జపాన్‌ మీదుగా ఇప్పటికే రెండు మిస్సైళ్ళను ప్రయోగించింది ఉత్తరకొరియా. ఇటు జపాన్‌, అటు అమెరికా.. ఉత్తరకొరియాపై గుస్సా అయ్యాయి. నిజానికి, కొరియా ఆ మిస్సైళ్ళను ప్రయోగించింది కూడా అమెరికా ఓవరాక్షన్‌ తర్వాతనే. 'నీ అంతు చూస్తా.. నిన్ను మట్టి కరిపించేస్తా.. ప్రపంచ పటంలో నీ దేశమే లేకుండా చేస్తా..' లాంటి ప్రకటనలు ముందుగా అమెరికా నుంచే వచ్చాయి. వాటికి ధీటుగానే ఉత్తరకొరియా నుంచీ ప్రతిదాడి (మాటలు, చేతల రూపంలో) షురూ అయ్యింది. 

ప్రపంచమొక కుగ్రామంగా మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు ఎవర్ని రెచ్చగొట్టినా, అంతిమంగా ప్రపంచ వినాశనం మాత్రం తప్పదు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం జరిగితే, వాటి పరిణామాలు ఎలా వుంటాయనేది ఊహించుకోలేం. అంత భయానకంగా మారిపోతాయి పరిస్థితు. పాకిస్తాన్‌, భారత్‌ మధ్య ఈ తరహా వివాదాలే చూస్తుంటాం. పాకిస్తాన్‌ కూడా ఇటీవలే మరోమారు అణ్వస్త్ర హెచ్చరికలు పంపింది భారతదేశానికి. అఫ్‌కోర్స్‌, భారత్‌ - పాక్‌ హెచ్చరికల్ని లెక్కచేయదనుకోండి.. అది వేరే విషయం. 

భారత్‌ - పాకిస్తాన్‌ పరిస్థితులు వేరు, కొరియా - అమెరికా వ్యవహారం వేరు. అగ్రరాజ్యం అమెరికా అహంకారానికీ, ఉత్తర కొరియా మొండితనానికీ మధ్య 'యుద్ధం' అంటూ మొదలయ్యిందంటే, ఇక అంతే సంగతులు. ఉత్తర కొరియా సంగతేమోగానీ, అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన 'పెద్దన్న' హోదాలో వున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తరకొరియాని రెచ్చగొట్టడం ద్వారా, ప్రపంచ వినాశనానికి కారణమయ్యేలా వున్నాడన్నది నిర్వివాదాంశం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?