Advertisement

Advertisement


Home > Articles - Special Articles

మారితేనే వింత

మారితేనే వింత

దాయాది పాకిస్తాన్‌ మారితేనే వింత.? మారకపోతే వింతేముంది.? 150 మంది చిన్నారుల్ని పాకిస్తాన్‌లో తీవ్రవాదులు పొట్టన పెట్టుకున్న ఘటన ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. కానీ పాకిస్తాన్‌లోని సాధారణ ప్రజానీకం కంటతడిపెట్టింది.. కన్నీరు మున్నీరుగా విలపించింది. పాకిస్తాన్‌లోని రాజకీయం మొసలి కన్నీరు కార్చింది. పాకిస్తాన్‌లోని తీవ్రవాదం వికటాట్టహాసం చేసింది.

ఇంత ఘోర సంఘటన జరిగాక, ఏ దేశమైనా తీవ్రవాదం విషయంలో ఎలా స్పందిస్తుంది.? వున్నపళంగా దేశంలోని తీవ్రవాద కార్యకలాపాలు నడుస్తున్న ప్రాంతాలపై దాడులు చేయడమో, లేదంటే తీవ్రవాదానికి చిత్తశుద్ధితో కూడిన అల్టిమేటం జారీ చేయడమో చేస్తుంది. పాకిస్తాన్‌లోని ప్రభుత్వమూ దాదాపు అదే పని చేసింది. కానీ, ఇక్కడ చిత్తశుద్ధి లోపించింది.

తీవ్రవాద స్థావరాలపై తూతూమంత్రం దాడులు జరిగాయి.. తీవ్రవాదులకు హెచ్చరికలూ జారీ అయ్యాయి. అంతలోనే ఓ తీవ్రవాదికి బెయిల్‌ మంజూరు చేసింది పాకిస్తాన్‌లోని తీవ్రవాద నేరాల్ని విచారిస్తోన్న ప్రత్యేక న్యాయస్థానం. ఇక్కడ ఆ తీవ్రవాది, భారతదేశంపై దాడులకు వ్యూహరచన చేయడం హైలైట్‌ పాయింట్‌. 26/11 పేరు చెబితే భారతదేశం ఇప్పటికీ వణుకుతుంది. అంతటి తీవ్రమైన దుర్ఘటనకు స్కెచ్‌ వేసిన లఖ్వీని పాక్‌ తీవ్రవాద నేరాల విచారణ న్యాయస్థానం బెయిల్‌పై విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదీ పాకిస్తాన్‌కి తీవ్రవాదంపై వున్న చిత్తశుద్ధి.

‘కుక్క తోక వంకర..’ అనే విమర్శలు ప్రపంచ వ్యాప్తంగా ‘లక్వీ బెయిల్‌’పై వచ్చేసరికి, ‘తూచ్‌.. అది టెక్నికల్‌ ప్రాబ్లమ్‌.. తీవ్రవాదాన్ని సహించేది లేదు..’ అంటూ పాకిస్తాన్‌ ప్రభుత్వం బుకాయిస్తోందిప్పుడు. బుకాయింపులు అటుంచితే, 150 మంది చిన్నారులు బలైపోయినా పాకిస్తాన్‌లోని రాజకీయం బుద్ధి మారలేదు. అసలు మారితేనే కదా వింత.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?