Advertisement

Advertisement


Home > Articles - Special Articles

మారణహోమాన్ని మర్చిపోకూడదని

మారణహోమాన్ని మర్చిపోకూడదని

'మంది' ప్రాణాలు తీయడమే ఘనకార్యం.. ఇదీ 'ఐసిస్‌' నినాదం. ప్రపంచానికి పైశాచికత్వాన్ని పరిచయం చేయడంలో తనకు సాటి ఇంకెవరూ లేరన్పించుకుంటున్న కరడుగట్టిన తీవ్రవాద సంస్థ ఐసిస్‌, బ్రిటన్‌పై విరుచుకుపడింది. మాంచెస్టర్‌లో ఉగ్రదాడికి పాల్పడింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే, 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో ఒక్కసారిగా 'ది గ్రేట్‌ బ్రిటన్‌' ఉలిక్కిపడింది. బ్రిటన్‌ మాత్రమే కాదు, ప్రపంచం షాక్‌కి గురయ్యింది. 

చేసిన ఘనకార్యాన్ని ఐసిస్‌ ఇంకా గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. 'ఐసిస్‌ దెబ్బని ప్రపంచం మర్చిపోయినట్టుంది.. ఇదీ ఉగ్రదాడి.. ఇదీ భయం.. ఇదీ మారణహోమం.. ఇలాగే వుంటుంది.. ఇది ఆరంభం మాత్రమే..' అంటూ సోషల్‌ మీడియాలో ఐసిస్‌ చెప్పుకుంది, ప్రపంచాన్ని హెచ్చరించింది కూడా. 

పాప్‌ సింగర్‌ అరియానా గ్రాండే మ్యూజిక్‌ షో కోసం వేలాదిమంది అభిమానులు మాంచెస్టర్‌కి చేరుకున్నారు. మ్యూజిక్‌ షో జరుగుతున్న చోటే బాంబు దాడి జరిగింది. ఈ ఘటనతో పాప్‌ సింగర్‌ అరియానా తీవ్రంగా కలత చెందింది. తన కారణంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాననీ, తన గుండె బద్ధలైపోయిందని కంటతడిపెట్టింది. 

మరోపక్క, బాలీవుడ్‌ సినీ ప్రముఖులు, తమిళ, తెలుగు సినీ ప్రముఖులూ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రధాని నరేంద్రమోడీ, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

ఈ మధ్యకాలంలో ఐసిస్‌కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎక్కడికక్కడ ఐసిస్‌ మూలాలు అంతమవుతున్న దాఖలాలు కన్పిస్తున్నాయి. ప్రపంచం ఒక్కతాటిపైకొచ్చి, ఐసిస్‌ మీద ఉక్కుపాదం మోపుతోంది. ఇక ఐసిస్‌ అంతమవడం ఖాయమనేంతలోపు, ఐసిస్‌ తన ఉనికిని చాటుకోవడం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. సాధారణ పౌరులే లక్ష్యంగా ఐసిస్‌ గత కొంతకాలంగా పెచ్చుమీరుతున్న తీరు, అగ్రరాజ్యాల్ని సైతం ఆందోళనకు గురిచేస్తుండడం గమనార్హం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?