Advertisement

Advertisement


Home > Articles - Special Articles

నేనెప్పటికీ ఇండియన్‌నే: సానియా మీర్జా

నేనెప్పటికీ ఇండియన్‌నే: సానియా మీర్జా

‘మా కుటుంబం శతాబ్దకాలంగా హైద్రాబాద్‌లోనే వుంటోంది.. నేను ఎప్పటికీ భారతీయురాలినే..’ అంటూ వివరణ ఇచ్చింది టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా. తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సానియా మీర్జాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించిన విషయం విదితమే. ఈ విషయమై పెద్దయెత్తున రాద్ధాంతం చేలరేగుతోంది. కారణం ఆమె తండ్రి మహారాష్ట్ర నుంచి వచ్చి హైద్రాబాద్‌లో సెటిల్‌ అవడమే. పైగా ఆమె ప్రస్తుతం పాకిస్తానీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ భార్య కావడంతో సహజంగానే ఆమె చుట్టూ అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్థానికత విషయంలో 1956కి ముందు.. అంటూ తెలంగాణ సర్కార్‌ తెరపైకి తెచ్చిన నిబంధన నేపథ్యంలో సానియా మీర్జాని ఎలా తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తారని బీజేపీ ప్రశ్నిస్తోంది. హైద్రాబాద్‌ సహా తెలంగాణలోని మైనార్టీ ఓట్లను దృష్టిలో పెట్టుకునే సానియా మీర్జాకు ఆ గౌరవం కట్టబెట్టారనీ, రాజకీయ కోణంలోనే కోటి రూపాయల్ని ఆమెకు ప్రోత్సాహకంగా ప్రకటించారని బీజేపీ ఆరోపిస్తోంది.

ఈ వ్యవహారంపై సానియా స్పందించింది. తాను ఎప్పటికీ భారతీయురాలినేననీ, భారతీయతను తననుంచి ఎవరూ వేరు చేయలేరని సానియా మీర్జా చెప్పుకొచ్చింది. తన మీద విమర్శలు చేయడం మాని రాష్ట్ర అభివృద్ధిపైనా, దేశ అభివృద్ధిపైనా దృష్టిపెట్టాలని బీజేపీకి సానియా మీర్జా ఉచిత సలహా ఇచ్చింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?