Advertisement

Advertisement


Home > Articles - Special Articles

నిజం.. నేను మనిషిని

నిజం.. నేను మనిషిని

నీది ఏ కులం.? నీది ఏ మతం.? నీది ఏ రాష్ట్రం.? నీది ఏ దేశం.? ఈ ప్రశ్నలు మనిషిని, మనిషి నుంచి వేరు చేస్తున్నాయి. మనం మనుషులం అన్న విషయాన్ని మర్చిపోయి, మనిషి మానవ మృగమైపోతున్నాడు. 'మీరొచ్చి మమ్మల్ని దోచుకున్నారు..' అన్న మాట రాష్ట్రాల మధ్యనా, దేశాల మధ్యానా చిచ్చుపెడుతున్నాయి. కులాల మధ్య చిచ్చు రేపుతున్నాయి.. మతాల మధ్య మారణహోమాల్ని సృష్టిస్తున్నాయి. మనిషిని మనిషి చంపేస్తోంటే ఇంకా మతమేంటి.? కులమేంటి.? ప్రాంతమేంటి.? దేశమేంటి.? ప్రపంచమేంటి.?

ఓ అమెరికన్‌ ఓ భారతీయుడిపై జాత్యహంకారాన్ని ప్రదర్శించాడు. చంపేశాడు కూడా. ఇంకో అమెరికన్‌, ఆ ఘటన చూసి చలించిపోయాడు. ఆ భారతీయుడ్ని కాపాడేందుకు తన ప్రాణాల్ని అడ్డం పెట్టాడు. ఇందులో నీతి ఏంటి.? మనిషి వేరు, మానవ మృగం వేరు. కాపాడేందుకు ప్రయత్నించింది మానవత్వం. చంపేందుకు ప్రయత్నించింది మానవ మృగం. దారుణమేంటంటే, ఈ ఘటనలో బలైపోయింది మన తెలుగు యువకుడే. 

హైద్రాబాద్‌కి చెందిన శ్రీనివాస్‌ కూచిబోట్ల అమెరికాలో ఈ రోజు జాత్యహంకార దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. చంపేసిన మానవ మృగం పేరు అడమ్‌ వాడే ప్యూరింటన్‌. ఈ ఘటనలో శ్రీనివాస్‌ కూచిబొట్ల ప్రాణాలు కోల్పోగా, అతని స్నేహితుడు అలోక్‌ మేడసాని తీవ్రంగా గాయపడ్డాడు. అడమ్‌ వాడే ప్యూరింటన్‌ కాల్పులు జరుపుతుండగా, శ్రీనివాస్‌ - అలోక్‌లను కాపాడే క్రమంలో ఇయాన్‌ గ్రిలియాట్‌ అనే అమెరికన్‌కీ బుల్లెట్‌ గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇయాన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఆసుపత్రి నుంచే ఇయాన్‌, మొత్తం 'మానవ జాతి'కి ఓ మెసేజ్‌ ఇచ్చాడు. 'మనమంతా ముందు మనుషులం. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఓ మనిషిగానే ఆ ఇద్దరి ప్రాణాలకు నా ప్రాణాల్ని అడ్డం వేశాను. దురదృష్టవశాత్తూ ఒకర్ని కాపాడలేకపోయాను..' అని కన్నీరు మున్నీరయ్యాడు ఇయాన్‌. అసలు ఇయాన్‌కి ఆ అవసరమేంటి.? ఎందుకు అతను ప్రాణాలకు తెగించాడు.? ఎందుకంటే అతను మనిషి గనుక.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?