Advertisement

Advertisement


Home > Articles - Special Articles

నిజమేనా.? యుద్ధం చెయ్యలేమా.?

నిజమేనా.? యుద్ధం చెయ్యలేమా.?

పాకిస్తాన్‌తో యుద్ధం పెద్ద విషయమే కాదు. కానీ, అక్కడ చైనా కాలు దువ్వుతోంది. కాబట్టి, సీరియస్‌గా తీసుకోవాల్సిందే.! కానీ, 'కాగ్‌' భారత సైన్యానికి సంబంధించిన ఆయుధ సంపత్తిపై విస్తుగొలిపే వాస్తవాల్ని బయటపెట్టింది. నిజానికి 'కాగ్‌'ని ప్రభుత్వాలు అంత సీరియస్‌గా తీసుకోవు. కాగ్‌ చెప్పే విషయాలకీ, వాస్తవాలకీ చాలా తేడా వుంటుందన్నది పాలకులు చెప్పే మాట. విపక్షాలు మాత్రం, 'కాగ్‌'ని విపరీతంగా నమ్ముతాయి, సపోర్ట్‌ చేస్తాయి. చిత్రమైన విషయమేంటంటే విపక్షంలో వున్నప్పుడు కాగ్‌ని నమ్మే పార్టీలు, అధికారంలోకి వచ్చాక మాత్రం నమ్మొద్దంటాయి. అధికారంలో వున్నప్పుడు కాగ్‌ని నమ్మొద్దని చెప్పే పార్టీలు, విపక్షంలోకి వచ్చాక మాత్రం 'కాగ్‌' చెప్పేవన్నీ వాస్తవాలేనంటాయి.! 

ఇతరత్రా ప్రాజెక్టుల విషయంలోనో, ఇంకో విషయంలో 'కాగ్‌' చెప్పే మాటల్ని నమ్మడం, నమ్మకపోవడం అన్నది వేరే చర్చ. కానీ, దేశ భద్రతకు సంబంధించిన విషయమిది. ఆయుధ సంపత్తిపై 'కాగ్‌' చెప్పే విషయాల్ని ఖచ్చితంగా, చాలా సీరియస్‌గా తీసుకుని తీరాల్సిందే. కేవలం 10 రోజులు మాత్రమే శతృవుతో పోరాడేందుకు మనదగ్గర ఆయుధ సంపత్తి వుందన్నది 'కాగ్‌' వాదన. ఈ మాట వింటేనే, సగటు భారతీయుడి వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది. 

అఫ్‌కోర్స్‌, చేతిలో ఆయుధం వున్నా లేకున్నా ప్రాణం పోయేదాకా దేశం కోసం పోరాడాలనే సైనికుల మనోనిబ్బరం ముందు, ఎంతటి పెద్ద శతృవైనా బలాదూర్‌.. అని ఎన్నో సంఘటనలు నిరూపించాయనుకోండి.. అది వేరే విషయం. అయినాసరే, యుద్ధం అన్నాక ఆయుధం తప్పనిసరి. ఆగస్ట్‌ నాటికి పూర్తిస్థాయిలో ఆయుధ సంపత్తి మనకి సమకూరుతుందనీ, అప్పుడు 40 రోజులు ఏకధాటిగా యుద్ధం జరిగినా ఇబ్బంది వుండదని సైన్యం తీపి కబురు అందించడంతో కాస్తంత భయం తగ్గింది అందరికీ.! 

ఈ రోజుల్లో యుద్ధమంటే ఆషామాషీ విషయం కాదు. ఓ మోస్తరుగా వుండే రెండు దేశాల యుద్ధమంటే, అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అందునా, భారత్‌ - పాకిస్తాన్‌ - చైనా తలపడే యుద్ధమంటే, అది ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. అయినా, తుపాకీలతో యుద్ధాలు చేసుకునే రోజులు కావిప్పుడు. మిసైల్‌ లాంచ్‌ చేశామా.? లేదా.? అన్నదే, ఆ తర్వాత జరిగే నష్టాన్ని చూడ్డానికి కూడా భూమ్మీద ఎవరూ మిగలరు. ఈ వాస్తవాన్ని ఏ దేశమూ మర్చిపోదు. అందుకే, ఒకప్పటిలా ఇప్పుడు యుద్ధాలు అంత విరివిగా జరిగే పరిస్థితి లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?