Advertisement

Advertisement


Home > Articles - Special Articles

జియో కస్టమర్లకు మరో తీపి కబురు

జియో కస్టమర్లకు మరో తీపి కబురు

జియోలో రీచార్జ్ ఆఫర్లు ఎంత బాగున్నా, అన్-లిమిటెడ్ కాల్స్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ కుర్రాళ్లకు మాత్రం ఎక్కడో ఏదో వెలితి ఉండనే ఉంది. ఆ లోటును ఇన్నాళ్లకు భర్తీ చేసింది జియో. ఇకపై తమ డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లో కూడా జియో సినిమా, జియో టీవీ ప్రసారాన్ని ఉచితంగా చూసే సౌకర్యం కల్పించింది. 

ఇన్నాళ్లు జియో టీవీ సేవలు కేవలం మొబైల్ కు మాత్రమే పరిమితం. దీనివల్లే ఏ టీవీ ప్రొగ్రామ్ చూడాల్సి వచ్చినా అది మొబైల్ లోనే. కానీ ఇప్పుడు మొబైల్ లో 4జీ ఇంటర్నెట్ ఆన్ చేసి, డెస్క్ టాప్ లో లాగిన్ అయి ఏ టీవీ ఛానెల్ అయినా ఫ్రీగా చూడొచ్చు. ఈ మేరకు టెక్నికల్ సర్దుబాట్లు చేసినట్టు జియో ప్రకటించింది.

తమ వెబ్ సైట్ లో జియో ఐడీ, పాస్ వర్డ్ ను పొంది ఉచితంగా సినిమాలు, టీవీ కార్యక్రమాలు చూడొచ్చని ప్రకటించింది జియో. ఎస్ డీ, హెచ్ డీ ఆప్షన్లను ఎంచుకునే సౌకర్యంతో పాటు 550 టీవీ ఛానెళ్లను ఒకేసారి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఈ సెగ్మెంట్ లో మొన్నటివరకు టాప్ లో ఉన్న ఎయిర్ టెల్ టీవీని జియో అధిగమించింది. ఇక వోడాఫోన్ ప్లే, ఐడియా మూవీస్ సంగతి సరేసరి. అవి ఎప్పుడో గల్లంతయ్యే దశకు చేరుకున్నాయి.

జియో అందించిన 1500రూపాయల 4జీ ఫోన్ లో సినిమాలు, మూవీ ఛానెల్స్ చూడడం చాలా కష్టం. ఇప్పుడు అలాంటి వినియోగదారులకు కూడా యాప్స్ ను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు ఈ సౌకర్యం తీసుకొచ్చింది జియో.

మొన్నటివరకు కాల్స్, డేటా విషయంలోనే ఇతర కంపెనీలకు పోటీనిచ్చిన ఈ సంస్థ.. ఇప్పుడు యాప్స్, వినోద రంగంలోకి కూడా ప్రవేశించింది. వివిధ భాషల్లో సినిమాల డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసేందుకు, ఆడియో రైట్స్ దక్కించుకునేందుకు 500కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ బడ్జెట్ ను రెట్టింపు చేయబోతోంది జియో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?