Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ప్చ్‌.. సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవలేదా.?

ప్చ్‌.. సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవలేదా.?

ధన త్రయోదశి.. అక్షయ తృతీయ.. ఇవి ‘బంగారు పండుగలు’. ఉత్తరాది నుంచి దక్షిణాదికి పాకిన ఈ బంగారం మోజు, జ్యుయెలరీ బిజినెస్‌ని ఓ రేంజ్‌కి తీసుకెళ్తోంది. సాధారణ పండుగలు, పెళ్ళిళ్ళ సీజన్‌ని మించి ఈ రెండు ‘బంగారు పండుగల’పైనా మహిళా లోకం మోజు పెంచుకుంటోంది. ఆ రోజు బంగారం కొంటే మంచిదట.. అన్న ఒక్క సెంటిమెంట్‌, మహిళా లోకం జ్యుయెలరీ దుకాణాల వైపు ఆ రెండు రోజుల్లో ఖచ్చితంగా పరుగులు పెట్టేలా చేస్తోంది.

గత కొంతకాలంగా ధన త్రయోదశి, అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు గోల్డ్‌ మర్చంట్స్‌లో చెప్పలేని ఆనందం. ఆ ఆనందంలోనే, వినియోగదారుల్ని మోసం చేయాలన్న ‘కుటిల నీతి’ కూడా తెరపైకొస్తోంది. తూకాల్లో మోసంతో వినియోగదారుల్ని చాలా జ్యుయెలరీ దుకాణాలు నిలువునా ముంచేస్తున్నాయి. తద్వారా పెరిగిన చైతన్యం కారణంగానో, లేదంటే బంగారం ధరల పతనం కారణంగానో.. ఈసారి అక్షయ తృతీయకి ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగలేదట.

కాస్త ఎక్కువగానే జ్యుయెలరీ షాప్‌లు కిటకిటలాడినా, ఆశించిన స్థాయిలో కస్టమర్లు బంగారాన్ని కొనుగోలు చేయలేదని వ్యాపారులే చెబుతున్నారు. వచ్చినవారంతా మొక్కుబడి కొనుగోళ్ళు జరపడంతో తామంతా తీవ్రంగా నిరాశ చెందాల్సి వచ్చిందని వ్యాపారులు వాపోతున్నారు. బంగారం ధర పెరుగుతుందన్న నమ్మకం వినియోగదారుల్లో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నది వారి వాదన

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?