Advertisement

Advertisement


Home > Articles - Special Articles

పెట్రో ఊరట.. ఏటీఎమ్‌ బాదుడు

పెట్రో ఊరట.. ఏటీఎమ్‌ బాదుడు

నవంబర్‌ 1 నుంచి పెట్రో ధరలు కాస్త తగ్గనున్నాయి. కాస్సేపటి క్రితమే పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్‌పై లీటర్‌కి 2.41 పైసలు, డీజిల్‌పై 2.25 పైసలు తగ్గించాయి కంపెనీలు. తగ్గిన ధరలు రేపటినుంచి అమల్లోకి రానుండడం గమనార్హం.

పెట్రో ఊరట ఇలా వుంటే, ఇకపై ఏటీఎంలు అడ్డంగా బాదేస్తాయి. నెలకి ఐదు సార్లు మాత్రమే ఏటీఎంని ఉచితంగా వినియోగించుకోవాల్సి వుంటుంది ఇకపై. ఐదు సార్లకు మించి ఉపయోగిస్తే, ఒక్కో ట్రాన్సాక్షన్‌కీ 20 రూపాయలు కోత పడ్తుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలు ఉపయోగించేవారికి మూడు సార్లకు మాత్రమే పరిమితం చేస్తూ ఇదివరకే బ్యాంకులు తీసుకున్న నిర్ణయం రేపటినుంచి అమల్లోకి రానుంది.

ఇదిలా వుంటే, పెట్రోల్‌ ` డీజిల్‌ ధరల్ని తగ్గినా, వంట గ్యాస్‌ ధర మాత్రం పెరిగింది. కొద్ది రోజుల క్రితమే వంట గ్యాస్‌పై సుమారు 4 రూపాయలదాకా ధర పెరిగింది. ఊరట చూసి సంతోషించాలా.? ఇంకోవైపు నుంచి తప్పని బాదుడిని చూసి ఆవేదన చెందాలా.? ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టుకోడానికి.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?