Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఆ పైలెట్ కథతో హాలీవుడ్ లో సినిమా గ్యారెంటీ!

ఆ పైలెట్ కథతో హాలీవుడ్ లో సినిమా గ్యారెంటీ!

ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో జర్మన్ వింగ్స్ విమానాన్ని కూల్చేసి 150 మంది మరణానికి కారణం అయిన టూ బిట్జ్  జీవిత కథ కచ్చితంగా తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంత వరకూ చరిత్రలో కనీ వినీ ఎరగని రీతిలో ఒక పైలెట్ విమానాన్ని కూల్చేయడం జరిగింది. దీంట్లో భారీ స్థాయిలో జన నష్టం జరిగింది. అతడే విమానాన్ని కూల్చేశాడనడానికి అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు లూ బిట్జ్ వ్యవహారం గురించి అంతర్జాతీయ మీడియా పెద్ద పరిశోధనే చేస్తోంది. అతడి మానసిక స్థితి సరిగా లేదని కూడా దాదాపు నిర్ధారణ అయ్యింది. తాజాగా ఈ కో పైలెట్ గర్ల్ ఫ్రెండ్ చెబుతున్న విషయాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి.

అతడు తరచూ ఉలిక్కిపడి నిద్రలేచేవాడని.. మనం పడిపోతున్నాం.. పడిపోతున్నాం.. అంటూ కలవరించుకొనే వాడని.. అతడి గర్ల్ ఫ్రెండ్ మారియా చెబుతోంది. తను ఏదో ఒక రోజు సంచలనం సృష్టిస్తానని.. అప్పుడు తన పేరు మార్మోగుతుందని కూడా అతడు చెప్పేవాడని ఆమె ఇప్పుడు చెబుతోంది. ఇక విమానం కూలిపోయేటప్పుడు కూడా లూ బిట్జ్ కామెంటరీ చెప్పాడని అధికారులు ప్రకటించారు.

'మనం పడిపోతున్నాం.. పడిపోతున్నాం..' అన్న అతడి మాటలు రికార్డయ్యాయి. దీన్ని బట్టి అతడు నిద్రలో ప్రవర్తించే తీరుకు..విమానాన్ని కూల్చేసినప్పుడు వ్యవహరించిన తీరుకూ చాలా సంబంధాలే కనిపిస్తన్నాయి. అతడు మానసిక రోగి అని స్పష్టం అవుతోంది.

మరి ఈ పైలెట్ వ్యవహారంపై కచ్చితంగా హాలీవుడ్ నుంచి సినిమా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అతడి మానిసిక జబ్బును హైలెట్ చేస్తూ ఏ హాలీవుడ్ దర్శకుడో సినిమా తీసే అవకాశాలున్నాయి. ఒక హాలీవుడ్ సినిమాకు ముడిసరుకు కాగల అంశాలున్నాయి లూ బిట్జ్ జీవితంలో. 

ఇది వరకూ ఇలాంటి రియాలిస్టిక్ సంఘటనల ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు 'జర్మన్ వింగ్స్' పేరుతో ఎవరైనా సినిమా తీసే అవకాశాలున్నాయి. ఇలాంటి సంఘటనల్లో ఎంత విషాధాన్ని పక్కనపెట్టి.. ఆ సంఘటనకు కారణమైన వారి మానసిక సంఘర్షణలమీదే దర్శకులు కాన్సన్ ట్రేట్ చేస్తూ ఉంటారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?