Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ప్రజాస్వామ్యంలో ఏంటీ ఖర్మ.?

ప్రజాస్వామ్యంలో ఏంటీ ఖర్మ.?

ప్రజాస్వామ్యం మనకి చాలా హక్కుల్ని ఇచ్చింది. ఆ హక్కుల సంగతి తర్వాత. అసలంటూ చట్టాలు చేసేవాళ్ళ పరిస్థితే అత్యంత దారుణంగా తయారైంది. 'సంతలో పశువులు' అన్నది చాలా చిన్న మాటేమో.! ఎందుకంటే, అలా ప్రజా ప్రతినిథుల్ని కొనేస్తున్నాయి అధికారంలో వున్న పార్టీలు. 'అబ్బే, మేమెవర్నీ కొనుగోలు చేయట్లేదు.. మేం చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులవుతున్నారంతే..' అని అధికారంలో వున్న పార్టీలు చెప్పొచ్చుగాక. జరుగుతున్నదేంటో చిన్న పిల్లాడినడిగినా చెప్పేస్తాడు. 

తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల గురించి కొత్తగా చెప్పేదేముంది.? పదవి కోసం ఏ గడ్డి తినడానికైనా ప్రజా ప్రతినిథులు వెనకాడ్డంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా, 'డోన్ట్‌ కేర్‌..' అంటున్నారు. తమ పని తాము చేసుకుపోతున్నారు. రాజకీయాల్లో పదవే పరమావధి.! ప్రజాసేవ అనేది ఓ బూతుగా మారిపోయిందిప్పుడు రాజకీయాల్లో. నైతిక విలవల గురించి మాట్లాడితే, పిచ్చోడనుకుంటున్నారంతా.! 

మొన్నీమధ్యన తమిళనాడులో ఏం జరిగిందో చూశాం. ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ, ఎమ్మెల్యేలని తీసుకెళ్ళి దాచేశారు. అఫ్‌కోర్స్‌, అన్ని కష్టాలు పడ్డా ఆమెకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. శశికళ దాచిన ఎమ్మెల్యేలు, ఇంకొకరికి ఉపయోగపడ్డారనుకోండి.. అది వేరే విషయం. రాజకీయమంటేనే అంత. 'గడ్డి' కోసం నైతిక విలువల్ని పక్కన పడేసి ప్రజా ప్రతినిథులు, 'ఖైదీలుగా' మారిపోవడానికీ వెనుకాడ్డంలేదు. 

ఇప్పుడు తాజాగా, గుజరాత్‌ వంతు వచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌. ఇక్కడ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఆల్రెడీ ఆరుగురు ఎమ్మెల్యేలు గోడ దూకేశారు. మిగతా ఎమ్మెల్యేలని కాంగ్రెస్‌ పార్టీ బెంగళూరుకి తరలించింది. లారీల్లో పశువుల్ని తరలించినట్లు కాదు లెండి.. ఖరీదైన బస్సుల్లోనే.! ఓ పార్టీ తన ఎమ్మెల్యేలను దాచుకోవాల్సిన దుస్థితి రావడమంటే, ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది.? 

పార్టీ ఫిరాయింపుల చట్టం ఎక్కడుంది.? అనడక్కండి. అదంతే. చట్టాలుంటాయి.. కానీ, అవి పనిచేయవు. ఎందుకు పనిచేస్తాయి, చట్టాలు చేసెటోళ్ళకే దిక్కులేనప్పుడు.! ఆ చట్టాలు చేసేటోళ్ళే 'సంతల్లో పశువుల్లా' మారిపోతున్నప్పుడు.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?