Advertisement

Advertisement


Home > Articles - Special Articles

రామసేతు: శ్రీరామ్‌ ఇంజనీరింగ్‌.!

రామసేతు: శ్రీరామ్‌ ఇంజనీరింగ్‌.!

రామసేతు.. శ్రీలంకతో భారత్‌ని కలిపిందీ వంతెన ఒకప్పుడు. కానీ, ఇదిప్పుడు సముద్రగర్భంలో కలిసిపోయింది. పూర్తిగా కాదు, ఇంకా ఆనాటి ఆ నిర్మాణం తాలూకు ఆనవాళ్ళు అలాగే వున్నాయి. పురాణాల్లోకి వెళితే, అది రామాయణం నాటి కాలం. రామాయణంలో రావణుడు, సీతను లంకకు ఎత్తుకెళ్ళిపోతే రాముడు, సీత కోసం లంకా నగరానికి చేరుకునేందుకు వానరసైన్యంతో కలిసి రామసేతుని నిర్మిస్తాడు. 

రాముడి స్పర్శతో, సముద్రుడి హామీతో వానరసైన్యం విసిరే బండ రాళ్ళు సముద్రంలో తేలతాయి. అలా రామసేతు వంతెన నిర్మాణం పూర్తవుతుంది. వానరసైన్యం, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరుతుంది. ఆ తర్వాత రామ - రావణ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో రాముడు, రావణుడ్ని వధించి, తన భార్య సీతాదేవిని తీసుకొస్తాడు. ఇదీ రామాయణంలో ముఖ్యమైన భాగం. రామసేతు లేని రామాయణాన్ని ఊహించుకోగలమా.? 

ఇంతకీ, రాముడు ఏ ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుకున్నాడబ్బా.? ఇదీ ఓ రాజకీయ ప్రముఖుడు వేసిన ప్రశ్న. సముద్ర గర్భంలో ఆనాటి చరిత్రకి గుర్తుగా వున్న రామసేతుని ధ్వంసం చేసి, నౌకా రవాణాకి మార్గం సుగమం చేయాలనే ప్రయత్నాలు జరిగినప్పుడు రామసేతుపై చాలా వాదనలు తెరపైకొచ్చాయి. అందులో చాలా వెటకారాలు కూడా వున్నాయి. అదసలు మానవ నిర్మితమే కాదన్నారు కొందరు. దానివల్ల ఇప్పుడెవరికీ ప్రయోజనం లేదన్నారు ఇంకొందరు. 

ఇంతలోనే, మనకి పరిచయం లేని 'సునామీ' మన దేశమ్మీదకి దండెత్తింది. అప్పట్లో ఆ సునామీ తీవ్రతను తగ్గించడంలో రామసేతు పోషించిన పాత్ర గురించి ఇప్పటికీ చెప్పుకుంటూనే వున్నాం. అయినాసరే, ఆ రామసేతుని కూల్చేయాలనే కుట్రలు, ఆనాటి చరిత్ర తాలూకు గుర్తుల్ని చెరిపేయాలనే ఆలోచనలు జరుగుతూనే వున్నాయి. 

ఎలాగైతేనేం, ఓ సైన్స్‌ ఛానల్‌ రామసేతుకి సంబంధించి ఆసక్తికరమైన వాస్తవాల్ని వెలుగులోకి తెచ్చింది. అదీ విదేశీ ఛానల్‌ కావడం గమనార్హం. రామసేతు మానవ నిర్మితమేనని తేల్చింది. వేల ఏళ్ళ నాటి నిర్మాణం అదని స్పష్టం చేసింది. రాళ్ళు నీళ్ళలో తేలడానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పింది. వేల ఏళ్ళ క్రితమే భారతదేశంలో ఇంజనీరింగ్‌ అద్బుతాలు జరిగాయి. అది ప్రపంచానికి ఎప్పుడో తెలిసిన వాస్తవం.

కానీ, మనమే గుర్తించలేకపోతున్నాం. కళ్ళముందు ఎన్నో నిర్మాణాలు ఆనాటి ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి నిదర్శనాలుగా వున్నాసరే, 'ఏ ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుకున్నారు.?' అన్న పనికిమాలిన ప్రశ్నలు పుట్టుకొస్తూనే వున్నాయి. జ్ఞానమెక్కువైపోయి, అజ్ఞానంలో మనం కూరుకుపోతోంటే.. మన చరిత్ర గొప్పతనాన్ని మనకి, ఇంకెవరో గుర్తు చేయాల్సి వస్తోంది. ఇంతకన్నా దురదృష్టకరం ఇంకేముంటుంది.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?