Advertisement

Advertisement


Home > Articles - Special Articles

సోషల్‌ మీడియాతో సంకటం

ఓ జంట బైక్‌ మీద వెళుతోంటే, దారిలో చిన్నపాటి యాక్సిడెంట్‌ జరిగింది. బైక్‌ - కారు యాక్సిడెంట్‌కి గురవగా, ఆ యాక్సిడెంట్‌లో వాహనాలు కాస్త దెబ్బతినడం మినహా, ఎవరికీ గాయాలు కాలేదు. కారు నడుపుతున్న వ్యక్తి బైక్‌ మీద వెళుతున్నవారినిగానీ, బైక్‌ నడుపుతున్న వ్యక్తి కారులోనివారినిగానీ దూషించలేదు. కానీ ఘటన జరిగిన స్థలంలోనే వున్న ఓ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌, బైక్‌ మీద వెళుతున్న భార్యాభర్తలపై గుస్సా అయ్యాడు. బండ బూతులు తిట్టాడు. ఓ దశలో చెయ్యిచేసుకోవాలనుకున్నాడట కూడా.

అంతే, చిర్రెత్తుకొచ్చింది ఆ జంటకి. తమ ఆవేదనను తమ మొబైల్‌లోని కెమెరాతో షూట్‌ చేసి, సోషల్‌ మీడియాలో పెట్టేశారు. మీడియాలోనూ ఈ వార్త హైలైట్‌ అయ్యింది. ఇంకేముంది, పరువు పోయిందనుకున్న పోలీసు శాఖ, వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. అంతకు ముందే బాధిత భార్యాభర్తలు పోలీసులను ఆశ్రయించి, తమకు జరిగిన అవమానంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా.

గతంలోనూ ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. ట్రాఫిక్‌ పోలీసులు చలాన్ల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్న వైనాన్ని కొందరు ఔత్సాహికులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. అక్రమాలపై ఇంటర్నెట్‌లో పోరాటం జరుగుతున్నట్టే, పోలీసుల్లో హీరోయిజం ప్రదర్శించినవారినీ హైలైట్‌ చేస్తుండడం గమనార్హం. పోలీసు శాఖ ప్రజలకు చేరువయ్యేందుకు యాప్స్‌ని అందుబాటులోకి తీసుకొస్తుంటే, పోలీసులకి సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలు, వెలుగు చూస్తున్న వాస్తవాలూ కొత్త సవాల్‌ విసురుతున్నాయి.

ఇది సంకటం అని పోలీసులు భావించడానికి వీల్లేదు. పోలీసు శాఖలో పేరుకుపోయిన అవినీతి.. పోలీసు ఉద్యోగం పేరు చెప్పి సామాన్యులపై జులుం చెలాయిస్తున్న కొందరి తీరు.. ప్రజలు పడ్తున్న బాధలు.. వీటన్నిటికీ సోషల్‌ మీడియా వేదికవుతోంది గనుక, పోలీసు శాఖ తనను తాను సంస్కరించుకోడానికి, తప్పులు సరిదిద్దుకోడానికీ అవకాశం దొరుకుతోందనీ అనుకోవాల్సి వుంటుంది. అలాగే, నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌ వ్యవహారంలో పోలీసులను కీర్తిస్తూ నెటిజన్స్‌ సోషల్‌ మీడియాలో చేసిన ప్రచారం పోలీసు శాఖ ఔన్నత్యాన్ని చాటి చెప్పిందన్న విషయాన్నీ విస్మరించలేం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?