Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఓటుకు నోటు: కేసీఆర్‌, చంద్రబాబు 'లాక్డ్'.!

ఓటుకు నోటు: కేసీఆర్‌, చంద్రబాబు 'లాక్డ్'.!

ఓటుకు నోటు వ్యవహారాన్ని ప్రపంచమంతా చూసింది. ఈ కేసులో అడ్డంగా దొరికింది రేవంత్‌రెడ్డి అయితే, తప్పించుకు తిరుగుతున్నది ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు. కొండంత రాగం తీసి, తుస్సుమనిపించింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. మొత్తంగా ఈ ఆటని పర్యవేక్షిస్తున్నది ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలూ అవసరం లేదు. 

ఏదో, పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని సమర్థవంతంగా నడిపే క్రమంలో, కేసీఆర్‌ ఎత్తుగడలకు షడెన్‌గా చంద్రబాబు కారణంగా బ్రేక్‌ పడే పరిస్థితులొచ్చాయి.. దాంతో, ఓటుకు నోటు కేసుని తెరపైకి తెచ్చారు కేసీఆర్‌. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వ్యూహం ఫలించి, ఒకే ఒక్క సీటు అయినా గెల్చుకుని వుంటే.. తెలంగాణ రాజకీయాలు బీభత్సంగా మారిపోయేవని అనుకోలేంగానీ, కాస్తో కూస్తో టీడీపీకి ఊపిరి వచ్చేది. ఆ ఊపిరి అందకుండా చెయ్యడంలోనే ఓటుకు నోటు కేసు పుట్టుకొచ్చిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. 

'నువ్వెలా బతికి బట్టకడతావో చూస్తా..' అన్నట్లు కేసీఆర్‌, 'నువ్వు నన్నేమీ చెయ్యలేవురా..' అన్నట్లు చంద్రబాబు అప్పట్లో సవాల్‌ - ప్రతిసవాల్‌ విసురుకున్నారు ఒకరికొకరు. ఇక్కడ కేసీఆర్‌ ఫ్లాపయ్యారు.. చంద్రబాబు కొంచెం తేరుకున్నట్టు కనిపించారు. ఇదంతా ఫోన్‌ ట్యాపింగ్‌ పుణ్యమే. కేంద్రాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఆడిన డ్రామా ఫోన్‌ ట్యాపింగ్‌. ఇప్పుడు కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ, ఓటుకు నోటు కేసులో కదలిక తెచ్చింది. 

ఇక్కడే సూపర్‌ ట్విస్ట్‌. కేసుని పరుగులు పెట్టించలేక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చతికిలపడ్డారు. కానీ, అతన్నిప్పుడు పరుగులు పెట్టిస్తోంది వైఎస్సార్సీపీ. అదే సమయంలో, హాయిగా ఊపిరి పీల్చుకున్న 'బ్రీఫింగ్‌' చంద్రబాబుకి, 'బ్రీతింగ్‌' కరవయ్యిందిప్పుడు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే చంద్రబాబు, కేసీఆర్‌.. ఇద్దరూ కేంద్రం వద్ద సాగిలా పడాల్సిందే.. తప్పదు. 

ఓటుకు నోటు కేసు నిజం - చంద్రబాబు బ్రీఫింగ్‌ నిజం - ఫోన్‌ ట్యాపింగ్‌ నిజం.. ఇన్ని నిజాల మధ్య, వైఎస్సార్సీపీకి ఒకేసారి కేసీఆర్‌ జుట్టు, చంద్రబాబు జుట్టూ దొరికేశాయి. ప్రధాని నరేంద్రమోడీ, వైఎస్‌ జగన్‌ జుట్టు పట్టుకుంటే తప్ప, చంద్రబాబుగానీ, కేసీఆర్‌గానీ బయటపడే పరిస్థితుల్లేవు. తనదాకా వస్తే, చంద్రబాబు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో కేసీఆర్‌కి చెమటలు పట్టించకుండా వుండరు. ఈలోగా కేసీఆర్‌, పరువు కోసం చంద్రబాబుని మూసేయడానికీ వెనుకాడకపోవచ్చు. మొత్తమ్మీద, భలే లాక్‌ పడిందిప్పుడు ఇద్దరు చంద్రులకీ. ఎనీ డౌట్స్‌.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?