Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ప్రపంచంలోనే అతిచిన్న ఫోన్

ప్రపంచంలోనే అతిచిన్న ఫోన్

ఇదంతా స్మార్ట్ ఫోన్ కాలం. అందరికీ బిగ్ స్క్రీన్ కావాలి. ఎక్కువ ఫీచర్లు ఉండాలి. కానీ అందరూ ఇలానే ఆలోచించరు. కొందరు రివర్స్ లో కూడా వెళ్తుంటారు. అలా పుట్టుకొచ్చిందే ఈ అతి చిన్న సెల్ ఫోన్.

బ్రిటన్ కు చెందిన జెన్ కో సంస్థ ఈ చిన్న ఫోన్ ను తయారుచేసింది. దీనికి టినీ టి-1అనే పేరుపెట్టింది. పేరుకు తగ్గట్టు ఇది చాలా చిన్నది. మీ బొటనవేలు కంటే కాస్త పెద్దగా ఉంటుందంతే. 46మిల్లీమీటర్ల పొడవు, 21మిల్లీమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. దీని బరువు కేవలం 13గ్రాములు. 

ఈ ఫోన్ తో 180నిమిషాల పాటు ఏకథాటిగా మాట్లాడుకోవచ్చు. 300సెల్ నంబర్లు, 50మెసేజీలు స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ ఫోన్ ద్వారా మీరు మెసేజ్ కూడా టైప్ చేసి మరొకరికి పంపించొచ్చు. కాకపోతే మీకు కాస్త ఓపిక ఉండాలి. 

ఇది కేవలం 2జీ నెట్ వర్క్ పై పనిచేస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపా దేశాల్లో 2018మే నెల నుంచి అందుబాటులోకి రానుంది. దీని ధర అటు ఇటుగా 47 డాలర్లు ఉండొచ్చు. స్మార్ట్ ఫోన్ అవసరాల్ని ఇది తీర్చలేదు. కేవలం రికార్డు సృష్టించాలనే ఉద్దేశంతోనే దీన్ని తయారుచేశారు. కావాలంటే కొనుక్కొని ఇంట్లో అలంకరించుకోవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?