Advertisement

Advertisement


Home > Articles - Special Articles

వైసీపీ కి మూడు లక్షల లైకులు

వైసీపీ కి మూడు లక్షల లైకులు

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలోనే, పార్టీ అఫిషియల్‌ఫేస్‌బుక్ పేజీ కూడా 3లక్షల లైక్స్‌ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఫేస్‌బుక్, వైఎస్‌ఆర్‌సీపీ ఆన్‌లైన్ కమ్యూనిటీ పోర్టల్‌లకు సంబంధించిన బృందాలు పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నాయి. సోషల్‌మీడియాలో మంచి కృషి సాగిస్తున్నారంటూ వారిని విజయమ్మ అభినందించారు.పార్టీ అఫిషియల్ ఫేస్‌బుక్ పేజీ ప్రారంభించిన 10 నెలల్లోనే 3 లక్షల లైక్స్ దాటడం నెటిజన్స్‌లోనూ జగన్‌పైన ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమన్నారు. రాజశేఖరరెడ్డిగారి పథకాల గురించి మరింత విస్తృతంగా ప్రజలకు వివరించాలని విజయమ్మ సూచించారు. వైఎస్‌ఆర్ మరణానంతరం సంక్షేమ పథకాలు సరిగా అమలు కాకపోవడాన్ని నెటిజన్లకు అర్ధమయ్యేలా ప్రచారం చేయాలన్నారు. ప్రత్యర్థులను ఎండగట్టడం కంటే వైఎస్‌ఆర్ చేసిన మంచి పనులు, జగన్ చేయాలనుకుంటున్న మంచి పనులపై మరింత ఎక్కువ కేంద్రీకరించాలని కోరారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇంకా ఇతర సోషల్ మాధ్యమాలలో యాక్టివ్‌గా ఉన్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరుల కోసం వైఎస్‌ఆర్ అభిమానులు ప్రారంభించిన ఆన్‌లైన్ కమ్యూనిటీ పోర్టల్ (ఓసీపీ)కి (http://community.ysrcongress.com) కూడా మంచి ఆదరణ కనిపిస్తున్నది. రాజకీయ పార్టీల ఆన్‌లైన్ కార్యకలాపాలకు ఇతోధికంగా సహకరించే ఇలాంటి వినూత్న ఆలోచన మరే ఇతర పార్టీలోనూ కనిపించదు. సోషల్‌మీడియాలో ఉపయోగించుకోదగిన విస్తృత సమాచారం ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలు, విజన్, వైఎస్ జగన్మోహనరెడ్డి కార్యక్రమాలు, దీక్షలు, ఉద్యమాలు, ఆలోచనలు, ప్రణాళికలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇందులో ఉంది. ఇవే కాక చంద్రబాబు నాయుడు కుంభకోణాలు, మనసులో మాట పుస్తకంలో ఆయన రాసుకున్న ముఖ్యమైన అంశాలు(సంక్షేమ వ్యతిరేక ఆలోచనలు సహా), ఒక వర్గం మీడియా సాగిస్తున్న విష ప్రచారంలోని లోగుట్టుమట్లు, ఇంకా అనేక పుస్తకాలు, ఫేస్‌బుక్ పోస్ట్‌లు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి.

వైఎస్‌ఆర్‌ను గుండెల్లో పెట్టుకున్న, జగన్‌ను అభిమానిస్తున్న నెటిజన్ల విశేషాదరణతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అప్రతిహతంగా పురోగమిస్తున్న సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్ లైక్స్ విషయంలో దేశంలోనే ప్రాంతీయపార్టీలన్నిటిలోనూ వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అగ్రగామిగా ఉంది. పార్టీ  3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజునే అంటే మార్చి 12నే పార్టీ అఫిషియల్ ఫేస్‌బుక్ పేజీ (www.facebook.com/ysrcpofficial) కూడా 3 లక్షల లైక్స్‌ను పూర్తి చేసుకుంది. గురువారం ఉదయానికి ఈ సంఖ్య 3,08,000  వద్ద ఉంది. నెటిజన్లు విశేషంగా ఆదరిస్తుండడంతో ఇది క్రమక్రమంగా పెరుగుతోంది.
 
ఆన్‌లైన్‌కమ్యూనిటీ పోర్టల్ 

ఇందులోని తక్కువ నిడివి గలిగిన నాలెడ్జ్ ఆర్టికల్స్ నెటిజన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. రిజిస్టర్ చేసుకునే సభ్యులు ఇందులో సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు. దాదాపు ఐదువేలకు పైగా రిజిస్టర్డ్ సభ్యులు ఈ పోర్టల్‌లోని సమాచారాన్ని తమతమ ఎఫ్‌బీ పేజీలలో షేర్ చేసుకుంటున్నారు. అక్కడి నుంచి వారి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ - ఫ్రెండ్స్‌కు... ఇలా లక్షల మందికి ఈ సమాచారం షేర్ అవుతున్నది. అనేక గ్రూప్స్‌లో ఈ సమాచారం కనిపిస్తుండడాన్ని బట్టి చూస్తే ఫేస్‌బుక్ విస్తృతి అర్థమౌతుంది. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనపై సీపీఎం ప్రచురించిన పుస్తకాలు, బీజేపీ ప్రచురించిన పుస్తకం కూడా ఈ పోర్టల్‌లో ఉన్నాయి. ఇక వీడియోలు, కార్టూన్లు వీటికి అదనం.... ఇదే విభాగం రూపొందించిన యూట్యూబ్ చానెల్ (www.youtube.com/ysrcpcommunity)లో వందల సంఖ్యలో వీడియోలు అందుబాటులో ఉన్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?