Advertisement

Advertisement


Home > Articles - Special Articles

యువీ.. యూ కెన్‌.!

యువీ.. యూ కెన్‌.!

యువరాజ్‌సింగ్‌.. క్రికెట్‌ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరిది. ఇండియన్‌ క్రికెట్‌లో యువీ ఓ సంచలనం. ట్వంటీ ట్వంటీ క్రికెట్‌లో ఆరు బంతులకి ఆరు సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లో అయినా ఈ ఫీట్‌ సాధించిన ఘనత యువీ తర్వాతే ఎవరికైనా చెందుతుంది. అది వ్యక్తిగత రికార్డ్‌. ఇక, జట్టుకి వన్డే వరల్డ్‌ కప్‌ అందించడం.. అనే ఘనతను సొంతం చేసుకున్న యువీ, ప్రస్తుతం క్రికెట్‌కి దూరమయ్యే స్థితిలో వున్నాడు.

మొన్నటి వరల్డ్‌ కప్‌ హీరోగా తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న యువీ, ఆ టోర్నమెంట్‌ తర్వాత క్యాన్సర్‌ బారిన పడ్డంతో ఒక్కసారిగా అతని అభిమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. క్యాన్సర్‌ నుంచి ఎలాగైతేనేం యువీ జయించాడు.. తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టాడు కూడా. కానీ, మునుపటి వేడి, వాడి యువీ ఆటతీరులో కన్పించలేదనే చెప్పాలి.

మరి, త్వరలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ (2015)లో యువీ ఆడతాడా.? అంటే, ఈ ప్రశ్నకు ‘ఆడలేనేమో..’ అంటూ ఆవేదనతో సమాధానమిచ్చాడు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. ‘ఏమో.. కాలం కలిసొస్తే.. ఆడేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను.. ఆడతానేమో..’ అని కూడా అదే ఇంటర్వ్యూలో యువీ వ్యాఖ్యానించాడు.

ప్రాణాంతక క్యాన్సర్‌ని జయించిన యువీకి, వన్డే టీమ్‌లోకి రావడం కష్టమా.? అంటే ఫిట్‌నెస్‌ని సాధిస్తే టీమిండియాలో మళ్ళీ యువీ కన్పించడం కష్టమేమీ కాకపోవచ్చు. సంకల్పం ముందు ఏదీ అసాధ్యం కాదు. యువీకి ఆ సంకల్పం వుంది. యువీ యూ కెన్‌.. అంటూ అప్పుడే యువీ అభిమానులు ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌ వేదికగా ఆయనలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?