Advertisement

Advertisement


Home > Movies - Interviews

బెంగాల్ టైగర్ కమర్షియల్ హిట్ గ్యారంటీ

బెంగాల్ టైగర్ కమర్షియల్ హిట్ గ్యారంటీ

సంపత్ నంది..ఏమైందీ వేళ అంటూ మెల్లగా ఇండస్ట్రీలోకి వచ్చి, ఆ తరవాత రచ్చ..రచ్చ చేసాడు. కానీ ఆ తరువాత మళ్లీ పెద్దగా సందడి లేదు. గబ్బర్ సింగ్ 2 స్క్రిప్ట్ తయారీ చేసి అందించాడు. ఆపై గాలిపటం అంటూ ఓ యూత్ ఫిల్ సినిమాను అందించే ఫ్రయత్నం చేసాడు. ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ పక్కా మాస్ కమర్షియల్ సినిమా బెంగాల్ టైగర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనతో గ్రేట్ ఆంధ్ర చిట్ చాట్.

బెంగాల్ టైగర్..టైటిల్ తోనే మాగ్జిమమ్ హైప్ తెచ్చుకున్నట్లున్నారు.

అవునండీ..టైటిల్ అనౌన్స్ చేయగానే అన్ని వైపుల నుంచి మంచి టాక్ వినిపించింది. సినిమా కూడా అలాగే వచ్చింది. ప్రేక్షకులు టైటిల్ ను బట్టి సినిమా మీద పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గదు.

టాప్ హీరో అనగానే భారీ కథ, ట్విస్ట్ లు, ఎమోషన్లు, ఇలా చాలా వ్యవహారాలుంటాయి. ఈ సినిమా కూడా అదే పట్టాలపై వెళ్తుందా?

బెంగాల్ టైగర్ సినిమా..ఓ కామన్ ప్రేక్షకుడు, అంటే మీరు బీ సీ సెంటర్లు అని రాస్తుంటారేం..అలాంటి ప్రేక్షకుడు ప్లస్ అదే సమయంలో మల్టీ ఫ్లెక్స్ ఆడియన్స్ ఇద్దరూ కూడా ఎంజాయ్ చేసే సినిమా. గొప్ప కథ, గొప్ప సినిమా తీసా అని నేను చెప్పను. రవితేజ గారి అభిమానులు, ఆయన సినిమాలు లైక్ చేసేవాళ్లు ఏం ఆశిస్తారో అవన్నీ జోడించిన సినిమా. 

రచ్చ సినిమాలో తమన్నాను ఓ లెవెల్ లో చూపించారు. ఒక విధంగా తమన్నాకు తొలి కమర్షియల్ హిట్. ఇప్పుడు మళ్లీ దానికి డబుల్ డోస్ లో అందాల ఆరబోత కనిపిస్తోంది..అంటే అందాలతో సినిమాను తీరం చేర్చేయడం అన్నది మీ ప్లాన్ అనుకోవాలా?

అందాలు, గ్లామర్ తో సినిమా ఆడదండీ..అలా అయితే ఒక్కో సినిమాలో నలుగురు హీరోయిన్లను కూడా పెట్టుకోవచ్చు. రచ్చ ఆడింది అంటే కారణం ఆ సినిమాలో వున్న పెర్ ఫెక్ట్ స్క్రీన్ ప్లే. అలాంటి స్క్రీన్ ప్లే నే ఈ సినిమాలో కూడా వుంటుంది. ఇక గ్లామర్ అంటారా..అదంతా ఈ సినిమాకు కాదు, ఏ సినిమాకైనా సపోర్టింగ్ ఎలిమెంట్ మాత్రమే.

బెంగాల్ టైగర్ సెకండాఫ్ ఓ మాదిరి అన్న వదంతి ఎందుకు వినిపిస్తోంది.

నేనేైతే వినలేదు..కానీ సెకండాఫ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనీ గా వుంటుదని మాత్రం చెప్పగలను. అయితే అదే సమయంలో కథ కూడా రన్ అవుతుంది. 

బెంగాల్ టైగర్ క్లయిమాక్స్ లో నరకుడు, హింస ఎక్కువ వుందా?

అదేం లేదు. కేవలం నాలుగు నిమషాలు..అది కూడా కొత్తగా వుంటుంది.

రవితేజ అంటేనే ఎంటర్ టైన్ మెంట్...మీరు ఇంకా బ్రహ్మీ, పృధ్వీ, పోసాని లను జోడించినట్లున్నారు. 

సినిమా ఫన్,మాస్ ఎలిమెంట్స్ అంతా హీరో మీదే వుంటాయి..అయితే దానికి పక్కన సపోర్టింగ్ గా ఈ ముగ్గురు వుంటారు.

ఇప్పుడు ఒక్క సినిమా తేడా చేస్తే, డైరక్టర్ ను డిక్కీలో వేస్తున్నారు. అలాంటపుడు చాలా భయంగా సినిమా చేయాల్సి వస్తోంది డైరక్టర్లకు. మీరు ఈ సినిమా ఎలా చేసారు?

సినిమా తీరు తెన్నులు మారిపోయాయి. బడ్జెట్ మారింది. వన్ వీక్ లోనే డబ్బులు రావాల్సి వస్తోంది. అందువల్ల డైరక్టర్ బాధ్యత పెరిగింది. మీరన్నట్లు ప్రతి సినిమాను మొదటి సినిమా అన్నంత జాగ్రత్తగా చేయాల్సి వుంది. నాకూ తెలుసు..ఈ సినిమా హిట్ కొట్టి తీరాలి అని. అందుకే ఎంత జాగ్రత్త పడాలో అంతా తీసుకున్నాను. హిట్ కొడుతున్నాను. 

బోమన్ ఇరానీని తీసుకోవాల్సినంత పాత్ర వుందా సినిమాలో?

ప్రత్యేకించి కాదు..ముఖ్యమంత్రి పాత్ర..కాస్త పెద్ద తరహాగా, హుందాగా వుండాలి. అందుకు ఆయనను తీసుకున్నాం,. అంతకు మించి మరేం లేదు.

మరి ఆయనను తీసుకున్నాక, పాత్ర నిడివి ఏమన్నా పెంచారా? 

లేదు..ఇంకా ఫైన్ ట్యూన్ చేసాం. ఆయన స్టయిల్ ఆఫ్ ఏక్టింగ్ కు సరిపడేలా..అంతే.

రవితేజ కిక్ 2లో అందంగా లేడు అని విమర్శలు వచ్చాయి..మరి మీ సినిమాలో?

ఈ సినిమాలో రవితేజ చాలా అందంగా కనిపిస్తారు. ఇది చెప్పడం కాదు..అబద్ధం చెప్పి, ఎంత సేపో దాయలేం కదా..ఇప్పటికే టీజర్లు, ట్రయిలర్లు, మేకింగ్ విడియోలు, సాంగ్ విడియోలు అన్నీ వదిలాం..వాటిల్లో చూసే వుంటారుగా?

సినిమా ప్రచారం విభిన్నంగా, బాగా చేసారు..సినిమాకు హైప్ బాగా తెచ్చారు..ప్రేక్షకులు..ఆ మేరకు వేసుకున్న అంచనాలు నిలబెడుతుంది మీ సినిమా అని అనుకోవచ్చా?

నూటికి నూరుపాళ్లు..మేం ఏం ప్రచారం చేసామో, ఏం చెప్పామో అదే సినిమాలో వుంటుంది. మొదట్నించీ చెబుతున్నా, ఓ మాంచి నాన్ వెజ్ మీల్స్ పెడుతున్నాం సగటు ప్రేక్షకుడికి.

ఓకె..విష్ యు బెస్టాఫ్ లక్

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?