Advertisement

Advertisement


Home > Movies - Interviews

ఈ తరం ప్రేక్షకుల సినిమా స్పీడున్నోడు

ఈ తరం ప్రేక్షకుల సినిమా స్పీడున్నోడు

భీమినేని శ్రీనివాసరావు..ఈ పేరు వినగానే శుభాకాంక్షలు..సుస్వాగతం..సూర్యవంశం నుంచి సుడిగాడు వరకు బోలెడు సినిమాలు సర్రున గుర్తుకు వచ్చేస్తాయి. ఫన్..మ్యూజిక్..మంచి కథ మిళితం అయిన సినిమాలే ఆయన చేసినవన్నీ. దాదాపు 95శాతం హిట్ లే. అలాంటి డైరక్టర్ సుడిగాడు లాంటి సూపర్ డూపర్ హిట్ తరువాత మూడేళ్ల విరామం తీసుకున్నారు. ఈ మూడేళ్లు ఒకే సబ్జెక్ట్ ను పట్టుదలగా పట్టు వదలకుండా పట్టుకుని కూర్చున్నారు. ఆఖరికి యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో పూర్తి చేసారు.  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఈ వారం వస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు భీమినేనితో గ్రేట్ ఆంధ్ర ముఖాముఖి.

సుడిగాడు లాంటి సూపర్ హిట్ తరువాత రెండు సంఘటనల్లో ఏదో ఒకటి జరగాలి..మిమ్మల్ని ఎవరైనా డైరక్టర్ గా పట్టకుపోవడం లేదా మీరే ఓ సినిమా చేయడం..ఈ రెండూ జరగలేదు.. ఎందుకని?

సుడిగాడు తరువాత వెంటనే మంచి సబ్జెక్టే దొరికింది. అదే తమిళ సూపర్ హిట్ సుందర్ పాండ్యన్. అయితే అది కొంచెం రా గా వుంది. మనవాళ్ల కోసం కాస్త అన్ని రసాలు జోడించాలి అనుకున్నాను. ఎవరు సూట్ అవుతారు అనుకున్నపుడు రవితేజ మంచి ఆప్షన్ అనుకున్నాను. ఆయనకు అదే చెప్పాను. ఆయన కూడా ఓకె అన్నారు. కానీ తీరా స్క్రిప్ట్ రెడీ అయ్యాక, రవితేజకు సూట్ కాదేమో అన్న అనుమానం వచ్చింది. కాస్త ఫ్రెష్ ఫేస్, ఓ ఫిక్స్ డ్ ఇమేజ్ అంటూ లేని ఫేస్ అవసరం అనిపించింది. అప్పుడే అల్లుడు శీను చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ లైన్ లోకి వచ్చారు. మంచి ఛాయిస్ అనుకుని ముందుకు వెళ్లాను. ఇదంతా అయ్యేసరికి వన్ ఇయర్ దాటిపోయింది.

మధ్యలో సునీల్ అని కూడా అనుకున్నట్లున్నారు.?

రవితేజ కాకుంటే..అని సునీల్ ఎలా వుంటుంది అని ఆలోచించిన మాట వాస్తవం. అయితే వన్స్ బెల్లంకొండ శ్రీనివాస్ అనుకున్నాక, ఇక మరేం ఆలోచించలేదు.

మూడేళ్ల పాటు దాచి పెట్టి, అందించగల గొప్ప పాయింట్, సబ్జెక్ట్ అని మీ నమ్మకమా, ఈ సినిమాపై.?

జోనర్ లు మారుతుంటాయి..కానీ కాలానికి నిలిచే సబ్జెక్ట్ లు కొన్ని వుంటాయి. అలాంటి వాటిల్లో ఇది ఒకటి. సబ్జెక్ లో సోల్ అలాంటిది. అది నచ్చే ఈ సినిమాను వదలలేదు. 

రెండో సినిమా, ఎంత మార్కెట్ వుందో తెలియదు. అలాంటిది ఈ యంగ్ హీరోపై 17 కోట్లకు ఫైగా బడ్జెట్ పెట్టడం రిస్క్ అనిపించలేదా?

లేదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా ఓ రేంజ్ లో వుంటే తప్ప, ప్రేక్షకులు థియేటర్ కు రావడం లేదు. బయ్యర్లు ముందుకు రావడం లేదు. అదీ కాక, ఇదే హీరో తొలి సినిమా ఎంత భారీ సినిమానో మీకు తెలిసిందే. అలాంటిది వెంటనే రెండో సినిమా కిందకు జారిపోతే ఏం బాగుంటుంది? అయినా నాకున్న పేరు, విజయాలు, బెల్లంకొండ శ్రీనివాస్ తోలి సినిమా కలెక్షన్లు అన్నీ కలిసి, ఈ సినిమాను మూడు నెలలకు ముందే మార్కెట్ చేసేసాయి.

మళ్లీ మరోసారి నిర్మాత సీట్లో కూర్చున్నట్లున్నారు.?

బరువుగా అనిపించలేదా ఈ బాధ్యతలు. పైగా దర్శకత్వం అంటే సృజన. నిర్మాణం అంటే టెన్షన్ కదా.?

నిజమే నిర్మాణం అంటే ఇంతా అంతా టెన్షన్ కాదు. కానీ అదృష్టవశాత్తూ మంచి టీమ్ దొరికింది. పెద్దగా ఇబ్బంది పడలేదు.

మీ సినిమాల ఆడియోకి మొదట్నించీ మంచి రెస్పాన్స్ వుంటుంది. మరి ఈ సినిమాకు?

నిజమే. శుభాకాంక్షల నుంచి నా అన్ని సినిమాల అడియోలు సూపర్ హిట్ లే. ఈ సినిమా అడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలి కాలంలో రియల్ గా ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ చేసుకున్న సినిమాల్లో స్పీడున్నోడు ఒకటి.

బెల్లంకొండ శ్రీనివాస్ కు రెండో సినిమా. సోనారిక కు రెండో సినిమా. ఇద్దరు ఎలా చేసారు..జోడీ ఎలా వుంది.?

ఇక మీదట కూడా నిర్మాత కమ్ దర్శకుడిగానేనా మీ ప్రయాణం.?

అదేం ఫిక్స్ కాదండీ. మంచి ఫ్రాజెక్టును బట్టి..మన ప్లానింగ్ వుంటుంది.

తరువాత సినిమా ఏమైనా అనుకున్నారా?

ఉన్నమాట చెప్పనా..మన సినిమాకు ఎంత హైప్ వచ్చింది..ఎంతకు అమ్మాం..ఇది కాదండీ కావాల్సింది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు. ఎంత వసూళ్లు వచ్చాయి. అదీ, మన కెరీర్ ను డిసైడ్ చేస్తుంది. దాని కోసం ఆంటే వచ్చే ఫ్రైడే కోసం వెయింటింగ్.

ఈ తరం దర్శకులతో పోటీ పడినట్లున్నారు..ట్రయిలర్ లో పాటలు, ఫైట్లు చూస్తుంటే.?

ఒక విధంగా పోటీ కాదు..నన్ను నేను అప్ డేట్ చేసుకోవడం. మనం కూడా ఈ జనరేషన్ కు తగిన సినిమా ఇవ్వగలం అని ప్రూవ్ చేసుకోవడం. 

ఆ విషయంలో విజయం సాధించాననే అనుకుంటున్నారా?

అది ప్రేక్షకులు చెప్పాలి సినిమా చూసి. లెటజ్ హోప్ ఫర్ ది బెస్ట్

ఆల్ ది బెస్ట్

ధాంక్యూ

విఎస్ఎన్ మూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?